బీవోబీ చీఫ్‌ పదవీకాలం పొడిగించే అవకాశం | Govt may give extension to Bank of Baroda chief PS Jayakumar | Sakshi
Sakshi News home page

బీవోబీ చీఫ్‌ పదవీకాలం పొడిగించే అవకాశం

Published Mon, Sep 3 2018 1:54 AM | Last Updated on Mon, Sep 3 2018 1:54 AM

Govt may give extension to Bank of Baroda chief PS Jayakumar - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ఎండీ, సీఈవో పీఎస్‌ జయకుమార్‌ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన మూడేళ్ల పనితీరును మదింపు చేసిన అనంతరం ఈమేరకు తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లుగా ప్రైవేట్‌ రంగం నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఇద్దరు ప్రొఫెషనల్స్‌లో జయకుమార్‌ కూడా ఒకరు. 2015 అక్టోబర్‌లో బీవోబీ సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్‌ 12తో ముగియనుంది. జయకుమార్‌ బాధ్యతలు చేపట్టాక 11 త్రైమాసికాల్లో బీవోబీ నికరంగా రూ. 7,092 కోట్ల నష్టాల్ని ప్రకటించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement