forum
-
రాజకీయ సౌలభ్యం కోసం...ఉగ్రవాదంపై మెతక వైఖరా?
ఐక్యరాజ్యసమితి: ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న కెనడాకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ చురకలంటించింది. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసల విషయంలో కేవలం రాజకీయ సౌలభ్యం కోసం మెతక వైఖరి అవలంబించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి అవకాశవాద ధోరణులకు దూరంగా ఉండాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. మంగళవారం ఐరాస 78వ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ మేరకు కుండ బద్దలు కొట్టారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న కొద్ది బుద్ధులను కూడా ఏకిపారేశారు. ‘ప్రాదేశిక సమగ్రత, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టరాదన్నవి కనీస మర్యాదలు. అంతే తప్ప ఇలాంటి విషయాల్లో తమ రాజకీయ స్వార్థాలకు, అవసరాలకు అనుగుణంగా ఇష్టానికి వైఖరులు మార్చుకునే తీరు సరి కాదు‘ అంటూ పాక్ తో పాటు పరోక్షంగా అమెరికా తీరును కూడా దుయ్యబట్టారు. ఐరాస వేదికగా పాక్ తాత్కాలిక ప్రధాని ఇటీవల దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు, దౌత్య సంక్షోభానికి దారి తీసింది. హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో మంటలు రాజుకున్నాయి. ఖలిస్తానీ అనుకూల పార్టీ మద్దతుతో అధికారాన్ని కాపాడుకుంటున్న ట్రూడో వారిని మంచి చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన సొంత పార్టీ ఎంపీలే విమర్శిస్తుండటం తెలిసిందే. అంతేగాక నిజ్జర్ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని కెనడాతో అమెరికా పంచుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్, అమెరికా తీరును పరోక్షంగా దుయ్యబడుతూ ఐరాస వేదికపై జై శంకర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద దేశాలూ, కొద్ది బుద్ధులు! పెద్ద దేశాల పెత్తందారీ, ఏకపక్ష పోకడలకు వ్యతిరేకంగా వర్ధమాన దేశాల గొంతుకను ఐరాస వేదికపై జై శంకర్ ఈ సందర్భంగా గట్టిగా వినిపించారు. కొన్ని పెద్ద దేశాలే తమ అవసరాలకు అనుగుణంగా అజెండాను నిర్దేశించి, మిగతా దేశాలన్నీ తమను అనుసరించాలని కట్టడి చేసే రోజులకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. ‘ఈ పోకడలు ఎల్లకాలమూ చెల్లవు. వాటినెవరూ సవాలే చేయరని అనుకోవద్దు. వ్యాక్సిన్ల విషయంలో వర్ణ వివక్షను ఇంకెప్పుడూ అనుమతించరాదు. వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడంలో పెద్ద దేశాలు తమ బాధ్యతలను తప్పించుకోరాదు. నిరుపేద దేశాలకు అందాల్సిన ఆహార, ఇంధన నిల్వలను పెద్ద దేశాలు తమ మార్కెట్ బలాన్ని ఉపయోగించి చెరబట్టరాదు‘ అంటూ శషభిషలకు తావు లేకుండా స్పష్టం చేశారు. అభివృద్ధిలోనూ, అన్నింట్లోనూ అన్ని దేశాలకూ సమాన భాగస్వామ్యం కల్పించే నూతన ప్రజాస్వామిక వాతావరణం నెలకొని తీరుతుందని మంత్రి ధీమా వెలిబుచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అన్ని రకాల నిబంధనలు అన్ని విషయాల్లోనూ అన్ని దేశాలకూ సమానంగా వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అలీనోద్యమానికి మద్దతిచ్చిన రోజుల నుంచి విశ్వ మిత్ర (ప్రపంచ నేస్తం) స్థాయి దాకా భారత్ ఎదిగింది. మిగతా దేశాలన్నీ తమ జాతీయ ప్రయోజనాలే చూసుకుంటాయి. భారత్ మాత్రం విశ్వ శ్రేయస్సునే తన మేలుగా భావిస్తుంది‘ అని స్పష్టం చేశారు. ఆ గురుతర బాధ్యతను దృష్టిలో ఉంచుకునే జీ20 సారథ్యాన్ని భారత్ స్వీకరించిందని వివరించారు. ‘ఇతర దేశాల వాదనను సానుభూతితో వినడం, వాటి వైఖరిని గౌరవించడం బలహీనత కాదు. పరస్పర సహకారానికి సూచిక. ఐరాస లక్ష్యానికి కొనసాగింపు‘ అంటూ చైనా మితి మీరిన దూకుడుకు కూడా జై శంకర్ చురకలు వేశారు. -
792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశీయంగా యాప్ ఎకానమీ 2030 నాటి కి 792 బిలియన్ డాలర్లకు చేరనుంది. తద్వారా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 12 శాతం వాటాను దక్కించుకోనుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బీఐఎఫ్ తరఫున ఐసీఆర్ఐఈఆర్ సీనియర్ విజిటింగ్ ప్రొఫెసర్ రేఖా జైన్, ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్లు విశ్వనాథ్ పింగళి, అంకుర్ సిన్హా దీన్ని తయారు చేశారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) మొబైల్ అప్లికేషన్ల చుట్టూ తిరిగే యాప్‌ల అభివృద్ధి, విక్రయం, ఇన్-యాప్ కొనుగోళ్లు, సబ్్రస్కిప్షన్లు, ప్రకటనల మొదలైన వాటి వ్యవస్థను యాప్ ఎకానమీగా నివేదిక వివరించింది. దీని ప్రకారం .. ప్రస్తుతం జీడీపీ 3,820 బిలియన్ డాలర్లుగా ఉండగా యాప్ ఎకానమీ 145 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీ 6,590 బిలియన్ డాలర్లకు చేరినప్పుడు ఇది 791.98 బిలియన్ డాలర్లకు చేరనుంది. జీడీపీ వృద్ధి కన్నా నాలుగు రెట్లు అధికంగా యాప్ ఎకానమీ 32 శాతం స్థాయిలో వృద్ధి చెందనుందని జైన్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ యూజర్ల పెరుగుదల, ఎకానమీ వృద్ధి ఇందుకు దోహదపడగలవని వివరించారు. (ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా) -
జస్టిస్ ఫర్ సుశాంత్
బాలీవుడ్లో బయటినుంచి వచ్చేవారికన్నా వారసులకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని, ఇక్కడ బంధుప్రీతి బాగా ఉంటుందని పలువురు ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌సింగ్ ఆత్మహత్యకు ఇదో కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరమ్ ఏర్పాటు చేసినట్లు నటుడు శేఖర్ సుమన్ ట్వీటర్లో పేర్కొన్నారు. ‘‘మంచి ప్రతిభ, బలమైన సంకల్పం ఉన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం నన్ను నిరాశకు గురిచేసింది. అతని ఆత్మహత్యకు గల కారణాలను కొందరు దాస్తున్నారు. వాటన్నింటినీ మా ఫోరమ్ వెలుగులోకి తీసుకొస్తుంది. తన ఆత్మహత్యపై సీబీఐ విచారణకు మా ఫోరమ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరమ్ పోరాడుతుంది. సినీ పరిశ్రమలోని గ్రూపు రాజకీయాలను, నిరంకుశత్వాన్ని అంతమొందించేందుకు పని చేస్తాం’’ అన్నారు. ఇప్పటికి మూడు సినిమాలు బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత షామిక్ మౌలిక్ దర్శకత్వంలో సుశాంత్ జీవితం ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు విజయ్‌శేఖర్ గుప్తా ప్రకటించారు. దర్శకుడు నిఖిల్ ఆనంద్ కూడా సుశాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా సుశాంత్ జీవితం ఆధారంగా ‘సుశాంత్’ అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు సునోజ్ మిశ్రా. ఇంతకుముందు ‘గాంధీ గిరి’, ‘శ్రీనగర్’ చిత్రాలను డైరెక్ట్ చేశారు సునోజ్ మిశ్రా. ‘సుశాంత్’ చిత్రం గురించి సనోజ్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోని వేధింపుల వల్ల కఠిన నిర్ణయాలు తీసుకున్నవారందరికీ సంబంధించినదే ఈ చిత్రం. రోడ్ ప్రొడక్షన్, సనోజ్ మిశ్రా ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ముంబై, బీహార్ లొకేషన్స్‌లో మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
మేలుకో.. మేలు తెలుసుకో
వినియోగదారులకు అండగా పౌర సరఫరాల శాఖ రిడ్రెసల్ సెల్, వినియోగదారుల ఫోరంమోసాల బారి నుండిచట్టం ద్వారా రక్షణనిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారమే లక్ష్యంఫోరంలో 94,105 కేసులకుగానూ 89,057 కేసుల పరిష్కారరిడ్రెసల్ సెల్లో 3,275 కేసులకు పరిష్కారం చట్టం.. వినియోగదారుల చుట్టం.. మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకే వినియోగదారుల చట్టం ఉంది. వినియోగదారుల ఫోరం పేరిట ఏర్పడిన ఈ చట్టానికి, 1986 డిసెంబర్ 24న రాష్ట్రపతి ఆమోదం లభించి, అదేరోజు నుండి అమల్లోకి వచ్చింది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా మూడు అంచెలుగా ఫోరం ఉంటుంది. రూ.20 లక్షల లోపు పరిహారం కోసం జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటిలోపు హైకోర్టు, రూ.కోటి పైబడి పరిహారం కోసం సుప్రీంకోర్టు వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే వినియోగదారుల ఫోరంలో నేరుగా కేసు దాఖలు చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర వినియో గదారుల ఫోరంలో నాలుగేళ్లలో 5,684 కేసులు నమోదు కాగా, 2,999 కేసులు పరిష్కార మ య్యాయి. 2,685 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరంలలో 94,105 కేసులు నమోదు కాగా, 89,057 కేసులు పరిష్కారమయ్యాయి. 5,048 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వినియోగదారులకు వారి హక్కులపట్ల అవగాహన కల్పించడమే కాకుండా, ఉచితంగా సమస్యలను పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించేలా పౌర సరఫరాలశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ఏర్పా టైంది. దీనికి వచ్చిన ఫిర్యాదులపై గత ఏడాది కాలంలో తూనికలు, కొలతల శాఖ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, విత్తన, ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, పెట్రోల్ పంపులు, వే బ్రిడ్జీలు, బహుళజాతి సంస్థల గోదాములు, నగల దుకాణాలు, ఫైర్ క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వ హించి 3,059 కేసులను నమోదు చేసి, రూ. 25.08 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసింది. సోమ వారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలలో పెండింగ్ కేసులను గడువులోగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదా రుల వ్యవహారాల విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కాలంలో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం హెల్ప్‌లైన్‌కు వివిధ అంశా లకు సంబంధించి 3,344 ఫిర్యాదులను నమోదు చేసింది. 3,275 కేసులను పరిష్కరించింది. ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం.. నష్టం జరిగిందని, మోసపోయామని భావించిన వినియోగదారులు రిడ్రెసల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలనకు స్వీకరించిన తరువాత ప్రతివాదుల సంజాయిషీకి రెండు, మూడు వారాల కాలపరిమితి విధిస్తూ నోటీసు జారీ చేస్తారు. ఒక నిర్ణీత తేదీనాడు వారిని కేంద్రానికి పిలిపించి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారు. ఇరుపక్షాలకు అంగీకారయోగ్యమైన పరిహారాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు. రిడ్రెసల్ సెల్లో ప్రతి శనివారం ఈ ‘కౌన్సెలింగ్’ నిర్వహిస్తారు. ఇది ఉచితం. సమస్య పరిష్కారంకాని పక్షంలో జిల్లా వినియోగదారుల ఫోరంకు కేసును బదిలీ చేస్తారు. బాధితులకు అండగా ఫోరం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. ఆ హక్కుకు భంగం కలిగితే ఒక తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో రాసి రాష్ట్ర వినియోగదారుల సమాచార, సలహా, సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. త్వరితగతిన సమస్యలు పరిష్కారం కావడంతో ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇలా.. ప్రతిచోట వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. అడుగడుగునా దగా పడుతూనే ఉన్నారు. తినే ఆహారం మొదలు వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల వరకు అన్నీ కల్తీ, నకిలీమయమే. రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్, బ్యాంకులు ఇలా రకరకాల సంస్థలు వినియోగ దారులను మోసం చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల్లో కల్తీల వల్ల అన్నదాత బలి అవుతున్నాడు. వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోగలిగితే ఇలాంటి మోసాల బారి నుంచి వినియోగదారుల చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు. – సాక్షి, హైదరాబాద్ ►రాంబాబు ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపులో రూ.30 వేలు పెట్టి ఎల్ఈడీ టీవీ కొన్నాడు. వారం తిరగక ముందే మరమ్మతుకు గురైంది. దాని స్థానంలో కొత్త టీవీ కావాలని కోరితే ఆ షాపు యాజమాన్యం నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ►ప్రశాంత్ ఓ హోల్‌సేల్ షాపులో నూనె ప్యాకెట్ కొని ఇంటికొచ్చి తెరిచి చూడగా అది నాసిరకమని తేలింది. ఇదేంటని షాపు సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రశాంత్‌ను అక్కడి నుంచి గెంటేశారు. -
స.హ చట్టం ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు
– ఫోరం ఫర్ ఆర్టీఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి – దేశానికే నష్టం: వైఎస్సార్సీపీ నేత కందుల దుర్గేష్ సాక్షి, రాజమహేంద్రవరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కారు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, ఆర్టీఐ కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఫోరం జిల్లా కన్వీనర్ వరదా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల 70 శాతం అవినీతి అంతమవుతుందన్న సమయంలో ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దీన్ని రాజకీయ నేతలు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. స.హ. చట్టానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తమ పార్టీ నేతలతో చర్చించి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆర్టీఐ లేకపోతే దేశానికే నష్టమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ తమ పార్టీ తరఫున చట్ట సవరణకు వ్యతిరేకత తెలియజేస్తామని చెప్పారు. కార్పొరేటర్ కోసూరి చండీ ప్రియ మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టీఐ చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పిల్లి నిర్మల, రెడ్డి పార్వతి, పితాని లక్ష్మి కుమారి, ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ కార్యకర్త చేతన్, జనం పత్రిక సంపాదకులు కె.వెంకటరమణ, బీసీ నేత హారిక, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఫోరంతో సమస్యల పరిష్కారం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ ఫోరంను అందుబాటులోకి తీసుకువచ్చామని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కన్సూ్యమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరమ్ చైర్పర్సన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డి.ధర్మారావు అన్నా రు. శనివారం స్థానిక డీఈఈ కార్యాలయంలో విద్యుత్ విని యోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పలు సమస్యలపై ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ధర్మారావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు, బిల్లింగ్‌లో సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడానికి నిరాకరణ, ఇతర సమస్యలను ఫోరం తక్షణమే పరిష్కరిస్తుందన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1912ను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్ 2 నుంచి ఇప్పటివరకు 201 కేసుల విషయంలో తీర్పులు చెప్పామన్నారు. బిల్లింగ్‌లో 112, మీటరు సమస్యలు 8, లోవోల్టేజీ సమస్యలు 10, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఫోరం ఏర్పాటుతో 5 జిల్లాల్లోనూ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అధికారులు కె.బాలాజీ, పీవీ రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, డీఈఈ ఎస్.జనార్దన్‌రావు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
అనూర్‌లో జియోఫోరమ్ ఆవిష్కరణ
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : భూగర్భ, భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఒకేతాటి పైకి వచ్చి దేశాభివృద్దికి తోర్పాటునందించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో భూగర్భ శాస్త్ర విభాగంలో ఏర్పాటుచేసిన జియో ఫోరమ్ లోగోను బుధవారం ఆయన ఆవిష్కరించారు. భూగర్బ శాస్త్రంలో నిష్ణాతులైన వారిని ఒక గొడుగు కిందకు చేర్చి విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయోగపడేలా చేయడమే ఈ ఫోరమ్ లక్ష్యమన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని నిష్ణాతులతో సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఓఎన్జీసీకి చెందిన భూగర్భ శాస్త్రజ్ఞులు డాక్టర్ డీఎస్ఎస్ రాజు, ఏవీవీఎస్ కామరాజు, రాష్ట్ర భూగర్భ జలశాఖ విశ్రాంత శాస్త్రజ్ఞులు జి. శేషుబాబు, ఉండవల్లి రవికుమార్‌లను వీసీ దుశ్శాలువాలతో సత్కరించారు. -
‘సూదాపాలెం’ ఘటన అనాగరికం
తెలుగు రాష్ట్రాల ఆఫీసర్స్ ఫోరం ఉపాధ్యక్షుడు భరత్ భూషణ్ అమలాపురం : సూదాపాలెంలో ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితులపై.. అసలేం జరుగుతుందో వాస్తవాలను గ్రహించకుండా, అనాగరికంగా దాడులు చేశారని ఏపీ, తెలంగాణ ఆఫీసర్స్ ఫోరం తీవ్రంగా ఖండించింది. సూదాపాలెంలోని ఘటనా స్థలాన్ని ఆదివారం సందర్శించిన ఫోరం బృందం.. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించింది. అమలాపురం జానకిపేటలోని బాధిత దళితులకు ఫోరం ఉపాధ్యక్షుడు అతిపట్ల భరత్‌భూషణ్‌తో కూడుకున్న ప్రతినిధుల బృందం ధైర్యం చెప్పింది. అనంతరం అక్కడే దళిత నాయకులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో భరత్ భూషణ్ మాట్లాడుతూ సూదాపాలెం ఘటనలో అసలైన దోషులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని విమర్శించారు. అప్పుడు దళితులు గాయపడినా, పోలీసులు వారిపై సానుభూతి చూపకుండా, దాడి చేసిన వారికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఆరోపించారు. దాడి సమయంలో అలక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎం.సిద్ధోజీ డిమాండ్ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. రోహిత్ వేముల తల్లి వేముల రాధిక, సోదరుడు రాజా, ఫోరం ప్రతినిధి కావూరి కరుణాకర్, దళిత నాయకులు బొంతు రమణ, గెల్లా వెంకటేష్, జల్లి శ్రీనివాసరావు, పరమట రాంప్రసాద్, పెయ్యల శ్రీనివాసరావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కన్వీనర్ కొంకి రాజామణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్ధికి డబ్బులు కట్టిన యూనివర్సిటీ!
ఠాణే: మధురై కామరాజు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థికి కళాశాలకు చెందిన అన్ని రకాల సదుపాయాలను కల్పించడంలో విఫలం చెందినందుకు కన్జ్యూమర్ రీడ్రస్సల్ ఫోరమ్ ఫైన్ కింద రూ.20,000 చెల్లించాలంటూ ఆదేశించింది. స్నేహా మహత్రే సారధ్యం వహిస్తున్న ఫోరమ్ మెంబర్లు మాధురి విశ్వరూపే, ఎన్డీ కదమ్‌లు ముందు వచ్చే పరీక్షలకు విద్యార్థిని అనుమతించాలంటూ కేంద్రానికి సూచనలు చేసింది. మత్స్య శాస్త్రంపై 2013లో కులకర్ణి విశ్వవిద్యాలయంలో చేరి, ఫీజు కింద రూ.7,300లను చెల్లించాడు. కానీ, అకడమిక్స్‌కు సంబంధించిన ఎటువంటి పుస్తకాలు విద్యార్ధికి చేరకపోవడంతో 2014లో కోర్సు పూర్తికావాల్సి ఉండగా కాలేదని, కోర్సు పూర్తయి ఉంటే నెలకు రూ.4000 జీతంతో తనకు ఉద్యోగం లభించి ఉండేదని ఫోరమ్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు నష్టపరిహారం కింద రూ.40,000 ఇప్పించాలని ఫోరమ్‌ను కోరాడు. ఫిర్యాదుపై ఫోరమ్ ముందు హాజరుకావాలని స్టడీ సెంటర్, మధురైలో ఉన్న యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. గడువులోపు ఫోరమ్ ముందు హాజరుకాకపోవడంతో విద్యార్ధికి ఏప్రిల్‌లోగా ఇరవై వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే అప్పటి నుంచి ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని హెచ్చరించింది. -
నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల జాబితా విడుదల
-
‘సర్వే’పై సవాలక్ష అనుమానాలు!
చర్చావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పలు అనుమానాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫిలింనగర్ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా భవన్లో శుక్రవారం చర్చావేదికను నిర్వహించారు. స్థానిక ఇంటింటి సమగ్ర సర్వే క్లస్టర్ ఆఫీసర్లు మల్లెల గిరి, జయకృష్ణతో పాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఫిలింనగర్ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావుతో పాటు 32 స్వయం సహాయక బృందాల అధ్యక్షురాళ్లు ఇందులో పాల్గొన్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేయగా... వాటిని అధికారులు నివృత్తి చేశారు. బంజారాహిల్స్: ఇంటింటి సర్వే నిమిత్తం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లు పూర్తి స్నేహభావంతో మెలుగుతూ వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా వారికి వచ్చే అపోహలు కూడా తొలగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా వారికి సంక్షేమ పథకాలు అందవని అంటున్నారని ప్రజ్వల గ్రూప్ అధ్యక్షురాలు సాంబమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. యజమాని సరైన వివరాలు ఇస్తే చాలని క్లస్టర్ ఆఫీసర్ జయకృష్ణ వెల్లడించారు. సర్వే చేసే ఎన్యూమరేటర్లు అణువనువూ సోదా చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయని సరస్వతి మహిళా గ్రూప్ అధ్యక్షురాలు సుగుణ, మహాలక్ష్మి గ్రూప్ అధ్యక్షురాలు చంద్రమ్మ, గంగ గ్రూప్ అధ్యక్షురాలు పద్మమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని రెక్కాడితో డొక్కాడని స్థితిలో ఉన్నామని ఈ పరిస్థితిలో తెల్లరేషన్ కార్డు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నామని ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు ధనలక్ష్మి, కనకదుర్గ గ్రూప్ అధ్యక్షురాలు పద్మ, తేజస్విని గ్రూప్ అధ్యక్షురాలు గోవిందమ్మ, జ్యోతి గ్రూపు అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, కుందన గ్రూప్ అధ్యక్షురాలు కౌసల్య వాపోయారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే ఏంటంటూ పలువురు మహిళలు దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తే ప్రమాదం కదా అని శ్రీ రాజరాజేశ్వరి గ్రూప్ అధ్యక్షురాలు రమ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద వారిని వదిలేసి మాలాంటి వాళ్లను లక్ష్యంగా పెట్టుకుంటారా అని బీజేఆర్ నగర్ సమాఖ్య అధ్యక్షురాలు మల్లీశ్వరి, బసవతారకం నగర్ సమాఖ్య అధ్యక్షురాలు యాదీశ్వరి అన్నారు. బడుగులకు వేధింపులా? సర్వే రోజున కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ సర్వే ఎందుకో తెలియడం లేదు. మా కార్డులు తొలగిస్తారని భయంగా ఉంది. బడుగులను వేధించకుండా బడాబాబులను లక్ష్యంగా పెట్టుకుంటే మంచిది. - ఆర్.విజయరత్నం, శ్రీ రాజరాజేశ్వరి మహిళా గ్రూపు ఆందోళన వద్దు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితమైన సమాచారం ప్రజల నుంచి స్వీకరించడానికే సర్వే జరుగుతున్నది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేయడానికి సర్వే చేస్తున్నాం. - మల్లెల గిరి, సర్వే క్లస్టర్ అధికారి -
చిట్ ఫండ్ మోసాలపై ఫోరం
ముంబై: చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారిం చాయి. ఈ పథకాలపై ప్రభుత్వ విభాగాలు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపిం ది.ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారధ్యంలో జరిగిన సమావేశంలో సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ చీఫ్‌లు పాల్గొన్నారు. కొత్తగా ఆర్బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టబోతున్న రాజన్ కూడా హాజరయ్యారు.