CBTD
-
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు
కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును జూన్ 30 వరకు పొడిగించిది. కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ట్యాక్స్‌పేయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు నుంచి గడవు పొడిగించాలని తమకు వినతులు వచ్చినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది. ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటినీ ఈ స్కీమ్ కింద సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కొంత మొత్తం చెల్లించి క్లియర్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి ఊరట కలగనుంది. చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం -
ఆధార్‌తో తక్షణం పాన్ నంబరు
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్లైన్లో పాన్ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. ‘ఆధార్ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ–పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది’ అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఈ–ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుదారు ఇన్స్టంట్ పాన్ పొందవచ్చు. వెబ్సైట్లో తన ఆధార్ నంబరు పొందుపర్చాక, దానికి అనుసంధానమైన దరఖాస్తుదారు మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీని సమర్పించాక 15 అంకెల అక్నాలెడ్జ్మెంట్ నంబరు వస్తుంది. కేటాయింపు పూర్తయ్యాక ఈ–పాన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్‌తో రిజిస్టరైన మెయిల్–ఐడీ ఉంటే దానికి కూడా ఈ–మెయిల్ వస్తుంది. తక్షణం పాన్ కేటాయించే ప్రక్రియకు సంబంధించిన బీటా వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆదాయపు పన్ను శాఖ తమ ఈ–ఫైలింగ్ వెబ్సైట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మే 25 దాకా దీని ద్వారా 6,77,680 పాన్ నంబర్లు కేటాయించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ–పాన్ కేటాయించగలిగినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి. -
పెద్ద సంస్థలకు డిజిటల్ చెల్లింపులపై చార్జీల్లేవు
న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు.. రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలకు డిజిటల్ రూపంలో చేసే చెల్లింపులపై అటు కస్టమర్ల నుంచి కానీ, ఇటు వర్తకుల నుంచి కానీ ఎటువంటి చార్జీలు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేటును వసూలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకు పైగా ఉన్న సంస్థలు తమ కస్టమర్లకు తక్కువ చార్జీలతో కూడిన డిజిటల్ చెల్లింపుల విధానాలను ఆఫర్ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయం గమనార్హం.బ్యాంకులే ఈ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ఆదాయపన్ను చట్టంలో, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో సవరణలు చేశారు. నూతన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తన ఆదేశాల్లో తెలియజేసింది. -
ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. -
బంగారంపై వదంతులు నమ్మొద్దు
-
బంగారంపై వదంతులు నమ్మొద్దు
► చట్టబద్ధంగా సమకూర్చుకుంటే ఒకరి వద్ద ఎంత బంగారమైనా ఉండొచ్చు ► పరిమితులేమీ పెట్టబోవడం లేదు ►కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టీకరణ వదంతి: నల్లధనంపై భారీగా 85 శాతం పన్ను ప్రతిపాదించినట్లుగానే... ఐటీ చట్టానికి తెస్తున్న సవరణలో పెద్ద మొత్తంలో బంగారం, బంగారు ఆభరణాలు ఉంటే కూడా పన్నులు, జరిమానాలు వేయనున్నారు. లాకర్లన్నీ తనిఖీ చేస్తారు. వాస్తవం (సీబీడీటీ వివరణ): అలాంటిదేమీ లేదు. లెక్కల్లో చూపని ఆదాయంపై పన్నును పెంచడానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115బీబీఈకి సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న గరిష్ట పన్నును 60 శాతానికి పెంచుతారు. దీనిపై 25 శాతం సర్‌చార్జి వేస్తారు. అంటే పన్ను 75 శాతానికి చేరుతుంది. లెక్కచూపని ఆదాయంగా నిర్ధారణ అయితే మరో 10 శాతం జరిమానా విధిస్తారు. తద్వారా పట్టుబడిన నల్లధనంలో 85 శాతం ప్రభుత్వానికే పొతుంది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభ ముందున్న ఈ సవరణ బిల్లులో బంగారంపై ఎలాంటి కొత్త పన్నును ప్రతిపాదించలేదు. ♦ ప్రకటిత ఆదాయంతో కొన్న బంగారంపై ఎలాంటి కొత్త పన్ను, జరిమానా ఉండదు. ♦ వ్యవసాయరంగం లాంటి మినహాయింపున్న రంగం నుంచి వచ్చిన ఆదాయంతో బంగారం కొన్నా కొత్తపన్నేమీ వేయరు. ♦ ఇల్లాలు దాచిన డబ్బుతో కొన్నా... కొత్తగా పన్ను ఉండదు. అయితే ఇలాంటి బంగారం పరిమాణం సహేతుకంగా ఉండాలి. ఆదాచేయగలిగేది ఎంత? కొన్నది ఎంతనే దానికి పొంతన ఉండాలి. ♦ వారసత్వంగా పూర్వీకుల నుంచి వచ్చిన బంగారం లేదా ఆభరణాలపైనా పన్నువేయరు. ♦ ప్రస్తుతం ఉన్న చట్టాల్లోనూ ఇలాంటి నిబంధనలు లేవు... ప్రతిపాదిత సవరణల్లోనూ ఇలాంటివేమీ పెట్టలేదు. వదంతి: వివాహిత 500 గ్రాములు (50 తులాలు), అవివాహిత మహిళ 250 గ్రాములు (25 తులాలు), పురుషుడి వద్ద 100 గ్రాముల (10 తులాలు)కు మించి ఉంటే... ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. దీనిపై భారీ పన్ను వేస్తారు. వాస్తవం: నిజం కాదు. కొత్త చట్టంలో బంగారంపై అదనపు పన్నులు వేయడం, పన్ను పెంచడం లాంటివేమీ చేయలేదు. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నపుడు కూడా వివాహిత వద్ద 50 తులాలు, అవివాహిత అయితే 25 తులాలు, పురుషుడి వద్ద 10 తులాలకు పైగా ఉంటేనే... వాటిని స్వాధీనం చేసుకోవాలని, పైన చెప్పిన దానికన్నా తక్కువ ఉంటే అలాంటి బంగారం, ఆభరణాల జోలికి వెళ్లకూడదనే నిబంధన ఉంది. బంగారంపై కొత్త పన్నులేమీ ప్రతిపాదించలేదని వివరణ ఇస్తూ ఐటీ శాఖ పై నిబంధనను ఉటంకించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పి... 50 తులాల కంటే ఎక్కువుంటే స్వాధీనం చేసేసుకుంటారని పుకార్లు లేవదీశారు. ♦ చట్టబద్ధంగా సమకూరినదైతే ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. అనేదానిపై పరిమితులేమీ పెట్టబోవడం లేదు. ♦ ఒకవేళ దాడులు జరిగినపుడు 50 తులాలకు మించి ఉన్నా... ఆయా వర్గాల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వం ఐటీ శాఖకు ఆదేశాలు జారీచేసింది. ♦ బంగారంపై వస్తున్న పుకార్లను ఖండించడానికి, ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చనే పరిమితిపై వివరణ ఇవ్వడానికి గురువారం ఆర్థిక శాఖ రెండుసార్లు ప్రకటనను విడుదల చేసింది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్