loan subcidy
-
పీఎమ్ఈజీపీ రుణాలు..: పెన్నుల నుంచి పాలిమర్స్ దాకా...
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్.పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. 2008లో మొదలైన ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించి వారి ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఈ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ కేవీఐసీ ద్వారా ఇది అమలవుతోంది. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణసౌకర్యం అందుతోంది. అభ్యర్థులు పది శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సహాయాన్ని పొందవచ్చు. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రం అయిదు శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకులు 95 రుణాన్ని అందిస్తాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్డ్, ట్రాన్స్‌జెండర్స్, గ్రామీణ ప్రాంతం వారికి 35 శాతం రాయితీ కూడా లభిస్తుంది. జనరల్ కేటగిరీలోని వారికేమో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ కేటాయించారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి... ముందుగా అభ్యర్థులు పీఎమ్ఈజీపీ పోర్టల్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అందులో వివరాలను స్పష్టంగా, పూర్తిగా నింపాలి. తర్వాత దాన్ని గ్రామీణప్రాంతాలవారైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతం వారైతే డీఐసీకి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన ఉంటుంది. అధికారుల తనిఖీ అనంతరం వారి సూచన మేరకు.. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణకు సంబంధించిన పరీక్ష కూడా పాసై, సర్టిఫికెట్ పొందాలి. అర్హతలు... 18 ఏళ్లు నిండి, కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా అర్హులే! ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలు... 1. వ్యాపారానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్, 2. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సహా వివరాలు నమోదు చేసిన అప్లికేషన్ ఫామ్, 3. ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, 4. శిక్షణ పొందిన ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ప్రోగ్రామ్ సర్టిఫికెట్. 5. ఎక్స్‌పీరియెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్. వ్యాపారాలు... పేపర్ నాప్కిన్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్.. అనుబంధ ఉత్పత్తులు, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పెన్నుల తయారీ, షాంపూ, డిటర్జెంట్లు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ తయారీ, ΄్యాక్డ్ వాటర్, ఎల్ఈడీ లైట్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయన పాలిమర్లు, టెక్స్టైల్స్, ఫారెస్ట్ ఇండస్ట్రీ వంటివాటికీ ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయాధారిత, పాడి, వర్తక విభాగాల్లోనూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2022– 2025 మధ్య కాలంలో ఈ పథకానికి 13,554.42 కోట్ల రూపాయలను కేటాయించారు.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
రైతులకు తనఖా లేకుండా రూ.2 లక్షల రుణం
న్యూఢిల్లీ: రైతులకు తనఖా లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఇది 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆదేశించింది. ఇప్పటి వరకు తనఖా లేని రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉంది. ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు సులభంగా రైతులకు చేరేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా సూచించింది. వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలను పెంపొందించడానికి, వ్యవసాయ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి ఈ చొరవ ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు. వ్యవసాయ ముడిసరుకు ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించడం, రుణ లభ్యత పెంచడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ చొరవ కీలక దశగా ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
TS: బీసీలకు ఆర్థిక సాయం.. గడువు ముగుస్తోంది.. దరఖాస్తు ఎలా?
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన కులవృత్తుల కుటుంబాల్లో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని తలపెట్టారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, నివాస, ఆహార భద్రత తదితర ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్ లోడ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు విధించడంతో అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ► గడచిన వారం రోజులుగా ఖైరతాబాద్, షేక్‌పేట మండల కార్యాలయాలకు బీసీ కులవృత్తుల అర్హులు ధ్రువపత్రాల కోసం బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం కింద సుమారు లక్ష మంది అర్హులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ధ్రువీకరణ పత్రం మంజూరయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుండటంతో లబి్ధదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ►దరఖాస్తు చేసుకునేందుకు ఆహార భద్రతా కార్డులు తప్పనిసరి చేయడంతో నాలుగేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు కానివారంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇలా నష్టపోతున్నవారిలో సుమారు 50 వేల మంది వరకు అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ► దీనికి తోడు సర్వర్ డౌన్ మరింత తీవ్ర సమస్యగా మారింది. అసలే గడువు సమీపిస్తున్నదని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా మూడు రోజులుగా సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీని వల్ల మండల కార్యాలయాల్లో పత్రాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. దళారులను ఆశ్రయిస్తున్న వైనం... ►నిబంధనల ప్రకారం నూతన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచాలని సూచించడం, గడువు తేదీ సమీపిస్తుండటంతో చాలా మంది లబ్ధిదారులు వీటిని పొందేందుకు పక్కదారులు చూస్తున్నట్లు సమాచారం అందుతున్నది. ► దరఖాస్తుదారుల స్థోమతను బట్టి కొంత మంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మీసేవా కేంద్రాల్లో ఈ పత్రాలు అప్లోడ్ చేసేందుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు. ► లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మీ సేవా కేంద్రాలు అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఎలాంటి నిఘా లేకపోవడంతో సమస్య రోజురోజుకు జఠిలమవుతూ లబి్ధదారులు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది. గడువు పెంచాలి:నాయీ బ్రాహ్మణ సేవాసంఘం రహమత్‌నగర్: బీసీ చేతి వృత్తులవారికి ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు గడువును పెంచాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయీ మాట్లాడుతూ... దరఖాస్తు చేసేందుకు ఈ నెల 20వ తేదీన ఆఖరి కావడంతో కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం చేతి వృత్తుల వారు తహసీల్దార్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారన్నారు. విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కులవృత్తుల వారు దరఖాస్తుల చేస్తుండటంతో మీ సేవ సర్వర్ పనిచేయక జాప్యం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు నిరుపేదలు చాలా మందికి రేషన్ కార్డులేక పోవడంతో ఆర్థిక సాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించి, రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన మినహాయించాలని ఆయన కోరారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సత్యనారాయణ, రహమత్‌నగర్ సత్యనారాయణ, కృష్ణానగర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అదానీ కాపర్ యూనిట్‌కు రూ,6,071 కోట్ల రుణం
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కాపర్ తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఎస్బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,071 కోట్ల రుణాన్ని సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఏడాదికి మిలియన్ టన్నుల కాపర్ తయా రీ యూనిట్‌ను గుజరాత్‌లోని ముంద్రాలో, అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ ‘కుచ్ కాపర్ లిమిటెడ్’ ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా 0.5 మిలియన్ టన్నులతో కూడిన మొదటి దశకు సిండికేటెడ్ క్లబ్ లోన్ రూపంలో ఫైనాన్షియల్ క్లోజర్ (రుణ ఒప్పందాలు) పూర్తయినట్టు తెలిపింది. ఎస్ బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం (బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర)తో ఒప్పందం చేసుకున్న ట్టు ప్రకటించింది. ప్రాజెక్టు తొలి దశ 2024లో మొదలవుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ వినయ్ ప్రకాశ్ తెలిపారు. ‘‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ రిఫైనరీ కాంప్లెక్స్‌ల్లో ఒకటి అవుతుంది. బెంచ్‌మార్క్ ఈఎస్జీ (పర్యావరణ అను కూల) పనితీరు ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, డిజిటైజేషన్‌తో ఉంటుంది’’ అని చెప్పారు. -
రుణం ఇప్పిస్తామని రూ.8కోట్లకు టోకరా
ఘట్కేసర్: గొర్రెల పంపిణీ సబ్సిడీ రుణం ఇప్పిస్తామని చెప్పి అమా యకుల దగ్గర్నుంచి రూ.8 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొర్రెముల్ సహాయ పశువైద్యాధికారి సజ్జ శ్రీనివాస్‌రావు, సజ్జ లక్ష్మి, కొల్లి అరవింద్‌కుమార్ గొల్ల, కురుమల దగ్గర రూ.8 కోట్లు వసూలు చేశారు. ఎంతకూవీరు రుణాల ఊసెత్తకపోవడంతో డబ్బులిచ్చిన వారు గట్టిగా నిలదీశారు. దీంతో అప్పట్నుంచి ఈ ముగ్గురూ ఎవరికీ కన్పించకుండా ముఖం చాటేశారు. ఎనిమిది నెలల క్రితం కూకట్ పల్లికి చెందిన బాధితులు ప్రమీలా, జ్యోతి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించి వీరిపై కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. శ్రీనివాస్, లక్ష్మి దంపతులు మేడ్చల్‌లో, అరవింద్ కుమార్ రామాంతపూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు వల పన్ని శుక్రవారం అరెస్టు చేశారు. వీరిని ఎల్బీనగర్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరచగా కోర్టు వీరికి రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో మరో నిందితుడు సజ్జ శ్రీనివాస్ బావమరిది అనిల్ కుమార్ పరారీలోనే ఉన్నాడు. వీరందరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎవరైనా బాధితులుంటే ఫిర్యా దు చేయాలని సూచించారు. కేసును ఛేదించిన ఘట్కేçసర్ పీఎస్ సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. -
ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరింపులు.. ఆపై
హరిత స్నేహితురాలికి ఫోన్ చేస్తే వాళ్ల అమ్మ ఫోన్ ఎత్తింది. ‘భవ్యను ఆసుపత్రిలో చేర్చాం’ అని ఏడుస్తూ చెప్పడంతో కంగారుగా హాస్పిటల్‌కి చేరుకుంది హరిత. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. భవ్య మాట్లాడుతుందని డాక్టర్లు చెప్పడంతో స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది హరిత. ‘ఏమైంద’ని అడిగితే చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. యాప్ ద్వారా తీసుకున్న లోన్ గురించి చెప్పి, బ్లాక్మెయిల్ చేస్తున్నారని, తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశానని చెప్పింది భవ్య,. (పేర్లు మార్చడమైనది) నెల రోజుల క్రితం... ‘ఇంతమందికి పార్టీ అంటే బాగానే ఖర్చు అవుతుంది. మీ నాన్న ఎన్ని డబ్బులు ఇచ్చారు?’ భవ్యను అడిగింది హరిత. ‘నాన్న అంత మనీ ఎందుకు ఇస్తారు. యాప్ నుంచి లోన్ తీసుకున్నాను. పాకెట్ మనీ ఇస్తారుగా, కొంత కొంత కట్టేస్తే సరిపోతుంది’ అని చెప్పింది భవ్య. ‘ఈ యాప్ మనీ ఏంటో ఈజీగా ఉంది. నాక్కూడా చెప్పవా!’ అనడంతో ఆ వివరాలన్నీ హరితకూ చెప్పింది. యాప్ ద్వారా తీసుకున్న ఇన్స్టంట్ మనీ తమ జీవితాలతో ఎలా ఆడుకుంటుందో అర్థమయ్యాక స్నేహితులిద్దరూ ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. కాలేజీకి వెళ్లే యువత మాత్రమే కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఇలాంటి ‘యాప్’ ఆధారిత లోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. రుణం ఇచ్చేవారెవరో తెలియకుండా తీసుకునే లోన్ల కారణంగా రకరకాల సమస్యల్లో చిక్కుకుంటున్నారు. నేరాలకు సులువైన మార్గం ఇటీవల యాప్‌ల ద్వారా రూ.500 నుంచి 50,000 వేల వరకు తక్షణ రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటి రికవరీ వ్యూహాల కారణంగా ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న కేసులు అధికారికంగా నమోదు అయ్యాయి. రుణమాఫీ కోసం యాప్ నిర్వాహకులు ఎంచుకుంటున్న నేర మార్గాలు కూడా ప్రధాన కారణం అవుతున్నాయి. లోన్ అంటూ ఇలాంటి తక్షణ రుణం ఇచ్చే యాప్‌లకు ఎలాంటి వెబ్సైట్ ఉండదు. ఈ యాప్‌లు ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిలో కంపెనీకి సంబంధించిన సమాచారం, లైసెన్స్.. వంటి ఇతర వివరాలేవీ ఉండవు. ఇ–మెయిల్, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంటాయి. వాటిలో శాలరీ అడ్వాన్స్ లోన్, ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అనే రెండు వేర్వేరు పేర్లతో ఉంటాయి. నిజానికి గూగుల్‌ప్లే స్టోర్ 60 రోజులకంటే తక్కువ కాలవ్యవధితో రుణాలను అందించే యాప్‌లను అనుమతించదు. ఉల్లంఘన కారణంగా చాలా యాప్‌లను ప్లే స్టోర్ తొలగించింది కూడా. అయితే, అవి మళ్లీ వేరే పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయి. వేధింపులకు తెర తీస్తారు.. ఒక సెల్ఫీ, ఆధార్ నెంబర్‌తో రుణాలను ఇవ్వడానికి కొన్ని రకాల ‘యాప్’లు ఆమోదిస్తుంటాయి. ఇది పూర్తి చట్ట విరుద్ధం. ఒకేసారి కాకుండా వివిధ దశలలో రుణం మంజూరు చేస్తుంటారు. విపరీతమైన వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ.. ఇతర రుసుముల కింద మరింత మొత్తం ముందే చెల్లింపుల కింద కట్ చేస్తారు. వారం సమయం ఇచ్చి, వడ్డీ చెల్లించమని వేధిస్తుంటారు. ►లోన్ చెల్లించనట్లయితే దూకుడు వ్యూహాలను అమలు చేస్తారు. మీ ఫోన్ జాబితాలో కాంటాక్ట్స్‌ను ఉపయోగించి, ‘మీ పేరు గ్యారెంటీగా ఇచ్చార’ని నకిలీ సాకును చూపుతారు. ►మీ ఫోన్ కాంటాక్ట్ జాబితాలో అమ్మ, నాన్న, జీవిత భాగస్వామి, సోదరుడు, సహోద్యోగులు, స్నేహితులు .. వంటి సేవ్ చేసిన అన్ని నంబర్లకు కూడా ఫోన్ చేసి వేధిస్తారు. ►అర్థరాత్రి కూడా ఫోన్ చేస్తారు. ఒకే రోజులో వివిధ ఫోన్ నెంబర్ల నుంచి దాదాపు 100 కాల్స్ చేసి, మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. ►బాధితుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన ప్రమాదకర ఘటనలూ జరిగాయి. బాధిత కుటుంబ సభ్యులకూ వాటిని పంపే అవకాశం ఉంది. ►నకిలీ లాయర్ నోటీసులు పంపుతారు. ∙సిబిల్ స్కోర్ సున్నా, భవిష్యత్తులో ఎలాంటి రుణం పొందలేరు అని బెదిరిస్తారు. ►ఒక్క రోజు ఆలస్యం అయినా కేవలం ఐదు నిమిషాల్లో రుణం చెల్లించాలని బాధితులపై ఒత్తిడి తెచ్చి, తిరిగి చెల్లించేందుకు మరో రుణం ఇస్తారు. హెచ్చరిక సంకేతాలివి... ►మీ క్రెడిట్ స్కోర్ చెక్ ఎంత అనే పట్టింపులేవీ ఉండవు. మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి ఇది ప్రధాన హెచ్చరికగా గుర్తించాలి. ►వారి చిరునామా ఎక్కడా ఉండదు. వారిని సంప్రదించే సమాచారాన్నీ ఇవ్వరు. ►నకిలీ రుణదాతలు జీఎస్టీ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులతో ముందస్తు చెల్లింపు లేదా రుసుమును డిమాండ్ చేయచ్చు. ►లోన్ ఆఫర్ కొన్ని గంటలు లేదా రోజుల్లో ముగుస్తుందని చెబుతారు. స్కామర్లు పరిమిత గడువు ఆఫర్లతో ముందుకు వస్తారు. ఆకర్షణీయమైన వ్యూహాలను ఉపయోగించి, తక్షణ నిర్ణయం తీసుకునేలా చేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు దానిని ముందే కనిపెట్టి, అలాంటి వారి వలలో పడకుండా దూరంగా ఉండటం మంచిది. అనుమతి తప్పనిసరి... ►మీకు రుణం ఇచ్చే బ్యాంక్‌కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి. ఫైనాన్షియల్ కంపెనీ అయితే ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఉండాలి. ►రుణం ఇచ్చే వారితో సంప్రదింపులు చేయడానికి ఫోన్ నెంబర్, ఇ–మెయిల్‌తో పాటు వారి పూర్తి చిరునామా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా పైన సూచించిన అనుమతులు కూడా ఉండాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హైదరాబాద్ స్టార్టప్‌లకు శుభవార్త
హైదరాబాద్: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), ఏఐసీ ఎస్టీపీఐనెక్ట్స్తో బ్యాంకు ఆఫ్ బరోడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు సహకారం అందించనున్నట్టు బ్యాంకు ప్రకటించింది. స్టార్టప్‌లకు కేంద్రాలైన గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, ఇండోర్, కోచి ఇలా 15 ప్రాంతాల్లో స్టార్టప్ శాఖలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. స్టార్టప్‌ల కోసమే ఆకర్షణీయమైన రేట్లతో రుణ పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. -
రుణమాఫీ నిధులను ఒకేసారి విడుదల చేయాలి
రాంనగర్ : 3వ, 4వ విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి మూడో విడత డబ్బులు నేటì కీ విడుదల చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా రుణమాఫీపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సాగర్ ఎడమకాల్వ, ఏఎమ్మార్పీ, ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి పంటలకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ శ్రీశైలం, జహంగీర్, దండ వెంకటరెడ్డి, మందడి రాంరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, కావలి కృష్ణ, మందడి నర్సింహ, ఇంద్రారెడ్డి ఉన్నారు.