సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సొంత ఇల్లు కల కంటున్న కస్టమర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే రుణగ్రహీతలకు మూడు ప్రయోజనాలు లభిస్తాయని వెల్లడించింది. ఆ మేరకు వివరాలను బ్యాంకు ట్వీట్ ద్వారా తెలిపింది.
ప్రయోజనాలు
- ప్రాసెసింగ్ ఫీజు రద్దు
- 30 లక్షలకు పైబడి, కోటి రూపాయల కంటే తక్కువ రుణాలపై సిబిల్ స్కోరు ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు 0.10శాతం వడ్డీ రాయితీ
- ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా అయితే అదనంగా 0.5 శాతం రాయితీ లభ్యం.
దీంతో రుణం మొత్తంపై 0.40 శాతం వరకు వినియోగదారులకు ఆదా అవుతుంది. ఉదాహరణకు, 30 లక్షల రుణంపై 15 సంవత్సరాల కాల పరిమితిలో 1.52 లక్షల వరకు కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం వేతన జీవులకు గృహ రుణాలపై 6.95 శాతం నుండి 7.45 శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారి రుణాలపై 7.10 శాతం నుండి 7.60 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తోంది. కాగా కరోనావైరస్ వ్యాప్తి తరువాత రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 4 శాతానికి తగ్గించిన తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగి వచ్చిన సంగతి తెలిసిందే.
Knock Knock! Who's there?
— State Bank of India (@TheOfficialSBI) September 9, 2020
Concessions on SBI Home Loans through YONO.
Apply now: https://t.co/wWHot51u7y
*T&C Apply#YONOSBI #HomeLoan #DreamHome #SBI #StateBankOfIndia pic.twitter.com/7uQiKNecPM
Comments
Please login to add a commentAdd a comment