అనూర్‌లో జియోఫోరమ్ ఆవిష్కరణ
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : భూగర్భ, భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఒకేతాటి పైకి వచ్చి దేశాభివృద్దికి తోర్పాటునందించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో భూగర్భ శాస్త్ర విభాగంలో ఏర్పాటుచేసిన జియో ఫోరమ్ లోగోను బుధవారం ఆయన ఆవిష్కరించారు. భూగర్బ శాస్త్రంలో నిష్ణాతులైన వారిని ఒక గొడుగు కిందకు చేర్చి విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయోగపడేలా చేయడమే ఈ ఫోరమ్ లక్ష్యమన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని నిష్ణాతులతో సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఓఎన్‌జీసీకి చెందిన భూగర్భ శాస్త్రజ్ఞులు డాక్టర్ డీఎస్‌ఎస్ రాజు, ఏవీవీఎస్ కామరాజు, రాష్ట్ర భూగర్భ జలశాఖ విశ్రాంత శాస్త్రజ్ఞులు జి. శేషుబాబు, ఉండవల్లి రవికుమార్‌లను వీసీ దుశ్శాలువాలతో సత్కరించారు.