సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ కాలంలో దేశీయ ఆటోదిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వినియోగదారులకు కోసం ఆకర్షణీయ మైన పథకాలను లాంచ్ చేసింది. ముఖ్యంగా వాహనాల విక్రయాలను భారీగా క్షీణిస్తున్న తరునంలో కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్న పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనాన్ని ఇపుడు కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత చెల్లింపులు చేసేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా కస్టమర్లకు ఆర్థిక సౌలభ్యాన్ని అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
మహీంద్ర ప్రకటించిన తాజా ఆఫర్ ప్రకారం కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని తక్షణమే సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత ఈఎంఐ చెల్లింపులు మొదలు కానున్నాయి. మూడు నెలల తర్వాతే మొదటి ఈఎంఐ ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. వాణిజ్య వాహనాలకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అలాగే తన వినియోగదారులకు కాంటాక్ట్ లెస్ సేవలు అందించేందుకు గాను 'ఓన్ ఆన్లైన్' అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టినట్టు మహీంద్రా వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్లైన్ రుణాలు సమకూరుస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,000 విలువైన యాక్సెసరీలు, లోన్‌లో రూ.2,000 లబ్ధి చేకూరనుంది. యాక్సెసరీస్, ఎక్స్టెండ్ వారెంటీ చెల్లింపులు, వర్క్‌షాప్ లాంటి చెల్లింపులను కూడా ఈఎంఐలుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. అంతేకాక, రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ కూడా ఉంది. 7.25 శాతం వడ్డీ రేటుకే వాహన రుణ సౌకర్యం. 100 శాతం ఆన్ రోడ్ ఫండింగ్ వెసులుబాటు. దీంతోపాటు యాక్సెసరీస్, ఎక్స్టెండెడ్ వారెంటీలపై కూడా రుణాలు మంజూరు చేస్తామని తెలిపింది. వ్యక్తిగత యువిల కోసం లక్షకు రూ .799 కంటే తక్కువ నుంచే ఈఎంఐ మొదలు.. బొలెరో పికప్, బీఎంపీ పై 9.4శాతం నుండి ప్రారంభమయ్యే అతి తక్కువ ఆఫర్‌లో ఉంది. అలాగే లోన్ గడువు అత్యధికంగా 6 సంవత్సరాలు వరకు ఉంది. పర్పనల్ యువీలపై 8 సంవత్సరాల వరకు పరిమితి. ఈ ఆఫర్లను పొందడానికి వినియోగదారులు తమ సమీప డీలర్‌తో సంప్రదించాలి.
చదవండి: vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment