అమెజాన్‌లో విక్రేతలకు సూక్ష్మ రుణాలు | Amazon, Bank of Baroda join hands to offer micro loans | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో విక్రేతలకు సూక్ష్మ రుణాలు

Published Sat, Sep 16 2017 1:23 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

అమెజాన్‌లో విక్రేతలకు సూక్ష్మ రుణాలు

అమెజాన్‌లో విక్రేతలకు సూక్ష్మ రుణాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో టైఅప్‌
► రూ. లక్ష నుంచి 25 లక్షల దాకా


ముంబై: ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ ప్లాట్‌ఫాంపై ఉత్పత్తులు విక్రయించే విక్రేతలకు సూక్ష్మ రుణాల సహకారం అందించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఇన్వైట్‌ ఓన్లీ (ఆహ్వానం) ప్రాతిపదికన మాత్రమే విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. బ్యాంక్‌ తోడ్పాటుతో జులైలోనే అమెజాన్‌ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వార్షికంగా 10.45–11.5 శాతం దాకా వార్షిక వడ్డీ రేటుపై రూ. 1 లక్ష నుంచి రూ. 25 లక్షల దాకా రుణ లభ్యత ఉండగలదని అమెజాన్‌ తెలిపింది.

చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార అవసరాలపై మంచి అవగాహన ఉన్నందున, అమెజాన్‌ ఇండియాలోని 2 లక్షల మంది పైగా విక్రేతలకు సమగ్రమైన బ్యాంకింగ్‌ సేవలు అందించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎండీ పీఎస్‌ జయకుమార్‌ తెలిపారు. వచ్చే ఏడాది వ్యవధిలోగా 15–20 శాతం మంది అమెజాన్‌ సెల్లర్లు ఈ సదుపాయం ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు వివరించారు.

అమెజాన్‌ పోర్టల్‌లో అమ్మకాల ట్రాక్‌ రికార్డు, కస్టమర్స్‌ ఫీడ్‌ బ్యాక్, నిబంధనలను పాటించడం మొదలైన అంశాల ప్రాతిపదికగా విక్రేతలకు ఈ పథకం కింద రుణ అర్హత వివరాలతో ప్రీ–అప్రూవ్డ్‌ ఆఫర్‌ బ్యాంకు నుంచి అందుతుంది. కార్యకలాపాలు విస్తరించే క్రమంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే నిధుల కొరత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ పథకం అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ గోపాల్‌ పిళ్లై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement