బ్యాంక్ బరోడాలో అవినీతి తిమింగలం!
బ్యాంక్ బరోడాలో అవినీతి తిమింగలం!
Published Fri, Feb 10 2017 8:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.6.5కోట్ల నల్లధనాన్ని మార్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి చీఫ్ మేనేజర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని మండోలి ప్రాంతంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి చీఫ్ మేనేజర్ కొందరు ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి నిబంధనలకు వ్యతిరకేంగా వివిధ బ్యాంకు అకౌంట్లలోకి రూ.6.5 కోట్ల నగదును పంపి మార్పిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పింది.
విజిలెన్స్ అధికారులతో పాటు బ్యాంకులో చేసిన తనిఖీల్లో వివిధ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు తెలిసిందని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు ముందు వరకూ ఆయా అకౌంట్లలో తక్కువ నిల్వలు ఉన్నాయని ఆ తర్వాత అకౌంట్ల నగదు గణనీయంగా పెరిగిందని చెప్పింది. వీటిలో కొన్నింటికి కేవైసీ డాక్యుమెంట్లు జత చేయలేదని పేర్కొంది. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
Advertisement