సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను ప్రకటించింది. జియో, ఎయిర్‌టెల్ లాంటి దిగ్గజాలతో పోలిస్తే 5జీ సేవల్లో వెనుకబడి ఉన్న వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. త్వరలో 5జీని తీసుకు రావాలని యోచిస్తున్నట్లు హామీ ఇచ్చిన కంపెనీ తాజాప్లాన్లు ప్రకటించడం విశేషం. (Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!)
యాక్టివ్ కస్టమర్ బేస్‌ను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా,రూ 368, రూ 369 ధరలతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య ఉన్న తేడా ఏంటంటే..
వొడాఫోన్ ఐడియా రూ.368
అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎంఎస్ ఉచితం. వాలిడిటీ 30 రోజులు. అంటే టోటల్‌గా 60జీబీ డేటాని వినియోగదారులు ఎంజాయ్ చేయొచ్చు. దీంతోపాటు 30 రోజులు చెల్లుబాటు అయ్యేలా సన్నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ సబ్‌స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?)
వొడాఫోన్ ఐడియా రూ.369
ఈప్లాన్‌లోకి రూ.368 ప్లాన్ లాంటి ప్రయోజనాలే లభ్యం. కానీ బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్, టీవీ యాప్స్, ప్రతినెల 2జీబీ వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని క్లెయిమ్ చేయడానికి 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?)
Comments
Please login to add a commentAdd a comment