సాక్షి, ముంబై: కరోనా కాలంలో రవాణా సదుపాయాలు తగినంతగా లేక ఇబ్బందులు పడుతూ, ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికోసం ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. బ్యాంక్ కస్టమర్లుఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ అందిస్తోంది.
3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. హోండా మోటార్ సైకిల్ షోరూమ్‌ల నుండి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్‌గా5 శాతం క్యాష్ బ్యాక ఆఫర్ కూడా ఉంది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది.
రానున్న పండుగ సీజన్, కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్, కార్డ్‌ల ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై జీఎస్‌టీ తగ్గింపు నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లకు ప్రోత్సాహాన్నివ్వాలని భావిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై కూడా ఇటీవలఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment