న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022–23, ఏప్రిల్–అక్టోబర్) 17.38 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్ డాలర్లు. దేశీయంగా డిమాండ్ తగ్గడం దీనికి కారణం. ఒక్క అక్టోబర్ నెలను తీసుకున్నా, దిగుమతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ దాదాపు వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–అక్టోబర్ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతులు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది.
వెండి దిగుమతులు అప్...
ఇక వెండి దిగుమతులు అక్టోబర్‌లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021–22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్ అకౌంట్‌కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్ అకౌంట్’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది.
17 శాతం తగ్గిన పసిడి దిగుమతులు
Published Tue, Nov 29 2022 5:48 AM | Last Updated on Tue, Nov 29 2022 5:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment