
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ), ఏఐసీ ఎస్‌టీపీఐనెక్ట్స్‌తో బ్యాంకు ఆఫ్ బరోడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు సహకారం అందించనున్నట్టు బ్యాంకు ప్రకటించింది.
స్టార్టప్‌లకు కేంద్రాలైన గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, ఇండోర్, కోచి ఇలా 15 ప్రాంతాల్లో స్టార్టప్ శాఖలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. స్టార్టప్‌ల కోసమే ఆకర్షణీయమైన రేట్లతో రుణ పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది.