new accounts
-
సిప్..సిప్..హుర్రే!
న్యూఢిల్లీ: దేశీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా వస్తున్న పెట్టుబడుల వాటా అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం... గతనెల్లో ఈ పరిశ్రమ సిప్ మార్గంలో రూ.8,246 కోట్లను ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే నెల్లో ఈ మొత్తం రూ.7,985 కోట్లు. గడిచిన 12 నెలల సగటు ఇన్‌ఫ్లో రూ. 8,000 కోట్లుగా నమోదయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.8,263 కోట్లు, ఆగస్టులో రూ.8,231 కోట్లు, జూలైలో రూ.8,324 కోట్లు, జూన్‌లో రూ.8,122 కోట్లు, మే నెల్లో రూ.8,183 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,238 కోట్లు సిప్ మార్గంలో మ్యూచ్‌వల్ ఫండ్లలోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో సిప్ల ప్రవాహం రూ.57,607 కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.52,472 కోట్లుగా ఉంది. నెలకు సగటున 9.35 లక్షల కొత్త అకౌంట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 9.35 లక్షల చొప్పున కొత్త సిప్ అకౌంట్లు జత అయినట్లు యాంఫీ తెలియజేసింది. వీటిద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న సగటు మొత్తం మాత్రం రూ.2,850గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.89 కోట్ల సిప్ ఖాతాలున్నాయి. పెరుగుతున్న పెట్టుబడుల ప్రవాహ ధోరణి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్‌లో సానుకూలతను సూచిస్తున్నట్లు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంట్‌మెంట్‌ని మెరుగుపరిచిన నేపథ్యంలో సిప్ పెట్టుబడులు జోరందుకున్నాయని విశ్లేషించారు. ఇక 2018–19లో రూ. 92,700 కోట్లు, 2017–18లో రూ. 67,000 కోట్లు, 2016–17లో రూ. 43,900 కోట్లు సిమ్ మార్గంలో మార్కెట్లోకి వచ్చాయి. -
చిక్కుల్లో పేటీఎం: సీఈవో తొలగింపునకు ఆదేశాలు?
సాక్షి,ముంబై: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. కొత్త వినియోగదారుల నమోదును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీంతో తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకోవాలని యోచిస్తున్న డిజిటల్ దిగ్గజం పేటిఎంకు కొత్త చిక్కులు వచ్చినట్టే కనిపిస్తోంది. అధికారిక ఆడిట్ తర్వాత, డిజిటల్ పేమెంట్ బ్యాంకు పేటీఎంలో జూన్ 20నుంచి కొత్త కస్టమర్లను నమోదు చేయడాన్ని ఆర్బిఐ నిలిపివేసిందట. కెవైసీ నిబంధనలు ఉల్లంఘనలు ఆరోపణలతో ఈ ఉత్వర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. అలాగే బ్యాంకు సీఈవో రేణు సత్తిని తొలగించాల్సింది కూడా ఆదేశించినట్టు సమాచారం. దీంతో పాటు కస్టమర్ డేటాను నిల్వ చేయడానికి మెరుగైన భద్రతా యంత్రాంగాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని పేటీఎంకు సూచించింది. ఇందుకు వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుండి వేరుగా నూతన కార్యాలయ ఏర్పాటును కోరింది. మరోవైపు పేటీఎంలో కరెంట్ ఖాతాలను పరిచయం చేసేందుకు, వినియోగదారులు సౌలభ్యంకోసం ఖాతా తెరిచే ప్రక్రియను సులభతరం చేస్తోందని, అందువల్లనే కొత్త నమోదు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అయితే తాజా నివేదికలపై ఆర్బీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే కేవీసీ నిబంధనల ఉల్లంఘనలు, ఇతర ఆరోపణల నేపథ్యంలోగతంలో ఎయిర్‌టెల్‌కుచెందిన చెల్లింపుల బ్యాంకుకు గట్టి షాకే ఇచ్చింది. తాత్కాలికంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు సేవలను నిలిపివేయడంతో పాటు, 5 కోట్ల రూపాయలజరిమానా విధించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పేటీఎం చైనాలోని కౌబే, మిథువాన్ తరహాలో నూతన రిటైల్ బిజినెస్‌ను విస్తరించాలని యోచిస్తున్నట్టు ఇటీవల పేటీఎం సీఈవో రేణు సత్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ లావాదేవీలపై కన్ను
కొత్త ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై నిశిత పరిశీలన న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం చివరి 10 రోజుల్లో జరిగిన కొన్ని అనుమానాస్పద లావాదేవీల్ని క్షుణ్నంగా విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, ఈ–వాలెట్లకు నగదు బదిలీలు, దిగుమతుల కోసం ముందస్తుగా చేసిన చెల్లింపులపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణ ఖాతాలపై కూడా దృష్టి సారించారు. ‘రూ. 50 వేలకు మించిన డిపాజిట్లకు పాన్ నెంబర్ జత చేయని వారిపై ఐటీ శాఖ చర్యలు మొదలుపెట్టింది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి ఆర్జీటీఎస్, ఇతర పద్ధతుల్లో చేసిన నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి సారించారని, తమ విచారణలో వెల్లడవుతున్న అంశాల్ని సంబంధిత విచారణ సంస్థలతో పంచుకుంటున్నామని చెప్పారు. -
‘ఫేస్’ మారింది!
ఫేస్బుక్లో కొత్త అకౌంట్లు తాజా వివరాలతో అప్డేట్లు ఇదీ పార్టీలు మారుతున్న నాయకుల తీరు సుల్తాన్‌బజార్: నిత్యం ఫేస్బుక్ ద్వారా అందరికీ ‘టచ్’లో ఉంటున్న రాజకీయ నాయకులు పార్టీలు మారడమే కాదు...ఫేస్బుక్లో పాత అకౌంట్లకు స్వస్తి చెప్పి.. కొత్తవి తెరుస్తున్నారు. పార్టీలోని నాయకులు.. ప్రజలు... మీడియాకు తాజాగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. కొత్త పార్టీల కండువాలతో పాటు... సంబంధిత నేతలతో కలసి నూతనంగా దిగిన ఫొటోలనూ పెడుతున్నారు. వాట్సాప్‌లోనూ ఇలాగే వివరాలు మారిపోతున్నాయి. ఈ రిక్వెస్ట్‌లు చూస్తున్న ‘ఫ్రెండ్స్’ అవాక్కవుతున్నారు. కొత్త అజెండా కొత్తగా ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న నాయకులు తమ బయోడేటాలతో పాటు పార్టీ జెండాలనూ...అజెండాలనూ అప్లోడ్ చేస్తున్నారు. తాము చేపట్టబోయే అభివృద్ధి పనులనూ అజెండాలో చూపిస్తున్నారు. ఒక్క రోజులోనే మార్పు గోషామహల్ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల తీరు చూసి విస్తుపోవడం ఓటర్ల వంతవుతోంది. సంక్రాంతి పండుగకు పచ్చ పార్టీలో ఉన్న ఓ కీలక నాయకుడు... తనకు టికెట్ రాదని తెలియడంతో...వెంటనే పార్టీతో పాటు డివిజన్‌నూ మార్చేశాడు. పండగకు ముందు రోజు వరకూ పచ్చ పార్టీలో ఉన్న ఆ నాయకుడు మరుసటి రోజు గులాబీ కండువాతో ప్రత్యక్షమయ్యాడు. దీంతో స్థానికులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. -
సేవలకు సెలవు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి దాదాపు అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. మూడు రోజులపాటు ఈ సేవలు ప్రజలకు అందే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూన్ రెండు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్నందున రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అన్ని శాఖలకు చెందిన కొత్త అకౌంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లు కేటాయించి ఆన్లైన్లో అనుసంధానం చేసేందుకు వీలుగా అన్ని శాఖల సేవలను నిలిపివేశారు. ఈ నెల 31, జూన్ ఒకటి తేదీల్లో సేవలు నిలిపివేస్తామని.. రెండో తేదీన అవి పునఃప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ.. ఆరోజు కార్యాలయాలు తెరిచి సర్వర్లు ఆన్ చేసి.. ఖాతాలు, కోడ్ నెంబర్లు తెలుసుకునేసరికే పుణ్యకాలం గడిచిపోతుందని, అందువల్ల ఆ రోజు కూడా సేవల పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా మీ సేవ, ఈ సేవ కేంద్రాలు పని చేయకపోవడం వల్ల దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. దీంతోపాటు మున్సిపల్, రిజిస్ట్రేషన్, రవాణా సేవలు శుక్రవారం సాయంత్రం పనివేళలు ముగిసిన వెంటనే నిలిచిపోయాయి. ఖజానా శాఖలో మార్పుచేర్పుల కోసం నాలుగు రోజుల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశారు. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల బిల్లుల స్వీకరణ, చెల్లింపులు నిలిచిపోయాయి. కొత్త ఖాతాలు ప్రారంభమయ్యే వరకు చెల్లింపులు జరగవని తెలియడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందించే సేవలు.. భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తనఖాలు, వివాహా ధ్రువపత్రాలు, ఈసీలు, నకళ్ల జారీ వంటి సేవలు కూడా స్తం భించాయి. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బంది పడే అవకాశముంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోనుంది. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో మెజారిటీ ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. అత్యధిక ప్రభుత్వ శాఖల లావాదేవీలను ఈ కేంద్రాలతో అనుసంధానం చేయడం వల్ల గత రెండేళ్లుగా ప్రజలు అన్ని రకాల సేవలను వీటి ద్వారానే పొందుతున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు శాఖలతోపాటు పలు ఇతర శాఖల సేవలకు సంబంధించి సుమారు వంద రకాల సేవలు మీ సేవ ద్వారానే అందుతున్నాయి. జూన్ రెండో తేదీ వరకు ఇవన్నీ నిలిచిపోతాయి. జూన్రెండు ఆ తరువాత కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లతో పునఃప్రారంభమవుతాయి.