Train Travel charge
-
రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్, తక్కువ ధరకే ట్రైన్ టికెట్లు!! ఎలా అంటే?
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ ధర టిక్కెట్లను అందిస్తున్నట్లు తెలిపింది. తరచూ దూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ ధరకే టికెట్లను అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) సంయుక్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఐఆర్సీటీసీ వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏదైనా ఏసీ క్లాస్ రైల్వే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ట్రైన్ టికెట్లను పొందవచ్చు. అంతేకాదు ఈ కార్డ్ తో కిరాణా స్టోర్ నుంచి పెట్రోల్ బంకులతో పాటు ఇతర షాపింగ్ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. జేసీబీ నెట్వర్క్ సాయంతో అంతర్జాతీయ వ్యాపార కార్యాలపాలు నిర్వహించే వారు ఏటీఎం ట్రాన్సాక్షన్లు నిర్వహించేందుకు ఈ కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజని హసిజాతో మాట్లాడుతూ..ఐఆర్సీటీసీ బాబ్ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్కార్డ్ హోల్డర్లు 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ,సీసీ,ఎగ్జిక్యూటివ్‌పై గరిష్టంగా 40 రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన క్లాస్ బుకింగ్‌లు చేసే కార్డ్ కస్టమర్లు ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లపై ఒక శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. కార్డ్ జారీ చేసిన 45 రోజులలోపు రూ.1000లేదా అంతకంటే ఎక్కువ విలువైన బోనస్ రివార్డ్ పాయింట్లు పొందవచ్చని రజనీ తెలిపారు. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కిరాణా, డిపార్ట్మెంటల్ స్టోర్లపై నాలుగు రివార్డ్ పాయింట్లు, ఇతర వినియోగంపై రెండు రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. రైల్వే లాంజ్లలో కార్డు హోల్డర్లు సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ విజిట్ చేయోచ్చు. అంతేకాదు ఈ కార్డ్ సాయంతో దేశంలో అన్నీ పెట్రోల్ బంకుల్లో ఒక శాతం ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు అందిస్తుంది. కార్డ్ హోల్డర్లు ఐఆర్సీటీసీ లాగిన్ ఐడీతో లింక్ చేసిన తర్వాత, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో రివార్డ్ పాయింట్లు రీడీమ్ చేసుకోవచ్చు. చదవండి: రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..! -
ఇక ప్రైవేట్ రైళ్లు- రైల్వే షేర్లు గెలాప్
ప్రయాణికుల రైళ్లను ప్రయివేట్ సంస్థలు సైతం నిర్వహించేందుకు రైల్వే శాఖ ఆహ్వానం పలకడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. మొత్తం 109 రూట్లలో రెండు వైపులా ప్యాసింజర్ ట్రయిన్ల నిర్వహణకు ఆసక్తి ఉన్న కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చంటూ రైల్వే శాఖ తాజాగా పేర్కొంది. అర్హతగల కంపెనీలు ప్రతిపాదనలు పంపించవలసిందిగా కోరింది. 151 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు రైల్వే శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో రైల్వే సంబంధిత కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కూ.. చుక్‌చుక్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రైల్ వికాస్ నిగమ్ 8 శాతం జంప్‌చేసి రూ. 21కు చేరగా.. రైట్స్ లిమిటెడ్ 5.5 శాతం ఎగసి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రైట్స్ షేరు రూ. 292 వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో ఐఆర్సీటీసీ 4.5 శాతం పెరిగి రూ. 1424 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 1468 సమీపానికి ఎగసింది. ఇక సిమ్కో లిమిటెడ్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 18.5 వద్ద నిలవగా.. టెక్స్మాకో రైల్ ఏకంగా 16 శాతం పరుగు తీసింది. రూ. 30.5 వద్ద ట్రేడవుతోంది. ఇక టిటాగఢ్ వేగన్స్ సైతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 36 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో బీఈఎంఎల్, ఎల్అండ్టీ తదితరాలు సైతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. రూ. 30,000 కోట్లు దేశీ రైల్వే నెట్‌వర్క్‌లోని 12 క్లస్టర్లలో 109 మార్గాలలో రెండు వైపులా ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇందుకు రూ. 30,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించవలసి ఉంటుందని అంచనా. ఇందుకు వీలుగా అర్హతగల ప్రయివేట్ సంస్థలకు ఆహ్వానం పలికింది. తద్వారా ఆధునిక సాంకేతికతో కూడిన కోచ్‌లు, ప్రయాణ సమయం తగ్గింపు, నిర్వహణ వ్యయాల అదుపు, భద్రత పెంపు వంటి సానుకూలతలకు తెరతీయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందుకు ఆసక్తి గల ప్రయివేట్ సంస్థలు ప్రతిపాదనలు పంపించవలసిందిగా రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. 35 ఏళ్లపాటు కన్సెషన్ గడువును విధించనున్నారు. -
పినాకినీ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో గలాటా!
సాక్షి, ఒంగోలు: పినాకినీ ఎక్స్‌ప్రెస్ ఎసి చైర్ కార్ బోగీలో గురువారం ఉదయం గలాటా చోటుచేసుకుంది. 25 మంది ప్రయాణికులు నాగపట్నం వెళ్లేందుకు ఏసీ చైర్‌కార్‌లో రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే వీరిలో కొంతమందికి చీరాల నుంచి టికెట్లు రిజర్వు అయ్యాయి. దీంతో వారు జనరల్ టిక్కెట్ తీసుకొని ఏసీ చైర్‌కార్ బోగీ ఎక్కారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలోకి వచ్చేసరికి టీసీ వారి టికెట్లను పరిశీలించి జనరల్ టిక్కెట్‌తో ఎలా ఏసీ బోగీ ఎక్కారంటూ జరిమానా కట్టమన్నాడు. రూ. 947లు కట్టాలని చెప్పగా వెయ్యి రూపాయలు తాము చెల్లించామని, రశీదు అడగడంతో టీసీ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, దీంతో తాము ఒంగోలు రైల్వేస్టేషన్లో దిగి జి.ఆ.ర్పి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కంకణాల సుబ్బారావు, ఉదయ్‌కిరన్ అనే వారు తెలిపారు. రశీదు రాశాడో లేదో కూడా తమకు తెలియదని, చివరకు అడిగినందుకు తన సెల్‌ఫోన్ కూడా తీసుకుపోయారని గట్టిగా ప్రశ్నించడంతో ఇచ్చారని పేర్కొన్నారు. జీఆర్పీ ఒంగోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం.జె కిషోర్‌బాబు మాట్లాడుతూ ఘటన విజయవాడ సబ్ డివిజన్ పరిధిలో జరగడంతో ఫిర్యాదును తెనాలికి పంపామని తెలిపారు. -
ఎంత కఠినమో
- రైలు చార్జీల పెంపుతో సామాన్యుల గగ్గోలు - జిల్లా ప్రయాణికులపై రోజూ రూ.లక్షల అదనపు భారం సాక్షి, రాజమండ్రి / రాజమండ్రి సిటీ : నరేంద్రమోడీ సర్కారు ఆదిలోనే తీసుకున్న బాదుడు నిర్ణయం జిల్లా ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ముందెన్నడూ లేని విధంగా అన్ని రకాల రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం పెంచడంతో జిల్లావాసులు గగ్గోలు పెడుతున్నారు. రైలు చార్జీల పెంపు ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరిగినా సాధారణ ప్రయాణికులను మినహాయిస్తారని భావించారు. అయితే మోడీ సర్కారు.. ‘వడ్డించే’ విషయంలో తనకు ఎలాంటి విచక్షణా లేదని చాటుకుంది. జిల్లాలో ప్రధాన మైన రాజమండ్రి రైల్వేస్టేషన్ నుంచి రోజూ 30 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. సుమారు 3000 మంది రిజర్వేషన్‌తో వివిధ తరగతుల్లో ప్రయాణిస్తారు. తర్వాత ముఖ్యమైన సామర్లకోట నుంచి సుమారు 20 వేల మంది అన్ని తరగతుల్లో ప్రయాణిస్తారు. 2000 మందికి పైగా రిజర్వేషన్లను పొందుతారు. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి రోజూ సుమారు 10 వేల మంది ప్రయాణిస్తారు. వెయ్యి మంది వరకూ రిజర్వేషన్లు చేయించుకుంటారు. పెంచిన చార్జీలతో నిత్యం వీరందరిపై రూ.లక్షల్లో అదనపు భారం పడనుంది. ప్రయాణ చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం వలన రాజమండ్రి స్టేషన్ నుంచి నిత్యం జరిగే వివిధ సరుకుల రవాణాపై అదనపు భారం పడనుంది. చార్జీల పెంపు దారుణం.. ప్రజారంజకమైన పాలన అంటూ గద్దె నెక్కిన మోడీ సర్కార్ రైలు చార్జీలను అమాంతం పెంచి పేదల నడ్డి విరిచింది. పాలన చేపట్టి నెల కాకుండానే ఇలా చేయడం దారుణం. ధనిక వర్గాలతో సమానంగా టిక్కెట్ ధర పెంచడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. పెంపును విరమించి పేదలను ఆదుకోవాలి. - కేఎల్ఎన్రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, రాజమండ్రి