దేశంలో రోజు రోజుకి మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లో క్రమానుగత పెట్టుబడుల/సిప్‌లకు భారీగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో సిప్‌లలో పెట్టుబడులు రూ.67,000 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడుల పట్ల ప్రజాదరణ పెరుగుతుంది. 2020-21లో సిప్‌లలో ₹96,080 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్‌లలో సిప్‌ల ద్వారా వస్తున్న నిధుల వాటా రెండింతలకు పైగా పెరిగింది. 2016-17లో ఈ నిధులు రూ.43,921 కోట్లుగా ఉంది.
ఇక నెలవారీ సిప్ వసూళ్లు ఈ ఏడాది అక్టోబరులో రూ.10,519 కోట్లతో జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఇది గత నెల సెప్టెంబర్ ₹10,351 కోట్ల కంటే ఎక్కువ. ఇక గత మార్చి ఆఖరున రూ.4.28 లక్షల కోట్లుగా సిప్ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి ₹5.53 లక్షల కోట్లకు పెరిగాయి. అక్టోబర్ నెలలో నమోదైన కొత్త ఎస్ఐపీ/సిప్‌ల సంఖ్య 23.83 లక్షలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) మొత్తం రిజిస్ట్రేషన్లు 1.5 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం మొత్తం 1.41 కోట్ల కొత్త ఎస్ఐపీ రిజిస్ట్రేషన్ల కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లలో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న సిప్‌ల సంఖ్య 4.64 కోట్లుగా ఉంది.
(చదవండి: స్టాక్ మార్కెట్, లక్షల కోట్లు బూడిద పాలయ్యాయి)
ఎస్ఐపీ/సిప్ అంటే ఏమిటి?
ఎస్ఐపీ/సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. వీటిని ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తాయి. సిప్ పథకాలన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అసోసియేషన్ నియంత్రణలో ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిప్ పథకమంటే కొంత రిస్క్ ఉంటుంది. అలాగని పెట్టే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఏమీ ఉండదు. సంప్రదాయ వనరుల్లో కాకుండా కాస్తంత లాభాలు తెచ్చిపెట్టే షేర్లు, బంగారం వంటి పెట్టుబడి సాధనాల్లో ఈ సిప్‌ల ద్వారా ఫండ్ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి.
ఒక క్రమబద్దమైన పెట్టుబడి ప్రణాళిక లేదా ఎస్ఐపీ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే పద్ధతి. ఇక్కడ పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకుని నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఎస్ఐపీ పెట్టుబడి ప్రణాళిక ఒకే సమయంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కాల క్రమేణా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ మొత్తంలో రాబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక సిప్‌ను ప్రారంభించడం చాలా సులువైన విషయం. మీరు చేయాల్సిందల్లా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసేటప్పుడు సిప్ ఆప్షన్‌పై టిక్ చేయండి. ఇక మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచిప్రతి నెలా నిర్ణీత మొత్తం ఆ స్కీమ్‌లోకి డెబిట్ అయ్యేలా బ్యాంక్‌కు ఆదేశాలు ఇస్తే సరి. సిప్ ప్రారంభమవుతుంది.
(చదవండి: గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment