వినియోగదారులకు అండగా పౌర సరఫరాల శాఖ రిడ్రెసల్ సెల్, వినియోగదారుల ఫోరంమోసాల బారి నుండిచట్టం ద్వారా రక్షణనిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారమే లక్ష్యంఫోరంలో 94,105 కేసులకుగానూ 89,057 కేసుల పరిష్కారరిడ్రెసల్ సెల్‌లో 3,275 కేసులకు పరిష్కారం
చట్టం.. వినియోగదారుల చుట్టం..
మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకే వినియోగదారుల చట్టం ఉంది. వినియోగదారుల ఫోరం పేరిట ఏర్పడిన ఈ చట్టానికి, 1986 డిసెంబర్ 24న రాష్ట్రపతి ఆమోదం లభించి, అదేరోజు నుండి అమల్లోకి వచ్చింది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా మూడు అంచెలుగా ఫోరం ఉంటుంది. రూ.20 లక్షల లోపు పరిహారం కోసం జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటిలోపు హైకోర్టు, రూ.కోటి పైబడి పరిహారం కోసం సుప్రీంకోర్టు వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే వినియోగదారుల ఫోరంలో నేరుగా కేసు దాఖలు చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర వినియో గదారుల ఫోరంలో నాలుగేళ్లలో 5,684 కేసులు నమోదు కాగా, 2,999 కేసులు పరిష్కార మ య్యాయి. 2,685 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరంలలో 94,105 కేసులు నమోదు కాగా, 89,057 కేసులు పరిష్కారమయ్యాయి.
5,048 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వినియోగదారులకు వారి హక్కులపట్ల అవగాహన కల్పించడమే కాకుండా, ఉచితంగా సమస్యలను పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించేలా పౌర సరఫరాలశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ఏర్పా టైంది. దీనికి వచ్చిన ఫిర్యాదులపై గత ఏడాది కాలంలో తూనికలు, కొలతల శాఖ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, విత్తన, ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, పెట్రోల్ పంపులు, వే బ్రిడ్జీలు, బహుళజాతి సంస్థల గోదాములు, నగల దుకాణాలు, ఫైర్ క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వ హించి 3,059 కేసులను నమోదు చేసి, రూ. 25.08 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసింది. సోమ వారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలలో పెండింగ్ కేసులను గడువులోగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదా రుల వ్యవహారాల విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కాలంలో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం హెల్ప్‌లైన్‌కు వివిధ అంశా లకు సంబంధించి 3,344 ఫిర్యాదులను నమోదు చేసింది. 3,275 కేసులను పరిష్కరించింది.
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం..
నష్టం జరిగిందని, మోసపోయామని భావించిన వినియోగదారులు రిడ్రెసల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలనకు స్వీకరించిన తరువాత ప్రతివాదుల సంజాయిషీకి రెండు, మూడు వారాల కాలపరిమితి విధిస్తూ నోటీసు జారీ చేస్తారు. ఒక నిర్ణీత తేదీనాడు వారిని కేంద్రానికి పిలిపించి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారు. ఇరుపక్షాలకు అంగీకారయోగ్యమైన పరిహారాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు. రిడ్రెసల్ సెల్‌లో ప్రతి శనివారం ఈ ‘కౌన్సెలింగ్’ నిర్వహిస్తారు. ఇది ఉచితం. సమస్య పరిష్కారంకాని పక్షంలో జిల్లా వినియోగదారుల ఫోరంకు కేసును బదిలీ చేస్తారు.
బాధితులకు అండగా ఫోరం
ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. ఆ హక్కుకు భంగం కలిగితే ఒక తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో రాసి రాష్ట్ర వినియోగదారుల సమాచార, సలహా, సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. త్వరితగతిన సమస్యలు పరిష్కారం కావడంతో ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్
ఇలా.. ప్రతిచోట వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. అడుగడుగునా దగా పడుతూనే ఉన్నారు. తినే ఆహారం మొదలు వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల వరకు అన్నీ కల్తీ, నకిలీమయమే. రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్, బ్యాంకులు ఇలా రకరకాల సంస్థలు వినియోగ దారులను మోసం చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల్లో కల్తీల వల్ల అన్నదాత బలి అవుతున్నాడు. వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోగలిగితే ఇలాంటి మోసాల బారి నుంచి వినియోగదారుల చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు.
– సాక్షి, హైదరాబాద్
►రాంబాబు ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపులో రూ.30 వేలు పెట్టి ఎల్‌ఈడీ టీవీ కొన్నాడు. వారం తిరగక ముందే మరమ్మతుకు గురైంది. దాని స్థానంలో కొత్త టీవీ కావాలని కోరితే ఆ షాపు యాజమాన్యం నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది.
►ప్రశాంత్ ఓ హోల్‌సేల్ షాపులో నూనె ప్యాకెట్ కొని ఇంటికొచ్చి తెరిచి చూడగా అది నాసిరకమని తేలింది. ఇదేంటని షాపు సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రశాంత్‌ను అక్కడి నుంచి గెంటేశారు.
Comments
Please login to add a commentAdd a comment