పెట్టుబడులకు సరైన సమయం ఏది? | What is the right time to invest? | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు సరైన సమయం ఏది?

Published Mon, Oct 27 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

పెట్టుబడులకు సరైన సమయం ఏది?

పెట్టుబడులకు సరైన సమయం ఏది?

రెండేళ్లుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కో ఫండ్‌లో నెలకు రూ.4,000 చొప్పున నాలుగు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో సిప్ విధానంలో కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో(రూ. 1 లక్ష) ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా?
 - కార్తీక్, రాజమండ్రి

మీ నిర్ణయం సరైనది కాదు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిప్ విధానమే సరైనది. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల యావరేజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. మీ విషయమే తీసుకుంటే, రూ. లక్ష మొత్తాన్ని నాలుగు ఫండ్స్‌ల్లో రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. ఇలా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల పొందే ప్రయోజనాల కంటే కూడా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లభించే లాభాలే అధికం.

నాకు ఇటీవలనే పెళ్లి అయింది. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ నాకు ఇదంతా కొత్త. ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమేనా?                    - అక్షిత, కరీంనగర్

 మార్కెట్లు ఉంటే బుల్ రన్‌లో లేదా బేర్ ఫేజ్‌లో గానీ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లు ఎలా ఉన్నాయనేది ప్రధానాంశం కాకూడదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే,  దీర్ఘకాల రాబడుల(కనీసం ఐదేళ్లు) దృష్ట్యానే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదని మరచిపోకండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) అన్ని విధాలా ఉత్తమం. మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త కాబట్టి. మొదటిగా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అయితే నిలకడైన వృద్ధిని సాధిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై మీకు తగినంత అవగాహన వచ్చిన తర్వాత మీ ఆర్థిక అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

 నేను 2007 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ నా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెం ట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పోయాయి. నా పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్) లేదా నా పేరు ద్వారా ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలను పొందవచ్చా?                  - రాజేష్, గుంటూరు

 డాక్యుమెంట్లు పోయినప్పటికీ,  మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలను పొందే వీలు ఉంది. మీరు ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్ పేరు గుర్తుంటే, ఆ వివరాలు పొందవచ్చు. చాలా ఫండ్ కంపెనీలకు రిజస్ట్రార్లుగా, ట్రాన్స్‌ఫర్ ఏజెం ట్లుగా కార్వీ, క్యామ్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అకౌంటింగ్ స్టేట్‌మెంట్లు తయారు చేస్తాయి. మీరు సదరు సంస్థ వెబ్‌సైట్‌లలోకి వెళ్లి, ఇన్వెస్టర్ సర్వీసెస్‌పై క్లిక్ చేసి, పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ కావాలని అడగండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు మీకు లభించే అవకాశాలున్నాయి. లేదంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇచ్చిన మీ ఫండ్ అడ్వైజర్ ద్వారానైనా ఆ వివరాలను పొందవచ్చు.

 నా రిటైర్మెంట్‌కు ఇంకా పదిహేనేళ్ల సమయం ఉంది. నా రిటైర్మెంట్ అవసరాల కోసం ఎన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో నేను ఇన్వెస్ట్ చేయాలి?
 - సుజాత, హైదరాబాద్

 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయానికొస్తే, రాశి కంటే కూడా వాసి ముఖ్యమనే విషయం గుర్తుం చుకోవాలి. మ్యూచువల్  ఫండ్స్ ద్వారా మంచి రాబడులు పొందాలంటే డైవర్సిఫికేషన్ కీలకం. డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసం 4 లేదా 5 ఫండ్స్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఫండ్స్‌ను ఎంచుకుంటే వాటి పనితీరును, తరచూ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మీ సమయం వృథా అవుతుంది. విభిన్న ఫండ్ మేనేజర్లు నిర్వహించే విభిన్నమైన ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ల సంఖ్య కూడా మరీ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి.
 
 ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement