న్యూఢిల్లీ: ఎకానమీలో వడ్డీరేట్ల పెరుగుదల పరిణామాలు చిన్న పొదుపుదారులకు మేలు చేకూర్చుతున్నాయి. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును వరుసగా ఆరుసార్లు 2.5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది.
ఇది బ్యాంకులు అటు రుణ రేట్లు-ఇటు డిపాజిట్ రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది. రానున్న త్రైమాసికానికి సంబంధించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సేవింగ్స్ డిపాజిట్ల వడ్డీరేట్లు వరుసగా 7.1శాతం, 4 శాతాలుగా కొనసాగించినప్పటికీ, ఇతర సేవింగ్స్ పథకాలపై రేట్లు 0.1శాతం నుంచి 0.7శాతం మధ్య పెరిగాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై (ఎన్‌ఎస్‌సీ)పై అత్యధికంగా వడ్డీరేటు పెరిగింది.
పథకాల వారీగా రేట్ల పెరుగుదల (శాతాల్లో)
పథకం కొత్త వడ్డీ పాత వడ్డీ
ఎన్‌ఎస్‌సీ 7.7 7
సుకన్యా సమృద్ధి 8 7.6
సీనియర్ సిటిజన్
సేవింగ్స్ స్కీమ్ 8.2 8
కిసాన్ వికాస్ పత్ర 7.5 7.2
ఏడాది టర్మ్ డిపాజిట్ 6.8 6.6
రెండేళ్ల టర్మ్ డిపాజిట్ 6.9 6.8
మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7 6.9
ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ 7.5 7
నెలవారీ ఆదాయ పథకం 7.4 7.1
Comments
Please login to add a commentAdd a comment