సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం అనంతరం గురువారం కీలక వడ్డీరేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
2022-23లో జీడీపీ 7శాతం పెరిగిందని, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని గవర్నర్ అన్నారు. గ్లోబల్ ఎకానమీ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్-జూన్ 2023లో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. (ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు)
తాజా రివ్యూలో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభి ప్రాయపడ్డారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రికార్డు స్థాయిలో 6.75 శాతానికి పెరగనుందనే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment