న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఒక్క 2019 నవంబర్ నెలలోనే ఏకంగా 3.63 కోట్ల మంది కస్టమర్లు తగ్గారు. అక్టోబర్ నెలలో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ నెలలో వొడాఫోన్ ఐడియా మొత్తం కస్టమర్ల సంఖ్య 37.26 కోట్లు కాగా.. అనూహ్యంగా నవంబర్ నెలలో 3.63కోట్ల మంది తగ్గడంతో వినియోగదారుల సంఖ్య 33.63 కోట్లకు చేరుకుందని ఆ కంపెనీ ట్రాయ్‌కు సమర్పించిన నివేదికలో తెలిపింది.
చదవండి: సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం
మరోవైపు క్రియాశీలకంగా లేని కస్టమర్లను తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గిందని అంటున్నారు. యాక్టివ్ యూజర్లు నమోదు చేసే సమయాన్ని 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం.. అది కూడా నవంబర్ నెలలో జరగడంతో ఈ సంఖ్య భారీగా తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు జియో తన కస్టమర్లకు షాకిస్తూ ఛార్జీలను పెంచినప్పటికీ యూజర్లు సంఖ్య మాత్రం పెరుగుతోంది. అక్టోబర్ నెలలో కొత్తగా 91 లక్షల మంది జియో యూజర్లుగా మారారు. ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన నెలలోనే జియోకు యూజర్లు పెద్ద ఎత్తున పెరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment