Small savings
-
చిన్న పొదుపులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఎకానమీలో వడ్డీరేట్ల పెరుగుదల పరిణామాలు చిన్న పొదుపుదారులకు మేలు చేకూర్చుతున్నాయి. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆర్బీఐ రెపో రేటును వరుసగా ఆరుసార్లు 2.5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. ఇది బ్యాంకులు అటు రుణ రేట్లు-ఇటు డిపాజిట్ రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది. రానున్న త్రైమాసికానికి సంబంధించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సేవింగ్స్ డిపాజిట్ల వడ్డీరేట్లు వరుసగా 7.1శాతం, 4 శాతాలుగా కొనసాగించినప్పటికీ, ఇతర సేవింగ్స్ పథకాలపై రేట్లు 0.1శాతం నుంచి 0.7శాతం మధ్య పెరిగాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై (ఎన్ఎస్సీ)పై అత్యధికంగా వడ్డీరేటు పెరిగింది. పథకాల వారీగా రేట్ల పెరుగుదల (శాతాల్లో) పథకం కొత్త వడ్డీ పాత వడ్డీ ఎన్ఎస్సీ 7.7 7 సుకన్యా సమృద్ధి 8 7.6 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 8 కిసాన్ వికాస్ పత్ర 7.5 7.2 ఏడాది టర్మ్ డిపాజిట్ 6.8 6.6 రెండేళ్ల టర్మ్ డిపాజిట్ 6.9 6.8 మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7 6.9 ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ 7.5 7 నెలవారీ ఆదాయ పథకం 7.4 7.1 -
కేంద్రం కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల వడ్డీ రేట్లు పెంపు!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వీటిపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి – మార్చి కాలానికి కొత్త రేట్లు అమలు కానున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 2.25 శాతం మేర కీకలమైన రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించినట్టు తెలుస్తోంది. వివిధ పథకాలపై పెంపు 0.20–1.1 శాతం మధ్య ఉంది. తాజా పెంపు తర్వాత కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ప్రధానంగా జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే, సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ పథకాల రేట్లను కేంద్ర సర్కారు 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సవరించడం గమనార్హం. అప్పుడు 0.10–0.30 శాతం మేర మూడు పథకాల రేట్లను పెంచింది. తాజా సవరణ తర్వాత బ్యాంక్ ఎఫ్డీ రేట్లకు, ఈ పథకాల రేట్లకు పెద్దగా వ్యత్యాసం లేదు. -
కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా?
సాక్షి, న్యూఢిల్లీ: పీపీఎఫ్, ఎన్ఎస్సీలాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ నిర్టయాన్ని వెనక్కి తీసుకుంది. వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర స్పష్టం చేసింది. ఈ మేరకు వడ్డీరేటు తగ్గింపు ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. 2020-2021 చివరి త్రైమాసికం రేట్లే యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అయితే పొరబాటున వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తర్వులిచ్చామన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భయంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే దేశీయ మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ జోక్‌తో ఆడుకుంటోందంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్లో మండిపడ్డారు. నిజంగానే పొరబాటున తగ్గింపు ఆదేశాలిచ్చారా..లేక ఎన్నికల జిమ్మిక్కా అంటూ సీతారామన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. అటు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేక సర్కస్ చేస్తున్నారా అంటూ మరో కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆర్థికమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన కేంద్రం సమీక్షిస్తుంది. ఈనేపథ్యంలోనే వడ్డీ రేట్లను 40-110 బేసిస్ పాయింట్ల మధ్య కోత విధించినట్లు ఆర్థికశాఖ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఈ కోత లేనట్టే. దీని ప్రకారం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతంగా యథాతథంగా అమలుకానుంది. Egg on face again🤪 Because MO-SHA too busy throwing petals from trucks and cracking April Fool jokes of false promises at election rallies. https://t.co/SVb0dWrqQU — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) April 1, 2021 Really @nsitharaman “oversight” in issuing the order to decrease interest rates on GOI schemes or election driven “hindsight” in withdrawing it? https://t.co/Duimt8daZu — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 1, 2021 Madam FM, Are u running a ‘Circus’ or a ‘Govt’? One can imagine the functioning of economy when such duly approved order affecting crores of people can be issued by an ‘oversight’. Who is the competent authority referred in order? You have no moral right to continue as FM. pic.twitter.com/czRv5MY7O8 — Randeep Singh Surjewala (@rssurjewala) April 1, 2021 -
ప్రైవేటు బ్యాంకులకు సై
న్యూఢిల్లీ: ఇంతకాలం ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లు తదితర వ్యాపారం ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని దిగ్గజ ప్రైవేటు బ్యాంకులకే సొంతం కాగా.. ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ ఇందుకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల సేవలు సహా అన్ని రకాల ప్రభుత్వాల వ్యాపార లావాదేవీల నిర్వహణకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం కస్టమర్లకు సేవల పరంగా సౌకర్యాన్నిస్తుందని, పోటీని, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖా పేర్కొంది. ‘ప్రభుత్వ వ్యాపారం ప్రైవేటు బ్యాంకులు నిర్వహించే విషయమై ఉన్న ఆంక్షలను తొలగించాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు పాల్గొనొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేటు బ్యాంకులూ సమాన భాగస్వాములు’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆంక్షలు తొలగించడంతో ప్రైవేటు బ్యాంకులనూ ప్రభుత్వ వ్యాపారం, ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపార నిర్వహణకు.. ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా గుర్తించేందుకు ఆర్బీఐకి అధికారాలు లభించినట్టు అయింది. -
అది ఓ చెత్త సలహా..
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదని, ఇది ఎవరో ఇచ్చిన చెత్త సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజల జీవితాలను కాపాడటం ముఖ్యమని, జీడీపీ లెక్కలు కాదని చిదంబరం హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చెత్త సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయనే విషయం తనకు తెలుసని, అయితే ఇంత చెత్త సలహా పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని వ్యాఖ్యానించారు. పీపీఎఫ్, చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటు తగ్గించడం సాంకేతికంగా సరైనది కావచ్చు..కానీ నిర్ణయం తీసుకున్న సమయం సరైంది కాదని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రజల రాబడి అనిశ్చితిలో పడిన ఇలాంటి సందర్భాల్లో వారు తమ పొదుపుపై వచ్చే రాబడిపై ఆధారపడతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించి జూన్ 30 వరకూ పొదుపు ఖాతాలపై పాత వడ్డీరేట్లనే కొనసాగించాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు కేవలం 4.8 శాతానికే పరిమితమవుతుందని ఆయన అంచనా వేశారు. చదవండి : చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత -
చిన్న మొత్తాల పొదుపునకు చిల్లు
⇒ 0.1% మేర వడ్డీ రేటు తగ్గింపు ⇒ పీపీఎఫ్, కిసాన్ వికాస్పత్ర తదితర స్కీమ్‌లపై ప్రభావం ⇒ ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి వర్తింపు న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం కోత పెట్టింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి పథకం మొదలైన స్కీములపై వడ్డీ రేట్లను 0.1 శాతం తగ్గించింది. జనవరి–మార్చి వ్యవధితో పోలిస్తే ఏప్రిల్–జూన్ మధ్య కాలానికి ఈ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. అయితే సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు మాత్రం వార్షికంగా 4 శాతం మేర యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. గతేడాది ఏప్రిల్ నుంచి చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. -
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు అవే
జనవరి–మార్చి త్రైమాసికానికి పాత రేట్లే కొనసాగింపు న్యూఢిల్లీ: బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి – మార్చి త్రైమాసికానికి అంతకుముందు అమల్లో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. పీపీఎఫ్, ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 8 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. కిసాన్ వికాస పత్రపై రాబడులు 7.7 శాతంగా ఉంటాయని, 112 నెలలకు గడువు తీరతాయని ఆర్థిక శాఖ పేర్కొంది. సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పైనా ఇదే రేటు వర్తిస్తుంది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై 4 శాతం, 1–5 ఏళ్ల వరకు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై 7 నుంచి 7.8 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం మేరకు... ప్రతీ త్రైమాసిక కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ, పీఎన్బీ, యూని యన్ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను 0.90 శాతం వరకూ తగ్గిస్తూ ఆదివారం నిర్ణయాలను ప్రకటించిన విషయం తెలిసిందే. -
పొదుపు పథకాలపై రేటు కోత మంచిదే: నొమురా
న్యూఢిల్లీ: చిన్న పొదుపులపై వడ్డీరేట్ల తగ్గింపు అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు తగిన ప్రయోజనాన్నే కల్పిస్తాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం కోరుకుంటున్నట్లు... బ్యాంకులు తమ కు అందిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఈ ప్రయోజనం ఏప్రిల్-జూన్ మధ్య ప్రధానంగా వ్యవస్థలో కనిపిస్తుందని అంచనా వేసింది. కాగా చిన్న పొదుపు మొత్తాలపై రేటును తగ్గించడంవల్ల... వీటిలోకి వచ్చే డబ్బు తగ్గే అవకాశం ఉందని నొమురా విశ్లేషించింది. దీనితో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక అవసరాలకు మార్కెట్ రుణాలపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పేర్కొంది. చిన్న పొదుపులపై రేటు కన్నా తక్కువగా ఇక్కడ (మార్కెట్ రుణాలు) తక్కువ వడ్డీ రేటు ఉన్నందువల్ల... ప్రభుత్వాలపై వడ్డీభారం తగ్గే వీలుందని విశ్లేషించింది. కాగా దిగువస్థాయి వడ్డీరేట్ల వల్ల దీర్ఘకాలంలో కస్టమర్లు, కార్పొరేట్లు కూడా ప్రయోజనం పొందుతారని... వెరసి ఈ ప్రక్రియ మొత్తం చక్కటి వృద్ధికి దారితీస్తుందని నొమురా అంచనావేసింది. -
వడ్డీ తగ్గితే దారేది?
♦ మాధవరావుది ప్రయివేటు ఉద్యోగం. రిటైరయ్యాడు. ఈపీఎఫ్ ద్వారా వచ్చే పెన్షను మరీ తక్కువ కావటంతో... తన రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును, అప్పటిదాకా పొదుపు చేసుకున్న డబ్బును పోస్టాఫీసులో వేసుకున్నాడు. నెలవారీ ఆదాయం వచ్చేలా డిపాజిట్ చేసి... దాన్లో కొంత ఆర్డీకి మళ్లించి... ఇలా ప్రధానంగా వడ్డీపైనే ఆధారపడ్డాడు. ఇపుడు ప్రభుత్వం ఉన్నట్టుండి వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడంతో ఎటూ పాలుపోవటం లేదు. ♦ కృష్ణకుమార్దీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. ప్రయివేటు ఉద్యోగం కావటంతో భవిష్యత్తు కోసం ఈపీఎఫ్, పీపీఎఫ్లనే నమ్మాడు. ఎప్పటికప్పుడు తన దగ్గర మిగిలే డబ్బును వాటికే మళ్లిస్తున్నాడు. వాటిక్కూడా వడ్డీరేట్ల కోత అంటుకోవటంతో ఏం చెయ్యాలన్నది అర్థంకావటం లేదు. ♦ వీళ్లిద్దరే కాదు. దేశంలో కోట్ల మంది పరిస్థితి ఇలాగే ఉంది. పెట్రోలు, డీజిల్ రేట్ల మాదిరిగా మెల్లగా నొప్పి తెలియకుండా మూడు నెలలకోసారి సవరిస్తామని చెప్పిన ప్రభుత్వం... చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీని గడిచిన నాలుగు నెలల్లో 2 సార్లు... కనిష్ఠంగా 0.75 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకూ తగ్గించేసింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండటం... ఆర్థిక లోటు కూడా అదుపులో ఉండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించడానికి వెసులుబాటు కలిగింది. ఏప్రిల్ 5న జరిగే ఆర్బీఐ సమీక్షలో వడ్డీరేట్లు అర శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లోగా మొత్తమ్మీద వడ్డీ రేట్లు 0.75 శాతం తగ్గొచ్చన్నది అంచనా. ఇదే జరిగితే బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు మరింత తగ్గుతాయి. వడ్డీపై ఆధారపడి జీవించేవారి బతుకు దారుణంగా తయారవుతుంది. ♦ ప్రభుత్వ చర్యల తీరు పింఛను దారులకు, వడ్డీపై ఆధారపడ్డవారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. సరే!! మరేం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? ఏఏ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? ఆదాయంతో పాటు భద్రతనూ కల్పించే పథకాలేంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... - సాక్షి పర్సనల్ భారీగా తగ్గిన చిన్న మొత్తాల పొదుపు రేట్లు ♦ వీటికి అనుగుణంగా తగ్గనున్న బ్యాంకు డిపాజిట్ రేట్లు ద్రవ్యోల్బణం అదుపుతో మరింతగా తగ్గనున్న వడ్డీరేట్లు ♦ వచ్చే ఏడాదిలోగా 0.50 నుంచి 0.75 శాతం తగ్గే అవకాశం తగ్గుతున్న వడ్డీరేట్లతో డిపాజిట్‌దారులు గగ్గోలు ♦ ప్రత్యామ్నాయాలు వెదక్కపోతే పెన్షనర్లకు కష్టకాలమే! ప్రత్యామ్నాయాల్లో బాండ్ ఫండ్లు; కంపెనీ డిపాజిట్లు ♦ అంతిమంగా ఈక్విటీలవైపు మళ్లించటమే సర్కారు లక్ష్యం! ఫైనాన్స్ విభాగం ♦ డబ్బు దాచుకోవడమంటే ప్రతి ఒక్కరికీ మొదట గుర్తొచ్చేది పోస్టాఫీసు లేదా బ్యాంకు డిపాజిట్లే. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలనుకునే వారు మొదట చూసేది భద్రతే. పోస్టాఫీసుగానీ, బ్యాంకు గానీ అయితే భద్రతకు ఢోకా ఉండదు. అదే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన వాళ్లకయితే పోస్టాఫీసు నెలసరి ఆదాయమో, డిపాజిట్లు అందించే వడ్డీయో జీవనాధారంగా ఉంటుంది. కానీ వడ్డీ రేట్లేమో తగ్గుతున్నాయి. నిజానికి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణానికి కనీసం 3-4 శాతం అధికంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లుంటాయి. ఇక్కడేమో పరిస్థితి భిన్నంగా ఉంది. వడ్డీరేట్లు ద్రవ్యోల్బణానికి ఒక శాతం మాత్రమే అధికంగా ఉన్నాయి. గతేడాది వినియోగ ద్రవ్యోల్బణం సుమారుగా 6 శాతం ఉంటే వడ్డీరేట్లు 7 శాతం వద్ద ఉన్నాయి. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తుండగా... వడ్డీరేట్లు 1 శాతం కన్నా ఎక్కువే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలమే ఉత్తమం... బ్యాంకులు ఎప్పటి నుంచో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించాలనుకుంటున్నాయి. కాకపోతే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు కాస్త ఎక్కువగా ఉండటంతో అవి వేచిచూశాయి. పోస్టాఫీసు పథకాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం... అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో బ్యాంకులూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న ఆర్బీఐ వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయంతో ఈ విషయంలో స్పష్టత రావచ్చు. వడ్డీరేట్లు ఏ మేరకు తగ్గే అవకాశం ఉందనేది తెలిసిపోతుంది. ఇది కాసేపు పక్కనపెడితే... ఏప్రిల్ 1 నుంచి వడ్డీరేట్లు తగ్గుతున్నాయన్న విషయంలో స్పష్టత వచ్చేసింది. అందుకే వడ్డీమీద జీవించేవారు ఈ మార్చిలోనే దీర్ఘకాలానికి డిపాజిట్లు చేసుకుంటే మంచిదనేది నిపుణుల సూచన. దీర్ఘకాలిక డిపాజిట్లను ఎంచుకుంటే ఎక్కువ కాలం అధిక వడ్డీరేటును పొందే వెసులుబాటు ఉంటుందని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ వేణుగోపాల్ జాగర్లమూడి సూచించారు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్ల కంటే పోస్టాఫీసు పథకాలే అధిక వడ్డీరేట్లు ఇస్తున్నాయని, వీటిలో ఇన్వెస్ట్ చేయటమే ఉత్తమమని ఆయన చెప్పారు. అలాగే వడ్డీరేట్లు కొద్దిగా తక్కువ ఉన్నా ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పన్ను పరిధిలో ఉండే వారు ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధికాదాయం పొందవచ్చు. కాకపోతే ఈ నెలలో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏడాదికి మాత్రమే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయగలరని గుర్తుంచుకోవాలి. ఇతర ప్రత్యామ్నాయాలివీ.. డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ బెటర్... ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకుండా బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి డెట్ ఫండ్స్ అనుకూలమనే చెప్పాలి. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసే గిల్ట్ ఫండ్స్ అధిక రాబడులనిస్తాయి. అయితే ఇదే సమయంలో గిల్ట్ ఫండ్స్‌లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయని గుర్తుంచుకోవాలి. మార్కెట్లోని హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఈ ఒడిదుడుకులను అందిపుచ్చుకునే వారికి గిల్ట్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. గిల్ట్ ఫండ్స్ మార్కెట్ కదలికలపై అంతగా అవగాహన లేనివారు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా ఆదాయాన్ని ఇచ్చే మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ లేదా షార్ట్, మీడియం టర్మ్ డెట్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో కనీసం మూడేళ్లు ఉండే విధంగా ఇన్వెస్ట్ చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతుంటే ఈల్డ్ పెరగడం ద్వారా మీ సంపద విలువ పెరుగుతుంది. అలా కాకుండా నేరుగా బాండ్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉండి, అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉన్న బాండ్స్‌ను ఎంచుకుంటే ఇబ్బందులుండవు. రిస్క్‌కు తగ్గ ఈక్విటీ ఫండ్స్.. ఏప్రిల్ నుంచి వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఈ లోగా ఇన్వెస్ట్ చేస్తే ఓకే. అయితే చేతిలో డబ్బుల్లేక ఏప్రిల్ తరవాతే ఇన్వెస్ట్ చేయగలిగే పరిస్థితి ఉన్నవారు... వారి రిస్క్‌కు తగ్గట్టుగా ఇతర ప్రత్యామ్నాయ పథకాలవైపు చూడొచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరినవారు, మధ్య వయస్కులైతే వారికి కొద్దిగా నష్టభయాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి సిప్ విధానంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం మంచిదన్నది ఫండ్ మేనేజర్ల సూచన. ఇంత వరకు డిపాజిట్లలో తప్ప ఈక్విటీలో పెట్టుబడి పెట్టనివారు సెక్టోరియల్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో కాకుండా... ఇండెక్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్థాయి రిస్క్ కూడా చేయలేని వారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి కాబట్టి బ్యాలెన్స్డ్ ఫండ్స్ బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందించే అవకాశాలున్నాయి. నిజానికి వడ్డీరేట్లు ఇలా తగ్గుతూ పోతే... రిస్క్ ఉన్నా అధిక రాబడిని ఇవ్వగలిగేవి, ఎంత మొత్తాన్నయినా పెట్టుబడిగా స్వీకరించగలిగే సత్తా ఉన్నవి స్టాక్ మార్కెట్లు మాత్రమే. వీటివైపు ఇన్వెస్ట్మెంట్లను మళ్లించటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమనే వాదన కూడా ఉంది. కంపెనీ డిపాజిట్లతో రిస్కూ... రాబడి కూడా! కంపెనీ డిపాజిట్లు కూడా స్థిరమైన ఆదాయాన్నిస్తాయి. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ హామీ ఉండదు. డిపాజిట్లకు బీమా గ్యారంటీ కూడా ఉండదు. ఈ రిస్క్‌కు సిద్థపడితే బ్యాంకు డిపాజిట్లకంటే ఎక్కువ వడ్డీనే పొందొచ్చు. కొన్ని కంపెనీలు డిపాజిట్‌దారులను ఆకర్షించడానికి అధిక వడ్డీలను ఆశచూపిస్తాయి. కానీ ఇలాంటి ఆకర్షణలకు లోనుకాకుండా... ముందుగా ఆ కంపెనీ చరిత్రను చూడాలి. ట్రాక్ రికార్డ్ బాగుండి, మంచి పేరు... మంచి యాజమాన్యం ఉన్న కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సాధారణంగా కంపెనీలు డిపాజిట్లపై ప్రకటించే వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్లకంటే ఎక్కువ, రుణాల వడ్డీరేట్ల కంటే తక్కువగా ఉంటాయి. కంపెనీలు బ్యాం కుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవటం కన్నా... అంతకన్నా తక్కువ వడ్డీరేటుకు ఇన్వెస్టర్ల నుంచి డిపాజిట్లు సేకరించడం మంచిది కదా... అని ఆలోచిస్తాయి. అలా కాకుండా బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లకన్నా ఎక్కువ వడ్డీనిస్తామని కంపెనీలు గనక చెబితే... ఆ కంపెనీల గురించి ఒకసారి ఆలోచించాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోబట్టే అవి ఇన్వెస్టర్ల దగ్గరకు వచ్చాయని అనుకోవాలి. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు సుమారు 9 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.