యూజర్ ఛార్జీలపై ఆలోచన చేస్తున్నాం | andhra pradesh government seeks user charges in government hospitals | Sakshi
Sakshi News home page

యూజర్ ఛార్జీలపై ఆలోచన చేస్తున్నాం

Published Wed, Jul 16 2014 1:26 PM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

andhra pradesh government seeks user charges in government hospitals

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ ఛార్జీలపై ఆలోచన చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖామంత్రి  కామినేని శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్ సమీక్షలో ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని ప్రతిపాదించారని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని కామినేని అన్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూజర్ ఛార్జీలకు ఆమోదం తెలిపితే.... పేదలు కూడా డబ్బులు చెల్లించాల్సిందే.  ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలంటే యూజర్ ఛార్జీలు వసూలు తప్పవని బాబు సర్కార్ సంకేతాలు ఇస్తోంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement