సినిమాను తలపించేలా బ్యాంకు దోపిడీ | Rs 3 crore stolen from Bank of Baroda branch in Mumbai, robbers caught on CCTV  | Sakshi
Sakshi News home page

సినిమాను తలపించేలా బ్యాంకు దోపిడీ

Published Fri, Nov 17 2017 6:30 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Rs 3 crore stolen from Bank of Baroda branch in Mumbai, robbers caught on CCTV  - Sakshi

ముంబై : సినిమాలో చూపించేలా దుండగులు బ్యాంకు దోపిడికి పాల్పడ్డారు. ముంబైలో బ్యాంకు ఆఫ్‌ బరోడా బ్రాంచు నుంచి రూ.3 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. నేవి ముంబైలోని బ్యాంకు ఆఫ్‌ బరోడా బ్రాంచులో నవంబర్‌12న ఈ దొంగతనం జరిగింది. ఈ సంఘటనపై సీసీటీవీ పుటేజి ఒకటి బయటపడింది. ఈ పుటేజీలో ముగ్గురు దుండగులు బ్యాంకు నుంచి నవంబర్‌ 12న ఉదయం పూట నగదును, ఇతర విలువైన వస్తువును పట్టుకొని వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దొంగతనం కోసం దుండగులు 25 అడుగుల సొరంగం కూడా తవ్వారు. ఈ సొరంగ మార్గం ద్వారా దొంగలు బ్యాంకు లాకర్ల వద్దకు చేరుకున్నారు. లాకర్ల నుంచి నగదును, విలువైన వస్తువులను దొంగలించారు.

అనంతరం ఆ విలువైన వస్తువులను తీసుకుని నడక మార్గాన బయటికి వెళ్లినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఈ సొరంగ మార్గం బ్యాంకు స్టోర్‌ రూమ్‌కు వెలుపల ఉన్న ఒక పరిసర దుకాణం నుంచి తవ్వినట్టు తెలిసింది. ఈ బ్యాంకు స్టోర్‌ రూమ్‌ విలువైన వస్తువులను, డాక్యుమెంట్లను కాపాడటానికి ప్రజలకు అద్దెకిచ్చిన ప్రైవేటు లాకర్లను కలిగి ఉంది. బ్యాంకు స్టాఫ్‌ లాకర్ల వద్దకు వెళ్లినప్పుడు, దొంగతనం జరిగినట్టు గుర్తించారని, నవంబర్‌ 13 ఉదయం పూట ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement