
ప్రతీకాత్మక చిత్రం
ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుండగుడు.. అది తెరుచుకోకపోవడంతో నిప్పుపెట్టిన ఘటన ముంబై నగరంలోని బొరివాలీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సతార ప్రాంతానికి చెందిన విలాస్ శిలేవంత్ (22)గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ముంబై నగరంలోని బొరివాలీ వెస్ట్ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షింపోలీ బ్రాంచ్ ఉంది. దానికి ఆనుకునే ఏటీఎం సెంటర్ కూడా ఉంది. నవంబర్ 11న తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఈ ఏటీఎం సెంటర్‌లోని ఏటీఎం మిషన్ మంటల్లో కాలిపోయిన దృశ్యాన్ని గమనించిన బ్యాంక్ సర్వేలెన్స్ సిబ్బంది బ్యాంక్ మేనేజర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడి చేరుకుని పరిశీలించగా ఏటీఎంను ఎవరో తెరవడానికి ప్రయత్నించారని తెలిసింది. దీంతో పోలీసులకు విషయం తెలియజేశారు.
25 నుంచి 30 ఏళ్లున్న యువకుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడినట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది. నిందితుడు ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టడానికి ప్రయత్నించాడని, సాధ్యం కాకపోవడంతో నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఏటీఎం ముందు భాగానికి నిప్పుంటించినప్పటికీ అందులోని క్యాష్ వ్యాలెట్‌ను మాత్రం తెరవలేకపోయాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment