
న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు.. రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలకు డిజిటల్ రూపంలో చేసే చెల్లింపులపై అటు కస్టమర్ల నుంచి కానీ, ఇటు వర్తకుల నుంచి కానీ ఎటువంటి చార్జీలు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేటును వసూలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకు పైగా ఉన్న సంస్థలు తమ కస్టమర్లకు తక్కువ చార్జీలతో కూడిన డిజిటల్ చెల్లింపుల విధానాలను ఆఫర్ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయం గమనార్హం.బ్యాంకులే ఈ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ఆదాయపన్ను చట్టంలో, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో సవరణలు చేశారు. నూతన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తన ఆదేశాల్లో తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment