![High court on user charges - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/11/hydea.jpg.webp?itok=ZTv6yaR0)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌గేట్ల వద్ద యూజర్ చార్జీల టెండర్ వివాదాన్ని సింగిల్ జడ్జి వద్ద పరిష్కరించుకోవాలని హెచ్‌ఎండీఏను హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
యూజర్ చార్జీల కింద నెలకు రూ.21.25 కోట్లు చెల్లించాలని హెచ్‌ఎం డీఏ గత మార్చిలో టెండర్లు పిలిచింది. దీనిని మహారాష్ట్రకు చెందిన ఇంద్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సింగి ల్ జడ్జి, కనీస సొమ్ము రూ.21.25 కోట్లు ఇంద్రదీప్ కంపెనీ చెల్లించ కుండా టెండర్‌లో పాల్గొనేలా అనుమతించాలని, ఈ టెండర్‌ను ఖరారు చేయరాదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని రద్దు చేయాలని హెచ్‌ఎండీఏ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాస నం దీనిని సింగిల్ జడ్జి వద్దే పరిష్కరించుకోవాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment