సాక్షి,ముంబై: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. కొత్త వినియోగదారుల నమోదును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీంతో తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకోవాలని యోచిస్తున్న డిజిటల్ దిగ్గజం పేటిఎంకు కొత్త చిక్కులు వచ్చినట్టే కనిపిస్తోంది.
అధికారిక ఆడిట్ తర్వాత, డిజిటల్ పేమెంట్ బ్యాంకు పేటీఎంలో జూన్ 20నుంచి కొత్త కస్టమర్లను నమోదు చేయడాన్ని ఆర్బిఐ నిలిపివేసిందట. కెవైసీ నిబంధనలు ఉల్లంఘనలు ఆరోపణలతో ఈ ఉత్వర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. అలాగే బ్యాంకు సీఈవో రేణు సత్తిని తొలగించాల్సింది కూడా ఆదేశించినట్టు సమాచారం. దీంతో పాటు కస్టమర్ డేటాను నిల్వ చేయడానికి మెరుగైన భద్రతా యంత్రాంగాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని పేటీఎంకు సూచించింది. ఇందుకు వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుండి వేరుగా నూతన కార్యాలయ ఏర్పాటును కోరింది.
మరోవైపు పేటీఎంలో కరెంట్ ఖాతాలను పరిచయం చేసేందుకు, వినియోగదారులు సౌలభ్యంకోసం ఖాతా తెరిచే ప్రక్రియను సులభతరం చేస్తోందని, అందువల్లనే కొత్త నమోదు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అయితే తాజా నివేదికలపై ఆర్‌బీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే కేవీసీ నిబంధనల ఉల్లంఘనలు, ఇతర ఆరోపణల నేపథ్యంలోగతంలో ఎయిర్‌టెల్‌కుచెందిన చెల్లింపుల బ్యాంకుకు గట్టి షాకే ఇచ్చింది. తాత్కాలికంగా ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవలను నిలిపివేయడంతో పాటు, 5 కోట్ల రూపాయలజరిమానా విధించిన సంగతి తెలిసిందే.
కాగా సుమారు 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పేటీఎం చైనాలోని కౌబే, మిథువాన్ తరహాలో నూతన రిటైల్ బిజినెస్‌ను విస్తరించాలని యోచిస్తున్నట్టు ఇటీవల పేటీఎం సీఈవో రేణు సత్తి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment