రూ. 2 లక్షల కోట్లకు సిప్‌లు
2022–23తో పోలిస్తే 28 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులపై సానుకూల అంచనాల నేపథ్యంలో క్రమాణుగత పెట్టు బడులు (సిప్) 2023–2024లో రూ. 2 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరాయి. 2022–2023తో పోలిస్తే ఇది 28% అధికం. ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2016–17లో రూ. 43,921 కోట్లుగా ఉన్న సిప్ పెట్టుబడులు 2022–23 నాటికి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి.
ఇవి 2020–21లో రూ. 96,080 కోట్లుగా, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, గతేడాది మార్చి నెలలో సిప్‌ల రూపంలో రూ. 14,276 కోట్లు రాగా ఈ ఏడాది మార్చిలో 35 శాతం వృద్ధి చెంది ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 19,270 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలల పాటు సిప్ పెట్టుబడులు రూ. 19,000 కోట్ల మార్కును దాటాయి.
Comments
Please login to add a commentAdd a comment