
రైతుల కోసం బీవోబీ, ఇఫ్కో కో–బ్రాండెడ్ డెబిట్ కార్డులు
రూ.2,500 ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యంతో..
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇఫ్కో సంయుక్తంగా రైతుల కోసం కో–బ్రాండెడ్ డెబిట్ కార్డులను ఆవిష్కరించాయి. వీటికి ఒక నెల వరకు వడ్డీ లేకుండా రూ.2,500 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఇరు సంస్థలు తెలియజేశాయి. ఇక 30 రోజులు దాటిన తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్‌కు 8.60% వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. రైతుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను పెంచడానికి ఈ కార్డులను తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రెండు లక్షల కో–బ్రాండెడ్ కార్డులను జారీ చేస్తామని ఇరు సంస్థలు వివరించాయి.
ఈ స్కీమ్ విజయవంతమైతే ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్‌ను మరింత పెంచుతామని పేర్కొన్నాయి. కాగా రైతులు ఈ సౌలభ్యాన్ని పొందాలంటే ఆధార్ నెంబర్ ఇచ్చి, రూ.100 డిపాజిట్‌తో ‘బరోడా ఇఫ్కో కృషి సేవింగ్ బ్యాంక్ అకౌంట్’ను తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఈ కార్డులను ఏటీఎంలో కూడా ఉపయోగించొచ్చు. వీటిద్వారా ఇఫ్కో ప్రొడక్టులను కొనొన్చు.