Interest rates RBI
-
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. -
గుడ్ న్యూస్ యథాతథంగా కీలక వడ్డీరేట్లు
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం అనంతరం గురువారం కీలక వడ్డీరేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2022-23లో జీడీపీ 7శాతం పెరిగిందని, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని గవర్నర్ అన్నారు. గ్లోబల్ ఎకానమీ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్-జూన్ 2023లో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. (ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు) తాజా రివ్యూలో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభి ప్రాయపడ్డారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రికార్డు స్థాయిలో 6.75 శాతానికి పెరగనుందనే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. -
రుణాలు ఇక పండగే!
ముంబై: పండుగలు మొదలవుతున్న తరుణంలో రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీపికబురు తెచ్చింది. కీలక పాలసీ రేట్లను అంచనాలకు మించి తగ్గించడంతో... ఇక అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు దిగిరానున్నాయి. నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది. కాగా, దిగజారుతున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్ ఆర్బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది! బుధవారం వెల్లడైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది. వృద్ధి క్షీణతకు చెక్ పెట్టేందుకు, వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు తన వంతుగా రేట్ల కోతతో ముందుకు వచ్చింది. 25 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేయగా, ఈ విషయంలో ఆర్బీఐ విశాలంగానే స్పందించి 35 బేసిస్ పాయింట్లను తగ్గించి ఆశ్చర్యపరిచింది. బ్యాంకులకు సమకూర్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా పేర్కొంటారు. ‘‘25 బేసిస్ పాయింట్ల తగ్గింపు సరిపోదు. 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఎక్కువ అవుతుంది. 35 బేసిస్ పాయింట్లు అన్నది సమతుల్యంగా ఉంటుందని ఎంపీసీ భావించింది’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సాధారణంగా ఆర్బీఐ పావు శాతం లేదా అరశాతం (25 బేసిస్ పాయింట్ల మల్టిపుల్‌లో) మేర రేట్లలో చేసే మార్పులకు, 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది వినూత్నమే. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 1.1% రెపో రేటును తగ్గించడం విశేషం. తాజా నిర్ణయం తర్వాత రెపో రేటు 5.4%కి, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ సమీకరించే నిధులపై ఇచ్చే రేటు) 5.15%కి దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 7% నుంచి 6.9 శాతానికి తగ్గించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించింది. అంటే పాలసీ విషయంలో ఉదారంగా వ్యవహరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంటుందని ఆశించొచ్చు. అవసరమైతే భవిష్యత్తులోనూ రేట్ల కోత చేపట్టవచ్చని ఇది సూచిస్తుంది. బలహీనంగా ఆర్థిక రంగం ‘‘దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి. వృద్ధిపై ఆందోళనలకు పరిష్కారంగా డిమాండ్‌ను పెంచేందుకు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం అన్నది ఈ దశలో అత్యంత ముఖ్యమైనది’’ అని రేట్ల కోత అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీసీ స్పష్టం చేసింది. -
28,130-28,360 శ్రేణి నుంచి బయటపడితే..
మార్కెట్ పంచాంగం అమెరికాలో సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న సంకేతాలు వెలువడుతున్నా, ఇక్కడ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోయినా భారత్ సూచీలు నిలదొక్కుకోగలుగుతున్నాయి. కమోడిటీ ధరల క్షీణత, రూపాయి విలువ స్థిరత్వం తదితర అంశాలు మన మార్కెట్ గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి సహకరిస్తున్నాయి. రుతు పవనాల బలహీనత, సంస్కరణల బిల్లుల స్తంభన వంటి ప్రతికూల అంశాలు కూడా మార్కెట్‌ను పడదోయడం లేదు. అనూహ్య సంఘటనలేవీ జరక్కపోతే, రానున్న వారాల్లో మార్కెట్ మరింత పెరిగే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... బీఎస్ఈ సెన్సెక్స్ కదలికలు గతవారం చివరి మూడు రోజులూ 28,130-28,360 పాయింట్ల స్వల్పశ్రేణికి పరిమితమయ్యాయి. చివరకు 28,236 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ పైన ప్రస్తావించిన శ్రేణి నుంచి సూచి ఎటు వెలుపలికి వస్తే, అటువైపు కదిలే అవకాశాలుంటాయి. 28,130 పాయింట్ల దిగువన ముగిస్తే 200 రోజుల చలన సగటు రేఖ సంచరిస్తున్న 27,968 పాయింట్లు-ఆర్బీఐ పాలసీ వెల్లడైన ఆగస్టు 4నాటి 27,860 పాయింట్ల కనిష్టస్థాయి మార్కెట్ స్వల్పకాలిక ట్రెండ్‌కు కీలకమైనవి. ఈ స్థాయిల్ని కోల్పోతే 27,650 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున తిరిగి 27,400 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం సెన్సెక్స్ 28,360 పాయింట్ల స్థాయిని దాటితే 28,580 పాయింట్ల వద్దకు వేగంగా పెరగవచ్చు. వరుసగా రెండు వారాలపాటు ఇదే స్థాయి వద్ద సెన్సెక్స్ నిరోధాన్ని చవిచూసినందున, ఈ వారం తదుపరి ర్యాలీ జరగాలంటే ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సివుంటుంది. ఆపైన స్థిరపడితే కొద్ది రోజుల్లో 29,095 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ కీలక మద్దతు 8,444 ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ద్వితీయార్థంలో కేవలం 60 పాయింట్ల శ్రేణిలో (8,545-8,606) హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు 31 పాయింట్ల లాభంతో 8,564 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల శ్రేణి నుంచి ఎటు బయటపడితే, అటువైపు నిఫ్టీ ఈ వారం పయనించవచ్చు. 8,545 పాయింట్ల దిగువన ముగిస్తే 8,444 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీ ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. ఇదే స్థాయి వద్ద నిఫ్టీ 200 డీఎంఏ రేఖ కదలుతుండటం, నాలుగు రోజుల కనిష్టస్థాయి ఇదే కావడంతో 8,444 పాయింట్లకు సాంకేతిక ప్రాధాన్యత వుంది. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే 8,320 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఆ లోపున 8,195 పాయింట్ల స్థాయికి క్షీణించే ప్రమాదం వుంది. ఈ వారం 8,606 పాయింట్లను అధిగమిస్తే వేగంగా 8,655 పాయింట్ల వద్దకు చేరవచ్చు. జూలై నెలలో ఇదే స్థాయి వద్ద నిఫ్టీకి డబుల్‌టాప్ ఏర్పడినందున, సమీప భవిష్యత్తులో ఈ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిని దాటితే 8,760 పాయింట్ల స్థాయికి వేగంగా పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే ఏప్రిల్ 15నాటి గరిష్టస్థాయి 8,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. - పి. సత్యప్రసాద్