user charges
-
ప్రజలపై యూజర్ ఛార్జీల బరువు
-
రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. రోజుకో రీతిన ప్రజలను బాదేస్తోంది. మొన్న కరెంట్ చార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్‌లు ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్ చార్టీలను ఇదివరకెన్నడూ లేని రీతిలో పూరి గుడిసెలను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా యూజర్ చార్జీల పేరుతో నగర, పట్టణ వాసులను భారీగా బాదేయడానికి సిద్ధమైంది. మరో వైపు ఏరు దాటేశామని ప్రజలందరినీ బోడి మల్లన్నలు చేస్తూ.. రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా వరదల సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ప్రజలేమనుకుంటే మాకేంటని నిస్సిగ్గుగా ప్రజలను అన్ని రకాలుగా వాయించేస్తూ.. ‘బాబు అంటే బాదుడే బాదుడు’ అని నిరూపించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో యూజర్ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్ చార్జీలు’ అంటూ ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల మోత మోగించాలని వికసిత్ ఆంధ్రా–2029 కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వేలోనూ చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఆపరేషన్, మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఆపరేషన్.. నిర్వహణ, నీటి సరఫరా, పంపిణీ నెట్ వర్క్, యంత్రాల నిర్వహణ, ఆపరేషన్‌కు అయ్యే వ్యయాన్ని పట్టణ ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని కూడా నొక్కి చెప్పింది. ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం.. తమది సిటిజన్ ప్రెండ్లీ వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.ఆస్తి పన్ను పెంచేలా అడుగులుపట్టణాల్లో ఆస్తి పన్ను సంస్కరణల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇంటి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం కొలతలను వేయించింది. పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైమ్ మదింపు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్ ఉపయోగించి బిల్డింగ్ ప్లాన్ ఆమోదంతో సహా ఆస్తుల డేటా సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెట్ డిజిటలైజ్డ్ బిల్లింగ్ ద్వారా ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమెటిక్ డిజిటల్ బిల్లు జనరేట్ చేయనున్నారు. ఎస్ఎంఎస్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపును యజమానులకు గుర్తు చేయనున్నారు. బౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ఆధారంగా ఆస్తుల వివరాలను మ్యాపింగ్ చేయనున్నారు. చాలా కాలంగా ఆస్తుల కిందకు రాని ఆస్తులన్నీ ఈ మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతో పన్నుల పరిధిలో మరిన్ని ఆస్తులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పటికే మ్యాపింగ్‌లో ఉన్న ఆస్తులకు అదనంగా ఉన్న ఆస్తులను జత చేస్తోంది. ఆస్తి పన్ను రిజిస్టర్‌ను రాష్ట్ర స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ విభాగాలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఆస్తులలో మార్పులు చేసినట్టయితే అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలు కలుగుతుంది.వరదలనూ వాడుకుంటాం..రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ కూటమి సర్కారు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రతిపాదన చేశారు. 5 శాతం జీఎస్టీ దాటిన అన్ని వస్తువులపై అదనంగా ఒక శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సెస్ ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంత్రాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో సెస్ విధించారని తెలిపారు. 5 శాతానికి మించిన జీఎస్టీ శ్లాబులపై ఈ సెస్ విధిస్తుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం ఉండదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, ఈ డేటా రాష్ట్రాలకూ అందుబాటులో ఉంచాలన్నారు. చిన్న వ్యాపారులు, కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు కూడా పాల్గొన్నారు. -
పల్లె రోడ్లపై పన్నుల మోత!
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్ చార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యూజర్ చార్జీలు వసూలు చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకు వాహనంతో వచి్చనా యూజర్ చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవుగానీ.. ఇలాంటి వినూత్న ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయని, వాటి ద్వారా సంపద సృష్టిస్తానని పేర్కొన్నారు. మంత్ర దండాలేం లేవు.. ప్రజలను ఒప్పించండి వచ్చే జనవరి కల్లా రాష్ట్రంలోని రహదారులపై అన్ని గుంతలు పూడ్చేయాలని, జనవరిలో పండుగ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే వారికి మెరుగైన రహదారులు కనిపించాలనే లక్ష్యంతో మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. లక్షల సంఖ్యలో గుంతలు పడ్డాయని, అయితే వాటిని పూడ్చేందుకు అయ్యే ఖర్చు మొత్తం స్థానిక ప్రజల నుంచే వసూలు చేయాలనుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తొలుత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణను జాతీయ రహదారుల మాదిరిగా టెండర్ పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు.ఆ విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను ఒప్పించగలిగితే వెంటనే పనులు ప్రారంభిస్తామని, అలా కాకుండా గుంతల రోడ్డులోనే తిరుగుదామంటే నాకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘గోతులు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా అన్నీ నువ్వే చేయాలంటారు. నా దగ్గర మంత్ర దండాలేవీ లేవు’ అని సీఎం పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్ వసూలును కూడా తొలుత వ్యతిరేకించారని, ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తుందని, అయినా ముందుకే వెళతామని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై చేతులు ఎత్తి సమ్మతి తెలియచేయాలని సీఎంకోరడంతో కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. తమ జిల్లాల్లో వెంటనే దీన్ని అమలు చేయాలని వారంతా కోరారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మలేషియా ఉపరితల రవాణా మంత్రి స్వామివేలును రప్పించి చెన్నై నుంచి నెల్లూరు వరకూ డబ్బులివ్వకుండా మలేషియా కంపెనీతో కలిసి రోడ్డు వేశామని చంద్రబాబు పేర్కొన్నారు. -
యూసేజ్ ఫీజు సహేతుకమే
న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్ వ్యాఖ్యానించారు. లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్వర్క్ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు. -
‘ఇదేం బాదుడు రా నాయనా’..ట్విటర్ యూజర్ల నుంచి 3 ఫీచర్లపై అదనపు ఛార్జీలు!
ట్విటర్ బాస్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు బ్లూటిక్ వెరిఫికేషన్‌పై 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన మస్క్.. తాజాగా మరో మూడు ఫీచర్లు వినియోగించిన యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచి ఆ సంస్థలో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ వెరిఫికేషన్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. తాజాగా సంస్థ ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాలని కోరడంతో పాటు..ట్విటర్లో మూడు ప్రధానమైన బేసిక్ ఫీచర్లను వినియోగించే ట్విటర్ యూజర్ల నుంచి అదనంగా కొంత మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారంటూ ఆ నివేదికలు పేర్కొన్నాయి. డైరెక్ట్ మెసేజ్ (డీఎం)ని చెల్లింపు ఫీచర్‌గా మార్చడం గురించి సలహాదారులతో మస్క్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. హై ప్రొఫెల్ ట్విటర్ యూజర్లు ఇతర ట్విటర్ యూజర్లకు పర్సనల్‌గా మెసేజ్ పంపాలనుకుంటే..వారి వద్ద నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రస్తుతానికి, ‘హై-ప్రొఫైల్ యూజర్లు’ ఏ కేటగిరీలో వస్తారనే అంశంపై స్పష్టత లేదు. వినియోగదారులు ట్విటర్లో వీడియోలు చూడాలనుకుంటే..అందుకోసం కొంత మొత్తాన్ని ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంది. వీడియోలను అప్లోడ్ చేయడానికి, వాటిని చూసేందుకు ప్రయత్నించే వీక్షకుల నుంచి ఛార్జీలు వసూలు చేసేలా మస్క్ ఒక ఫీచర్‌పై వర్క్ చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. పేవాల్డ్ వీడియో అని పిలిచే ఈ ఫీచర్‌ను మరో రెండు మూడు వారాల్లో సిద్ధం చేయాలని మస్క్ కోరుకుంటున్నట్లు నివేదించింది. అలాగే, టైం డ్యూరేషన్ ఎక్కువ ఉన్న వీడియోలు లేదా ఆడియోను పోస్ట్ చేయాలనుకునే వారు ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వరుసగా మూడు ఫీచర్లను వినియోగించుకున్న యూజర్లు అదనపు చార్జీల బాదుడు భరించాల్సిందే. -
‘స్వచ్ఛ’ సేవకు యూజర్ చార్జీ
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న చెత్తను సేకరించి, ప్రాసెస్ చేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూజర్ చార్జీలు చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలను నూరు శాతం అందించిన స్థానిక పట్టణ సంస్థల్లో చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గత ఐదు నెలలుగా 17 యూఎల్బీల్లో ఫీజు వసూలు చేస్తుండగా.. ఇప్పటి దాకా ఆయా ప్రాంతాల్లో 26.89 శాతం వసూలైంది. రాష్ట్రంలోని 123 స్థానిక పట్టణ సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటింటి చెత్త సేకరణకు చెత్త డబ్బాలు అందజేయడంతో పాటు.. ఆ చెత్తను ప్రాసెస్ యూనిట్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సైతం అందించనున్నారు. మొదటి విడతగా 42 యూఎల్బీలను ఎంపిక చేసి వాహనాల అందజేత ప్రారంభించగా, 17 యూఎల్బీలకు నూరు శాతం వాహనాల ను అందించగా, మరో 15 యూఎల్బీలకు యాభై శాతం వాహనాలను సరఫరా చేసి సేవలు ప్రారంభించారు. డిమాండ్‌లో 26.89 శాతం వసూలు రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలను పాటిం చాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అందులో భాగంగా ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని, ఆ నిధులను వాహనాలు, చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణకు వినియోగించాలని షరతు విధించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 2014–2019 సంవత్సరాలకు గాను మొదటి విడతలో కేంద్రం వాటాగా రూ.567 కోట్లు అందించింది. అయితే, ఇంటింటి చెత్త సేకరణలో 75 శాతం యూజర్ చార్జీలు వసూలు చేస్తేనే రెండో విడత స్వచ్ఛ భారత్ నిధులు ఇస్తామని చెబుతోంది. అయితే, 17 స్థానిక పట్టణ సంస్థల నుంచి రూ.58.81 కోట్ల డిమాండ్ ఉండగా.. నవంబర్ నుంచి మార్చి వరకు రూ.15.81 కోట్లు వసూలయింది. అంటే మొత్తం డిమాండ్‌లో 26.89 శాతం మాత్రమే వసూలైంది. ప్రస్తుతం యూజర్ చార్జీల వసూళ్లలో గుడివాడ మున్సిపాలిటీ 60.42 శాతంతో ముందుండగా, అమలాపురం మున్సిపాలిటీ 60.31 శాతంతో రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత కాకినాడ (54.59 శాతం), తాడేపల్లిగూడెం (50.13 శాతం), పార్వతీపురం (50.06 శాతం) మున్సిపాలిటీలు ఉన్నాయి. -
చెత్తకు యూజర్ చార్జీ కొత్తకాదు
సాక్షి, అమరావతి: చెత్త సేకరణకు యూజర్ చార్జీలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం లేదు. గతం నుంచి ఈ యూజర్ చార్జీల వసూళ్లు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో ఘనవ్యర్థాల సమస్యకు పరిష్కారం కోసం 2014 అక్టోబర్‌లో స్వచ్ఛభారత్ మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. పెరిగిపోతున్న ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు, పరికరాల నిర్వహణకు ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలన సంస్థలు యూజర్ చార్జీ వసూలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను 2016 సెప్టెంబర్‌లో ఆదేశించింది. కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలకు నిధులు కావాలంటే ‘వినియోగ రుసుం’ తప్పనిసరని చెప్పింది. దీంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. గుంటూరులో 2015లో అమలు వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు వంటి పనులకోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. సముదాయం విస్తీర్ణం, అక్కడ ఉండే జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్ నుంచి యూజర్ చార్జీల వసూలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 చొప్పున, వాణిజ్య సముదాయాలైతే రూ. 5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ. 1,500 వసూలు చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మనకే తక్కువ చార్జీలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రతి ఇంటికి రోజుకు తొలుత రూ.3 చొప్పున వసూలు చేయగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 5కు పెంచారు. ఇండోర్‌లోను ప్రతి ఇంటికీ నెలకు రూ. 150 వరకు వసూలు చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు సైతం ఏపీ కంటే ఆయా రాష్ట్రాల్లో అధికంగా చార్జీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రోజుకు ఇంటికి రూ.1 మాత్రమే.. ఘన వ్యర్థాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలు వినియోగ రుసుంను వసూలు చేస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై భారం పడకుండా 2021 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ప్రారంభించిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రజల నుంచి నెలకు రూ. 30, దారిద్య్రరేఖకు పైన ఉన్న వారి నుంచి మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 90, స్పెషల్/ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో రూ. 60 చొప్పున, నగర పంచాయతీల్లో రూ. 30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల స్థాయిని బట్టి రూ. 150 నుంచి ఆ పైన చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, క్లాప్ కార్యక్రమం గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించినా.. తొలుత ప్రజలకు ఇంటింటి చెత్త సేకరణపై అవగాహన కల్పించి, మెరుగైన సేవలతో ఫలితాలను చూపించిన అనంతరం గత ఏడాది డిసెంబర్ నుంచి చార్జీల వసూలు ప్రారంభించారు. అదీ మొత్తం 123 మున్సిపాలిటీల్లో తొలి విడతగా పూర్తిస్థాయిలో చెత్త సేకరణ వాహనాలను అందించిన 17 మున్సిపాలిటీల నుంచే ఈ వసూళ్లు చేపట్టారు. ఈ విధంగా నాలుగు నెలల్లో ఆయా మున్సిపాలిటీల నుంచి సుమారు రూ. 12 కోట్లు వసూలైంది. -
OU: ఓయూ తీరుపై విమర్శలు.. ‘నడకకు రేటు కడితే ఎలా..?’
సాక్షి, హైదరాబాద్: దట్టమైన అడవిని తలపించే పచ్చిక బయళ్ల మధ్య ఉస్మానియా అందాలను ఆస్వాదిస్తూ నిత్యం వేలాది మంది చేసే వాకింగ్‌కు ఓయూ అధికారులు వెలకట్టారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో భాగంగా సెక్యూరిటీ పేరుతో యూజర్ చార్జీల వసూలుకు పూనుకున్నారు. సినిమా షూటింగ్, వాకింగ్, జిమ్, గేమ్స్ ఇలా ప్రతిదానికి ఓ రేటు నిర్ణయించారు. దీనిపై యూనివర్సిటీలో నిత్యం వాకింగ్ చేసే ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి డిసెంబర్ ఒకటి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి మొదటి వారం తరువాత ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఓయూలో వాకింగ్.. మైమరిపించే అనుభూతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల వారికి ఉస్మానియా ప్రకృతి ప్రసాదించిన వరం. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది తెల్లవారు జామున 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇక్కడ వాకింగ్ చేసి సేద తీరుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బీపీ, షుగర్ వ్యాధులున్న వారితో పాటు అధిక బరువుతో బాధపడేవారు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, మినీ టెక్, ఐపీఈల వెనుక దట్టమైన అడవిని తలపించే మార్గంలో వాకింగ్ చేయడం ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని అనుభూతి. పొద్దున్నే పురివిప్పి నాట్యం చేసే నెమళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే మైమరచిపోయే అనుభూతి కలుగుతుంది. సామాన్యులతో పాటు హర్యాణా గరవ్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య ఇలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యూనివర్సిటీలో వాకింగ్ అనుభూతిని పొందినవారే. దీంతోపాటు ఓయూలోని ప్లేగ్రౌండ్స్‌లో వందలాది యువత క్రికెట్, వాలీబాల్, రన్నింగ్‌తో పాటు ఇతర ఆటలు ఆడుతూ క్రీడా స్ఫూర్తిని పొందుతున్నారు. భద్రత పేరుతో బాదుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భద్రత కరువైందని, నిర్మానుష్య ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని.. దీనిని నియంత్రించాలనే ఉద్దేశంతోనే యూజర్ చార్జీల నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం పసలేదని వాకర్స్ కొట్టిపడేస్తున్నారు. యూనిర్సిటీలో గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న పాతవారిని ఇటీవల తొలగించి రిటైర్డ్ ఆర్మీకి చెందిన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారి జీతభత్యాలను సమకూర్చుకోవడం కోసమే యూజర్ చార్జీల ఆలోచనను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణవాయువు ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే వారినుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఒకరిద్దరు అసాంఘిక శక్తులు ఉంటే వారిని కట్టడి చేయాలని, గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. కుటుంబంపై భారం నేను, నా భార్య ఎన్నో ఏళ్లుగా ఉస్మానియాలో వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఎటువంటి అభద్రతా భావం మాలో కలగలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వాకర్స్‌కి మెరుగైన వసతులు కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం అన్యాయం. కొంత మంది కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తారు. వారంతా నెలకు 1000 రూపాయలు వాకింగ్ కోసం చెల్లించాలంటే చాలా భారం అవుతుంది. అధికారులు ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలి. –కౌండిన్యా ప్రసాద్, వాకర్ స్వేచ్ఛగా గాలి పీల్చేందుకు ఆంక్షలా..? యూనివర్సిటీ దగ్గరగా ఉందనే ఈ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని ఉంటున్నాం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తుంటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూజర్ చార్జీలు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలంటే భద్రత పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. అవసరం అనుకుంటే ఉచితంగా ఐడీ కార్డులను పంపిణీ చేయాలి. –ఎం.నర్సయ్య, వాకర్ -
ఓయూ క్యాంపస్‌లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లో వాకింగ్ కోసం వచ్చే బయటి వారినుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. క్యాంపస్ విద్యార్థులతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ మరియు యోగా వంటి ఫిట్నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు. అయితే వాకర్స్‌కు యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్లో వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం క్యాంపస్‌లో స్విమింగ్‌పూల్, క్రికెట్ గ్రౌండ్ వాడుకునే వారి నుంచి యూజర్ చార్జీలు వసులు చేస్తున్నారు. అయితే బయటి వ్యక్తులు క్యాంపస్‌లోని వసతులను ఉచితంగా వాడుకోవడం వల్ల వాటి విలువ తెలియడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరిస్థితితులకు అనుకూలంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపట్టలేమన్నారు. కొంతమంది క్యాంపస్‌కు పెంపుడు కుక్కలను తీసుకొచ్చి ఇక్కడే మలమూత్ర విసర్జన చేయించడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు. అంతేకాక చుట్టుపక్కల నివాసముండేవారు తమ కార్లను ఈ స్థలాన్ని పార్కింగ్‌స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. రాత్రి వేళ అయితే క్రీడా మైదానాల్లో మద్యం తాగి..ఖాళీ సీసాలను పగులగొట్టి అలాగే వదలివేస్తారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ వాకింగ్‌కు ప్రముఖులు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, రాంచందర్‌రావు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థల యజమానులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ తదితరులు వాకింగ్‌కు వస్తారు. వీరి భద్రత కూడ యూనివర్సిటీ చూసుకోవలసి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వ్యక్తులు కూడా క్యాంపస్‌లో తిరుగుతుంటారు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకునే అవకాశం లేదు. అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. చదవండి: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు -
ఫోన్‌పేలో ఉచితాలకు కోత.. ఈ సర్వీసులకు మొదలైన బాదుడు..
Phone Pay User Charges: ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇండియాలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఫోన్‌పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇంతకాలం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులకు సంబంధించి ఉచితంగా అందించిన సర్వీసులకు ఇప్పుడు యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో పెట్రోలు డీజిలు ధరలు పెరుగుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ విషయం చెప్పకుండానే బాదుడు మొదలు పెట్టింది. యూజర్ ఛార్జీలు ఇప్పటి వరకు ఫోన్‌పే ద్వారా బ్యాంకు చెల్లింపులు, గ్యాస్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్, మొబైల్ రీఛార్జ్ వంటి సేవలన్నీ ఉచితంగా అందేవి. అయితే ఇటీవల పెద్దగా హడావుడి చేయకుండానే యూజర్ ఛార్జీల విధానాన్ని ఫోన్‌పే ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొబైల్ రీఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. బాదుడు ఇలా మొబైల్ రీఛార్జీలకు సంబంధించి రూ.50లోపు ఉన్న రీఛార్జీ సేవలను గతంలోలాగానే ఉచితంగా అందిస్తోంది. కానీ రూ. 50 నుంచి 100ల మధ్యన రీఛార్జ్ చేస్తే ఒక రూపాయి యూజర్ సర్వీస్ ఛార్జ్‌ని వసూలు చేస్తోంది. 100కు మించి ఉన్న రీఛార్జ్‌లకు రెండు రూపాయల వంతున యూజర్ ఛార్జీలుగా ఫోన్‌పే విధించింది. కవరింగ్ మొబైల్ రీఛార్జీ యూజర్ చార్జీలకు సంబంధించిన వివరాలను ఫోన్‌పే పెద్దగా ప్రచారం చేయడం లేదు. పైగా ప్రయోగాత్మకంగా యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది మాత్రమే యూజర్ ఛార్జీల పరిధిలోకి వస్తున్నారంటూ కవరింగ్ ఇస్తోంది. మార్కెట్ లీడర్ కానీ సెప్టెంబరులో దేశవ్యాప్తంగా ఫోన్‌పే ద్వారా రికార్డు స్థాయిలో 165 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. యూపీఏ సర్వీసులు అందిస్తున్న థర్ట్ పార్టీ యాప్‌లలో ఒక్క ఫోన్‌పేనే 40 శాతం వాటాను ఆక్రమించింది. మార్కెట్ లీడర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే సమయంలో ఫోన్‌పై యూజర్ ఛార్జీలు వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం యూజర్ ఛార్జీలకు సంబంధించి ముందుగా కొంత ప్రచారం చేయాల్సిందని అంటున్నారు. చదవండి:ఇలా చేస్తే రూ.5000 ఉచితం..! -
రైల్వే ‘యూజర్’ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్ చార్జీలు చెల్లించాల్సి రానుంది! దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు వెయ్యి స్టేషన్ల (ఏ–1)పునరాభివృద్ధిలో భాగంగా విమానాశ్రయాల తరహాలో ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవల స్పష్టం చేసిన రైల్వే బోర్డు... ఈ జాబితాలో సికింద్రాబాద్ స్టేషన్‌ను చేర్చింది. అయితే తొలుత ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికే యూజర్ చార్జీలను పరిమితం చేయనుంది. ఫస్ట్ ఏసీ ప్రయాణికులపై రూ. 30 వరకు, సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులపై రూ. 30లోపు ఈ చార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ బోగీలు, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను యూజర్ చార్జీల నుంచి మినహాయించనున్నారు. ప్రస్తుతం ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ బోగీల ప్రయాణికుల నుంచే చార్జీల వసూలును పరిమితం చేసినప్పటికీ దశలవారీగా స్లీపర్ క్లాస్, ఇతర కేటగిరీలకూ దీన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ తరువాత క్రమంగా నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి స్టేషన్లకు యూజర్ చార్జీలను విస్తరించనున్నారు. వాస్తవానికి గతంలోనే రైల్వే బోర్డు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా దీని అమలు వాయిదాపడింది. వేగంగా ప్రైవేటీకరణ.... ► రోజుకు 150 రైళ్లు, 1.85 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేష న్లో వాహనాల పార్కింగ్, టాయిలెట్లు, తాగునీరు, విశ్రాంతి గదుల వంటి సేవలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. ► సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ కరోనా దృష్ట్యా ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. ► ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ రీ–డెవలప్మెంట్కు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఐఆర్ఎస్డీసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో యూజర్ చార్జీల విధింపు అంశం ముందుకొచ్చింది. రూ. లక్షల్లో ఆదాయం... ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్వేకు నిత్యం రూ. 1.65 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ►ప్రతిరోజూ 80 వరకు నడిచే దూరప్రాంత రైళ్లలో సుమారు 30 వేల మంది ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ►ఏసీ ప్రయాణికులపై సగటున రూ.25 చొప్పున యూజర్ చార్జీలు విధిస్తే రోజుకు రూ.7.5లక్షల ఆదాయం లభించనుంది. ►ప్రయాణికుల సేవల్లో నాణ్యతను పెంచేందుకు యూజర్ చార్జీలను వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు. ►స్టేషన్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా సుమారు 2.5 ఎకరాల స్థలంలో షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, హోటల్స్ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. -
తెలంగాణ: డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలు భారీగా పెంపు!
సాక్షి, హైదరాబాద్: భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీని ఇటీవలే పెం చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై దొడ్డిదారిన మరో భారాన్ని మోపింది. క్రయవిక్రయ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలను అడ్డగోలుగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న ఫీజులు, చార్జీలను రెండింతల నుంచి పదింతలు చేసింది. ఈ నెల రెండో తేదీ నుంచే పెంపును అమల్లోకి తెస్తూ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఇటీవల అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా.. సాధారణ క్రయ, విక్రయ లావాదేవీలతోపాటు సొసైటీల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా పెంచారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ల చట్టం–2021 కింద సొసైటీలను రిజిస్టర్ చేసుకునేందుకు రూ.2 వేలు ఫీజుగా ఖరారు చేశారు. ఈ సొసైటీల జనరల్‌బాడీ సమావేశాలు, కార్యవర్గ సమావేశాల మినిట్లను ఫైల్ చేసేందుకు.. బైలాస్, ఇతర డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీల కోసం రూ.1,000 చొప్పున ఫీజు నిర్ణయించారు. సొసైటీల తనిఖీతోపాటు డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కస్టడీలో ఉంచేందుకు ఏడాదికి రూ.500 ఫీజు నిర్ణయించారు. అదే విధంగా చిట్‌ఫండ్ చట్టం–1982 మేరకు రూ.5 లక్షల వరకు చిట్టీలను రిజిస్టర్ చేసేందుకు రూ.3,500.. 5లక్షల కన్నా ఎక్కువ విలువైన చిట్టీల రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేలు, ఆర్బిట్రేషన్ ఫీజు కింద రూ.2,000 వసూలు చేయనున్నారు. ఖజానాకు రూ.500 కోట్లు డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి గణనీయంగానే అదనపు ఆదాయం సమకూరుతుందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతి నెలా కనీసం లక్ష వరకు లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజును రూ.100 నుంచి రూ.500కు పెంచిన నేపథ్యంలో.. అదనంగా నెలకు రూ.4 కోట్ల వరకు రానున్నాయి. అంటే కేవలం డాక్యుమెంట్ చార్జీల కిందే ఏటా కనీసం రూ.50 కోట్ల అదనపు రాబడి ఉంటుందని.. ఇతర లావాదేవీలు, యూజర్ చార్జీలనూ కలిపితే ఏటా కనీసం రూ.500 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇంకా ఎంతగా పెంచుతారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూములు, ఆస్తులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచింది. మళ్లీ ఇప్పుడు డాక్యుమెంట్ ఫీజులు అడ్డగోలుగా పెంచారు. ఎలాగూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కదా కట్టి చావండి అన్నట్టుగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. ఇంకా ఏమేం పెంచుతారు, ఎన్ని రకాల భారం మోపుతారు? ఇది సమంజసం కాదు. వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలు తగ్గించాలి. కొత్త రాముగౌడ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా డాక్యుమెంట్, యూజర్ చార్జీల పెంపు తీరు ఇదీ.. (రూ.లలో) డాక్యుమెంట్ రకం గత చార్జీ పెంచిన చార్జీ ర్యాటిఫికేషన్ 1,000 2,000 మార్టిగేజ్ 2,000 2,000 ఎస్పీఏ 1,000 3,000 జీపీఏ 1,000 5,000 ప్రైవేట్ అటెండెన్స్ 1,000 10,000 వీలునామా 1,000 3,000 వీలునామా విచారణ 1,000 5,000 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 100 500 15 పేజీలు దాటితే పేజీకి రూ.ఐదు 1,000 మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ 10 100 సర్టిఫైడ్‌కాపీ 200 500 ఈసీ 100 500 30 ఏళ్లు దాటిన ఈసీ 500 1,000 (ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనని ప్రతిరకం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫీజును రూ.3,000గా ఖరారు చేశారు) పెరిగిన చార్జీలు.. ఫీజులు ఇలా.. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కోసం స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు డాక్యుమెంట్ చార్జీ కింద రూ.100 తీసుకునేవారు. ఇప్పుడు రూ.500కు పెంచారు. ఈ డాక్యుమెంట్లో 15 పేజీలకు మించి ఉంటే.. ప్రతి అదనపు పేజీకి రూ.5 చొప్పున చార్జి చేసేవారు. కానీ ఇప్పుడు పేజీల సంఖ్యతో సంబంధం లేకుండా 15 పేజీలు మించిన డాక్యుమెంట్‌కు చార్జీ రూ.1,000 చేశారు. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఎవరికైనా ఇవ్వాలంటే గతంలో రూ.1,000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు చేశారు. అదే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చార్జీని రూ.1,000 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచేశారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే వీలులేని వ్యక్తుల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలంటే.. ప్రైవేట్ అటెండెన్స్ కింద గతంలో రూ.1,000 అదనపు చార్జీ తీసుకునేవారు. ఇప్పుడీ ఫీజును ఏకంగా రూ.10 వేలకు పెంచారు. సెలవు రోజున రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే.. ఇందుకు రూ. 5 వేలు ఫీజుగా ఖరారు చేశారు. ఏదైనా ఆస్తి, భూమికి సంబంధించి సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలంటే రూ.200 చార్జీ ఉండేది. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)కు గతంలో రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.500 చేశారు. 30 ఏళ్లు దాటిన ఈసీ కావాలంటే.. గతంలో రూ.500 చార్జీ ఉండేది. ప్రస్తుతం రూ.1,000కి పెంచారు. -
రైల్వేలో యూజర్ చార్జీల బాదుడు
న్యూఢిల్లీ: ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. చార్జీలు భారీగా ఉండవని యాదవ్ చెప్పారు. దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామన్నారు. ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన వేళ టికెట్ల ధరలు పెరుగుతాయన్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వచ్చింది. రైలోపోలిస్ హబ్స్.. ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలని యోచిస్తోంది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. త్వరలో దేశ వృద్ధిలో రైల్వేల వాటా 2 శాతానికి పెరగవచ్చని నీతి అయోగ్ సీఈవో అమితాబ్æ అన్నారు. స్టేషన్ల ఆధునీకరణలో జాప్యాన్ని ఇటీవల నీతీఆయోగ్ ప్రశ్నించింది. అనంతరం 50 స్టేషన్ల అభివృద్ధి ప్రణాళికల కోసం ఉన్నతాధికారులతో సాధికార గ్రూప్‌ను ఏర్పరిచింది. -
‘కొత్త’ రైల్వేస్టేషన్లలో యూజర్ చార్జీ!
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులపై విధించేలాంటి యూజర్ చార్జీలను కొత్తగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో విధించనున్నారు. దీంతో రైల్వే చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్) అనేది విమానాల్లో ప్రయాణికుడు చెల్లించే పన్నుల్లో భాగంగా ఉంటుంది. దీన్ని పలు ఎయిర్‌పోర్టుల్లో విధిస్తున్నారు. ఈవిధంగా వసూలు చేసే చార్జీ ఒక్కో స్టేషన్లో ఒక్కో రకంగా ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ ఇక్కడి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంత చార్జీ వసూలు చేస్తామనే విషయం మంత్రిత్వ శాఖ త్వరలో తెలియజేస్తుందని అన్నారు. అమృత్సర్, నాగ్‌పూర్, గ్వాలియర్, సబర్మతి రైల్వే స్టేషన్లను రూ.1,296 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడంకోసం రైల్వే ప్రతిపాదనలు చేసిందన్నారు. ‘వసూలు చేసిన చార్జీ స్టేషన్ల ఆధునీకరణకు తోడ్పడుతుంది. చార్జీలు నామమాత్రంగానే ఉంటాయి’అని యాదవ్ పేర్కొన్నారు. -
'3కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా'
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఒక్క 2019 నవంబర్ నెలలోనే ఏకంగా 3.63 కోట్ల మంది కస్టమర్లు తగ్గారు. అక్టోబర్ నెలలో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ నెలలో వొడాఫోన్ ఐడియా మొత్తం కస్టమర్ల సంఖ్య 37.26 కోట్లు కాగా.. అనూహ్యంగా నవంబర్ నెలలో 3.63కోట్ల మంది తగ్గడంతో వినియోగదారుల సంఖ్య 33.63 కోట్లకు చేరుకుందని ఆ కంపెనీ ట్రాయ్‌కు సమర్పించిన నివేదికలో తెలిపింది. చదవండి: సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం మరోవైపు క్రియాశీలకంగా లేని కస్టమర్లను తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గిందని అంటున్నారు. యాక్టివ్ యూజర్లు నమోదు చేసే సమయాన్ని 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం.. అది కూడా నవంబర్ నెలలో జరగడంతో ఈ సంఖ్య భారీగా తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు జియో తన కస్టమర్లకు షాకిస్తూ ఛార్జీలను పెంచినప్పటికీ యూజర్లు సంఖ్య మాత్రం పెరుగుతోంది. అక్టోబర్ నెలలో కొత్తగా 91 లక్షల మంది జియో యూజర్లుగా మారారు. ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన నెలలోనే జియోకు యూజర్లు పెద్ద ఎత్తున పెరగడం గమనార్హం. -
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు సేవ చేయాల్సిన ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఇప్పుడు వారి నుంచే యూజర్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేన్సర్ చికిత్సకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆసుపత్రి, ఇప్పుడు వైద్యానికి డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పలువురు రోగులు గగ్గోలు పెడుతున్నారు. పైగా వివిధ పరీక్షలకు రసీదులు కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉండగా, వారిపై కూడా యూజర్ చార్జీల భారం వేస్తుండటం రోగులకు ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చాక తిరిగి రోగులకు చెల్లిస్తామంటూ ఆసుపత్రి అధికారులు చెబుతున్నారని రోగులు అంటున్నారు. అలా ఇస్తామన్న హామీ ఎక్కడా లేదని, అక్రమాల కేంద్రంగా ఆసుపత్రి తయారైందని అంటున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి పరీక్షలకోసం యూజర్ చార్జీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని ఆయన అధికారులకు విన్నవించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు వసూలు చేసినట్లుగా చూపుతున్న రసీదులు రూ. 2,500 వరకు వసూలు కొన్ని పరీక్షలకు రూ.100 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలకు రూ. 2 వేలు, రూ. 2,500 వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకైతే డబ్బు వసూలు చేయకూడదు. పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా ఫీజులు భారీగా వసూలు చేయడంపై రోగులు గగ్గోలు పెడుతున్నారు. యూజర్ చార్జీలు రద్దు చేయాలని తాము కోరగా, ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రాగానే రోగులకు తిరిగి వెనక్కి ఇస్తున్నామని ఆసుపత్రి అర్ఎం చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత వసూలు చేయడమే తప్పు, పైగా తిరిగి చెల్లిస్తున్నామని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధమని ఆయన ఆరోపించారు. పైగా రోగులు ఎవరికీ డబ్బు తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి లేదు. అదీగాక యూజర్ చార్జీల బిల్లులు కంప్యూటరైజ్డ్వి కాకుండా చేతిరాతతో ఇస్తున్నారు. యూజర్ చార్జీల పేరుతో వసూలైన డబ్బు పూర్తిగా దుర్వినియోగమవుతున్నదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశాఖ అధికారులతో కుమ్మక్కై ఆసుపత్రిలో కొందరు ఈ డబ్బును దిగమింగుతున్నారన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ దందాపై విచారణ జరపాలని, అక్రమ వసూళ్ళను అరికట్టాలని ఆయన కోరారు. -
సింగిల్ జడ్జి వద్ద పరిష్కరించుకోండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ల వద్ద యూజర్ చార్జీల టెండర్ వివాదాన్ని సింగిల్ జడ్జి వద్ద పరిష్కరించుకోవాలని హెచ్ఎండీఏను హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. యూజర్ చార్జీల కింద నెలకు రూ.21.25 కోట్లు చెల్లించాలని హెచ్ఎం డీఏ గత మార్చిలో టెండర్లు పిలిచింది. దీనిని మహారాష్ట్రకు చెందిన ఇంద్రదీప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సింగి ల్ జడ్జి, కనీస సొమ్ము రూ.21.25 కోట్లు ఇంద్రదీప్ కంపెనీ చెల్లించ కుండా టెండర్లో పాల్గొనేలా అనుమతించాలని, ఈ టెండర్‌ను ఖరారు చేయరాదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని రద్దు చేయాలని హెచ్ఎండీఏ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాస నం దీనిని సింగిల్ జడ్జి వద్దే పరిష్కరించుకోవాలని తెలిపింది. -
రాజధానిలో యూజర్ చార్జీలు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిం చేందుకు వచ్చే సంస్థలపై యూజర్ చార్జీల భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఆర్డీఏ అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు. రాజధానిలో నిర్మించబోయే పైప్‌లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ఈ చార్జీలు వసూలు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. యూజర్ చార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చని సూచించారు. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేయబోయే పైప్‌లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. అన్ని రకాల కేబుళ్లు, పైప్ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాల్సివుంటుందని, ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు. తొలుత అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. 203 మంజూరు చేయగా అందులో 187 క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 10 ఎకరాల్లో షాపింగ్ మాల్.. అమరావతి నగరంలో 10 ఎకరాల్లో షాపింగ్ మాల్ నిర్మించాలని, థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింగ్ సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని సీఆర్డీఏ నిర్మించి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఏడాదిన్నరలో 38 వేల కుటుంబాలు రాజధానికి తరలివస్తాయన్న అంచనాతో వారి అవసరాల నిమిత్తం ఈ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాజధానిలోని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ హోటళ్ల ప్రతిపాదనను విజయవాడలోని మురళీ ఫారŠూచ్యన్ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా మహిళల ఆరోగ్య పరిరక్షణ (కేన్సర్‌పై లక్ష మందికి అవగాహన కల్పణ) కార్యక్రమానికి సంబంధించిన రెండు అవగాహన ఒప్పందాలను మెప్మా, హెల్త్ యూనివర్శిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ భాగస్వామ్యంతో చేపట్టనుంది. సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వెయ్యి అపార్టుమెంట్లు నిర్మిస్తాం రూ.494 కోట్లతో రాజధానిలో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీఏ సమావేశం తర్వాత ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల కోసం వీటిని నిర్మిస్తున్నామని, నిర్మాణం పూర్తయ్యాక వేలం ద్వారా వారికి విక్రయిస్తామన్నారు. జీ+11 విధానంలో మూడు కేటగిరీల్లో ఈ అపార్టుమెంట్లు నిర్మిస్తామని ఇందుకోసం ప్రభుత్వం పది ఎకరాలు కేటాయించిందన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500 అపార్టుమెంట్లు, 1500 అడుగుల్లో 300, 1800 అడుగుల్లో 200 అపార్టుమెంట్లను నిర్మిస్తామన్నారు. చదరపు అడుగును రూ.3,500కు విక్రయిస్తామని తెలిపారు. -
‘పాట పాడాలన్నా’.. పైసా పడాల్సిందే!
సాక్షి, అమరావతి: చిత్తూరుకు చెందిన రామారావు తన కుమారుడిని విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. వారాంతంలో తన కుమారుడిని చూసి వచ్చేందుకు సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడకు బయలుదేరితే టికెట్ ధర రూ.560 అయ్యింది. అయితే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ బస్టాండ్లలో యూరినల్స్‌కు టాయిలెట్లను వాడకున్నందుకు ప్రతి చోటా రూ.5 చొప్పున రూ.25 చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాల పేరిట ప్రతి టికెట్‌పై అదనంగా సెస్సు పేరిట రూపాయి వసూలు చేయడం గమనార్హం. మళ్లీ యూరినల్స్ చార్జీల కింద అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికుల్ని దోపిడీ చేస్తోంది. బీవోటీ విధానంలో దోపిడీ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి బస్టాండ్లలో యూరినల్స్‌కు యూజర్ చార్జీల కింద ఆర్టీసీ రూ.5 వసూలు చేస్తోంది. గతంలో బస్టాండ్లలో మరుగుదొడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా అప్పగించారు. అప్పట్లో యూరినల్స్‌కు మాత్రం ఎలాంటి చార్జీలు వసూలు చేసేవారు కాదు. అయితే ఇప్పుడు నిర్మించు–నిర్వహించు–అప్పగించు (బీవోటీ) విధానంలో రెస్ట్ రూమ్‌ల నిర్వహణను 20 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ అప్పగించింది. దీనిలో భాగంగా రెండేళ్ల కిందట విజయవాడ ప్రధాన బస్టాండ్‌లో రెస్ట్ రూమ్ పేరిట టాయిలెట్లను నిర్వహిస్తూ యూరినల్స్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. సిటీ టెర్మినల్‌లో రూ.2 వంతున వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు బస్టాండ్లలోనూ అమలుచేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. గుంటూరులో విజయవాడకు నడిపే సర్వీసుల కోసం ప్రత్యేకంగా మరో బస్టాండ్ నిర్మిస్తున్నారు. అక్కడ కూడా బీవోటీ విధానం ద్వారా నిర్మించే మరుగుదొడ్లలో యూరినల్స్‌కు యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఏటా టికెట్లపై సెస్సు పేరిట రూ.60 కోట్ల వసూళ్లు ప్రయాణికులకు బస్స్టేషన్లలో తగిన వసతులతో పాటు మూత్రశాలలకు సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ తన ప్రయాణికుల నుంచి అభివృద్ధి సెస్సు పేరిట ప్రతి టికెట్‌పై రూపాయి వంతున వసూలు చేస్తోంది. 2013 నుంచి సెస్సు వసూలు చేస్తోంది. దీనివల్ల ఆర్టీసీకి ఏటా రూ.60 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. ప్రయాణికుల నుంచి సౌకర్యాల కోసం వసూలు చేస్తూ మళ్లీ యూరినల్స్‌కు వెళ్లేందుకు రూ.5 చొప్పున వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 కోట్లతో తొమ్మిది జిల్లాల్లో టాయిలెట్ల నిర్మాణం ఆసక్తిగల కంపెనీల నుంచి తొమ్మిది జిల్లాల్లో నిర్మించే టాయిలెట్లకు రూ.2 కోట్ల వరకూ వెచ్చించనున్నారు. శ్రీకాకుళం బస్టాండ్‌లో రూ.17 లక్షలు, కావలిలో రూ.13 లక్షలు, విజయనగరంలో రూ.16 లక్షలు, విశాఖలో 25 లక్షలు, గుంటూరులో రూ.26 లక్షలు, చిత్తూరులో రూ.23 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో రూ.36 లక్షలు, కర్నూలులో రూ.18 లక్షలు, అనంతపురంలో రూ.26 లక్షలతో రెస్ట్ రూమ్‌లు నిర్మించనున్నారు. -
రాజధాని బస్టాండ్‌లో ధరల బాదుడు
► మరుగుదొడ్డికి వెళితే యూజర్ చార్జీలు ► ప్రతి వస్తువుపై అదనపు ధరలు వసూలు ► రూ.5 నుంచి రూ.10 వరకు వసూలతో ప్రయాణికుల జేబులకు చిల్లు ► ఆర్టీసీ ఎండీ ఉండే బస్టాండ్‌లోనే అదనపు ధరలపై చర్యలు నిల్లు విజయవాడ బ్యూరో : ప్రకృతి పిలుస్తుందని వెళితే యూజర్ చార్జీలు వాత పడాల్సి వస్తోంది. దాహం తీర్చుకుందామని మినరల్ వాటర్ కొంటే దాని ధర చూసి గొంతులో తడారిపోతోంది. పోనీ లూజ్ వాటర్ కొని దప్పిక తీర్చుకుందామంటే అది తాగితే ఖచ్చితంగా విరేచనాలు కావడం కాయం. అల్పాహారం, భోజనం ఏదైనా ధరలు చూస్తే బెదరాల్సిందే. ఇవి ఎక్కడో కాదు రాజధాని ప్రాంతంలోని విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్(పీఎన్బిఎస్)లో ప్రయాణీకుల జేబులకు చిల్లుపడుతున్న వైనాలు. ఆర్టీసీ పరిపాలన కార్యాలయం కూడా బస్టాండ్పైనే ఏర్పాటు చేయడంతో దీన్ని ఎయిర్‌పోర్టు తరహాలో బస్‌పోర్టుగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. సౌకర్యాలు, అందాలు, హంగులతో దీన్ని ఆకట్టుకునేలా అభివృద్ధి చేయడం ఒక ఎత్తు అయితే దానికి మరోవైపు జరుగుతున్న తంతు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇక్కడ మూత్ర విసర్జనకు వెళితే రూ.5, మరుగుదొడ్డికి వెళితే రూ.10 యూజర్ చార్జీలు ఇచ్చుకోవాల్సిందే. మరోవైపు బస్టాండ్‌లోనే నీళ్లు, ఆహారం తీసుకోవాలంటే సగటు ప్రయాణికులు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బస్టాండ్‌లో ఉన్న స్టాల్స్ వద్ద ఏర్పాటు చేసిన ధరల పట్టిక బోర్డులకే పరిమితం. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇక్కడ మంచినీళ్లు బాటిల్ నుంచి బిస్కెట్ ప్యాకెట్ ధరలు మారిపోతుంటాయి. మామూలుగా రూ.20 ఉంటే మినరల్ వాటర్ బాటిల్ ధర ఇక్కడ రూ.25, రూ.10 ఉండే బిస్కెట్ ప్యాకెట్ రూ.15, రూ.30 ఉండే కూల్ డ్రింక్ బాటిల్ రూ.40, రూ.45 వసూలు చేస్తున్నారు. రెండు ఇడ్లీ రూ.25, దోశ రూ.50, భోజనం రూ.90, టీ రూ.10, స్పెషల్ టీ రూ.20, హార్లిక్స్, బూస్ట్ రూ.30 ఇలా ఇష్టానుసారం ధరలు పెట్టి ప్రయాణీకులను బెదరగొడుతున్నారు. బయట కంటే ప్రతిదీ రూ.5 నుంచి రూ.10పైగా అదనపు ధరలకు విక్రయాలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు అటువైపు దృష్టి పెట్టారు. ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరరావు ఉండే ప్రధాన బస్టాండ్‌లోనే హైటెక్ మాటున అదనపు ధరలు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరని ప్రయాణికులు అంటున్నారు. -
బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ
-
బతుకు ‘బస్టాండే’
బస్టాండ్లలో వినియోగ చార్జీలు బెజవాడతో మొదలు సాక్షి, హైదరాబాద్: బస్సు ఎక్కితేనే కాదు.. బస్టాండ్‌లో అడుగుపెట్టినా ప్రయాణికులపై చార్జీల భారం మోపేలా ఏపీఎస్ ఆర్టీసీ వ్యూహా లురచిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని బస్టాండ్లలో యూజర్ చార్జీల మోత మోగించడానికి రంగం సిద్ధం చేసింది. దశల వారీగా బస్టాండ్లలో యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లను అభివృద్ధి చేసి, వాటిల్లో ఉండే మూత్రశాలల్లో చార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే ఇంకా ఆదాయ మార్గాలు ఏవేం ఉన్నాయో.. పరిశీలించి కన్సల్టెంట్లతో ప్రణాళికలు రూపొందించాలని యోచిస్తున్నారు. మార్చి 1 నాటికి అందిన ప్రతిపాదనలపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనున్నారు. మూత్ర విసర్జనకు రూ. 5 : ఇప్పటికే విజయవాడ బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు రూ. 5 వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణీకులు నిరసన వ్యక్తం చేస్తున్నా.. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం తమ వసూళ్లను సమర్థించుకుంటోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రైల్వే స్టేషన్లో మాదిరి తాము ఫ్లాట్ ఫాం టికెట్ వసూలు చేయడం లేదు కదా అంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రూ. 5 వసూలు విధానం రాష్ర్టంలోని అన్ని బస్టాండ్ల లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. నష్టాల్ని తగ్గించుకోవడానికే..: ఆర్టీసీ గతేడాది నాటికి రూ. 330 కోట్ల నష్టాల్లో ఉందని, సంస్థలో అంతర్గత చర్యలు చేపట్టి (డీజిల్ భారం తగ్గడం, బస్ చార్జీలు పెంచడం) రూ.160 కోట్ల నష్టాన్ని తగ్గించగలిగామని ఆర్టీసీ పేర్కొంటోంది. యూజర్ చార్జీలు విధించి నష్టాల్ని కొంత మేరైనా తగ్గించేయోచనలో ఉన్నామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
బతుకు ‘బస్టాండే’
-
‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీల నిర్మాణం సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్మార్ట్ సిటీల్లో పౌర సేవలకు కనీస యూజర్ చార్జీలు ఉండాల్సిందేనని, సేవలను ఉచితంగా అందిస్తే విలువతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండదని అభిప్రాయపడ్డారు. దక్షిణ, మధ్య భారత్ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికైన 40 నగరాలకు చెందిన మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో స్మార్ట్ట్ సిటీలపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం కష్టమే కాని, అసాధ్యం కాదన్నారు. ఈ విషయంలో మేయర్లు, మునిసిపల్ కమిషనర్ల పాత్ర కీలకమన్నారు. నగరాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను పన్నులు, ఇతర మార్గాల్లో స్థానికంగానే సమీకరించుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధంగా మున్సిపాలిటీలు తమ రుణ చెల్లింపుల రికార్డును మెరుగుపరుచుకోవాలన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం ద్వారా సులువైన పద్ధతుల్లో పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ యజ్ఞంలో నగరాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు వచ్చే కేంద్రం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.23,111 కోట్లు మాత్రమే కేటాయించారని, రానున్న ఐదేళ్లలో రూ.87,143 కోట్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. స్మార్ట్ సిటీల్లో 10 శాతం సౌర విద్యుత్ వినియోగం వుండాలని, భవనాలపై సౌర విద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. సదస్సులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీర్ శర్మ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీగా బార్సిలోనా అభివృద్ధి పరిణామక్రమాన్ని వివరిస్తూ సమీర్ శర్మ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
స్మార్ట్ సిటీల్లో యూజర్ చార్జీలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల పథకానికి ఆర్థిక వనరుల కోసం ఆ సిటీల్లో యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఈ దిశగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని జీవన విధానాన్ని మెరుగుపర్చడం కోసం వీటిని సిద్ధం చేస్తున్న ఆ శాఖ అధికారులు వెల్లడించారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికైన నగరంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయడానికి నిర్వహణ ఖర్చుల కింద యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (ఏఎంఆర్టీయూ) పథకం కింద వసతులు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై అనేక వర్క్‌షాపులు నిర్వహించింది. ఈ నగరాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు నీటి సరఫరా ఆధారిత టారిఫ్‌లతో మోడల్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు సమాచారం. మోడల్ డాక్యుమెంట్లో పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలందిస్తామన్నారు. మంచి సౌకర్యాలున్నప్పుడే ప్రజలు అభివృద్ధికి సహకరిస్తారని వివరించారు.