హరియాణా : దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారస్తులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దేశంలో 24 పట్టణాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే 'టీకా మహోత్సవ్' పేరుతో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేయడంతో మిగిలిన పట్టణాల కంటే గురుగ్రామ్ తొలిస్థానంలో ఉందని జిల్లా సివిల్ సర్జన్ వీరేంద్ర యాదవ్ తెలిపారు. వ్యాక్సిన్ వేయడం, కరోనా నిబంధనలు పాటించడం వల్లే సాధ్యమైందని, అందుకు గురుగ్రామ్ ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం గురుగ్రామ్ లో కరోనా డ్రైవ్ కొనసాగుతుండగా.. సోమవారం( జూన్ 21) గురుగ్రామ్ జిల్లాలో 30 వేల మందికి మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను ఎంకరేజ్ చేసేందుకు పలు మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు కష్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున‍్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తూనే.. క‍్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సింగిల్ టీకా వేయించుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్, రెండు టీకాలు వేయించుకున్న వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఈ ఆఫర్ పై ఓ పబ్ డైరెక్టర్ 'వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రోత్సహించినట్లు ఉంటుంది. బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు.
మరోవైపు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ల కృషికి అభినందనలు తెలుపుతూ అంబిఎంచె మాల్ యాజమాన్యం స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఐడీ కార్డ్ ఉంటే ఫ్రీ కార్ పార్కింగ్ సర్వీస్ తో పాటు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నామని మాల్ ప్రతినిధి గీతా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment