
సాక్షి, ఒంగోలు: పినాకినీ ఎక్స్‌ప్రెస్ ఎసి చైర్ కార్ బోగీలో గురువారం ఉదయం గలాటా చోటుచేసుకుంది. 25 మంది ప్రయాణికులు నాగపట్నం వెళ్లేందుకు ఏసీ చైర్‌కార్‌లో రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే వీరిలో కొంతమందికి చీరాల నుంచి టికెట్లు రిజర్వు అయ్యాయి. దీంతో వారు జనరల్ టిక్కెట్ తీసుకొని ఏసీ చైర్‌కార్ బోగీ ఎక్కారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలోకి వచ్చేసరికి టీసీ వారి టికెట్లను పరిశీలించి జనరల్ టిక్కెట్‌తో ఎలా ఏసీ బోగీ ఎక్కారంటూ జరిమానా కట్టమన్నాడు. రూ. 947లు కట్టాలని చెప్పగా వెయ్యి రూపాయలు తాము చెల్లించామని, రశీదు అడగడంతో టీసీ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, దీంతో తాము ఒంగోలు రైల్వేస్టేషన్‌లో దిగి జి.ఆ.ర్‌పి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కంకణాల సుబ్బారావు, ఉదయ్‌కిరన్ అనే వారు తెలిపారు. రశీదు రాశాడో లేదో కూడా తమకు తెలియదని, చివరకు అడిగినందుకు తన సెల్‌ఫోన్ కూడా తీసుకుపోయారని గట్టిగా ప్రశ్నించడంతో ఇచ్చారని పేర్కొన్నారు. జీఆర్పీ ఒంగోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం.జె కిషోర్‌బాబు మాట్లాడుతూ ఘటన విజయవాడ సబ్ డివిజన్ పరిధిలో జరగడంతో ఫిర్యాదును తెనాలికి పంపామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment