IRCTC: Railway Users To Get Cheaper Tickets Using This Card Full Details In Telugu - Sakshi
Sakshi News home page

రైల్వే ప్ర‌యాణికుల‌కు బంప‌రాఫ‌ర్‌, త‌క్కువ ధ‌ర‌కే ట్రైన్ టికెట్‌లు!! ఎలా అంటే?

Published Wed, Feb 23 2022 12:50 PM | Last Updated on Wed, Feb 23 2022 3:13 PM

Irctc Users To Get Cheaper Tickets Using This Card  - Sakshi

రైల్వే ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ శుభ‌వార్త. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ ధర టిక్కెట్‌లను అందిస్తున్న‌ట్లు తెలిపింది. త‌ర‌చూ దూర ప్రాంతాల‌కు రైల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు త‌క్కువ ధ‌ర‌కే టికెట్‌ల‌ను అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్‌) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) సంయుక్తంగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. 

ఐఆర్‌సీటీసీ వినియోగ‌దారులు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏదైనా ఏసీ క్లాస్ రైల్వే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే త‌క్కువ ధ‌ర‌కే ట్రైన్ టికెట్‌ల‌ను పొంద‌వ‌చ్చు. అంతేకాదు ఈ కార్డ్ తో కిరాణా స్టోర్ నుంచి పెట్రోల్ బంకుల‌తో పాటు ఇత‌ర షాపింగ్ ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. జేసీబీ నెట్‌వర్క్ సాయంతో అంత‌ర్జాతీయ వ్యాపార కార్యాల‌పాలు నిర్వ‌హించే వారు ఏటీఎం ట్రాన్సాక్ష‌న్‌లు నిర్వ‌హించేందుకు ఈ కార్డ్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.  

ఈ సంద‌ర్భంగా ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌జ‌ని హసిజాతో మాట్లాడుతూ..ఐఆర్‌సీటీసీ బాబ్ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్కార్డ్ హోల్డర్లు 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ,సీసీ,ఎగ్జిక్యూటివ్‌పై గరిష్టంగా 40 రివార్డ్ పాయింట్‌లను పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన క్లాస్ బుకింగ్‌లు చేసే కార్డ్ కస్టమర్లు ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లపై ఒక శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. కార్డ్ జారీ చేసిన 45 రోజులలోపు రూ.1000లేదా అంతకంటే ఎక్కువ విలువైన బోనస్ రివార్డ్ పాయింట్లు
పొంద‌వ‌చ్చ‌ని ర‌జ‌నీ తెలిపారు.  

కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లపై నాలుగు రివార్డ్ పాయింట్‌లు, ఇతర వినియోగంపై రెండు రివార్డ్ పాయింట్‌లను అందిస్తుంది.  రైల్వే లాంజ్‌లలో కార్డు హోల్డర్‌లు సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ విజిట్ చేయోచ్చు. అంతేకాదు ఈ కార్డ్ సాయంతో దేశంలో అన్నీ పెట్రోల్ బంకుల్లో ఒక శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు అందిస్తుంది. కార్డ్ హోల్డర్‌లు ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడీతో లింక్ చేసిన తర్వాత, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో రివార్డ్ పాయింట్‌లు రీడీమ్ చేసుకోవ‌చ్చు.

చ‌ద‌వండి: రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్‌‌ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement