![Bank of Baroda Announced Several Incentives For home,car loan borrowers - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/7/Bank-of-Baroda.jpg.webp?itok=u8H_IIGG)
ముంబై: పండుగల వాతావరణం నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్‌ను పెంచడానికి పలు చర్యలు తీసుకుంటున్న బ్యాంకుల జాబితాలో తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. గృహ, కారు రుణ గ్రహీతలకు పలు ప్రోత్సాహకాలను మంగళవారం ప్రకటించింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం– బరోడా గృహ రుణాలు (ఇతర బ్యాంక్ నుంచి రుణాన్ని బదలాయించుకున్న ఖాతాలకు సంబంధించి) , బరోడా కారు రుణాలకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వడ్డీరేటుపై పావుశాతం తగ్గింపు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఎస్‌బీఐ ఇప్పటికే పండుగ ఆఫర్లను ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100% మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికీ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరిం చింది. ఇక, క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment