‘అనూర్’ని ఆదర్శ వర్సిటీగా అభివృద్ధి చేస్తా
బోర్డ్ ఆఫ్ స్టడీస్ పరిశ్రమల వారికి చోటు
ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ ధనుంజయరావు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :ఆదికవి నన్నయ యూనివర్సిటీని దేశంలో ఒక ఆదర్శప్రాయమైన యూనివర్సిటీగా అభివృద్ధి చేసేం దుకు కృషి చేస్తానని ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఈఎన్ ధనుం జయరావు అన్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ యూనివర్సిటీని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు అనేక పథకాలను సిద్ధం చేశామన్నా రు. సంప్రదాయ, ఆధునికతలను మేళవించి దేశం నలుదిశలా ఖ్యాతి విస్తరించేలా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం లోని పెద్దలతోపాటు విద్యాపరంగా విశిష్ట అనుభవం ఉన్న వారి సలహా, సూచనలను తీసుకుంటామన్నారు.
ప్రస్తు తం ఉన్న ‘రీసెర్చ్ ఫోరమ్’ని మరిం త పటిష్టపరచి, విద్యతోపాటు పరిశోధనకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి, ప్రత్యేక ప్రసంగా లు ఇప్పించడం ద్వారా పరిశోధకు లు, విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా చూస్తామన్నారు. యూనివర్సిటీలో అమలు చేస్తున్న వివిధ విద్యా కార్యక్రమాలు, పరిశోధనా ఫలితాలు, అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థు లు సాధించిన విజయాలను వివరిస్తూ మూడు మాసాలకొకసారి ‘న్యూస్ బులెటిన్’ ప్రచురిస్తామన్నారు.
గాంధీ - సుస్థిర ప్రగతి అధ్యయన కేంద్రం..
యూనివర్సిటీలో దేశంలోనే మొదటి సారిగా ‘గాంధీ - సుస్థిర ప్రగతి అధ్యయన కేంద్రాన్ని’ ఏర్పాటు చేయనున్నామని ఇన్చార్జి వీసీ తెలిపారు. ఈ కేంద్రంలో మహాత్ముని ఆలోచనా విధానాలతోపాటు ఆయన ఆచరించిన సామాజిక, ఆర్థిక విధానాలు, గ్రామీణ పరిశ్రమలు మున్నగు అంశాల పై పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాలను మరింతగా వృద్ధి చేసేందుకు ‘స్కిల్ డెవలప్మెంట్ సెల్’ని నెలకొల్పదలచామన్నారు. దీని ద్వారా విద్యార్థులకు వివిధ వృత్తులలో శిక్షణ ఇవ్వడంతో పాటు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. వీటి వలన విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడంతోపాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న ్ర‘టైనింగ్ అండ్ ప్లేస్మెంట్’ కేంద్రాన్ని పటిష్టపరచి వివిధ సంస్థలను ఆహ్వానించడం ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా ప్రయత్నిస్తామన్నారు. పరిశ్రమలతో యూనివర్సిటీకి అనుబంధాన్ని పెంచే విధంగా ‘బోర్డ్ ఆఫ్ స్టడీస్’ లో నిపుణులను, పరిశ్రమలకు, బయటి సంస్థలకు సంబంధించిన వారిని సభ్యులుగా నియమిస్తామన్నారు.
వీసికి అభినందనల వెల్లువ
ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఈఎన్ ధనుంజయరావుకు సహచరులు, పలువురు ఉద్యోగులు పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందించారు. డెవలప్మెంట్ అధికారి డాక్టర్ జి.గవర్రాజు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ కె.సుబ్బారావు, ప్రొఫెసర్ వై.శ్రీనివాసరావు, డీన్స్ ప్రొఫెసర్ సురేష్‌వర్మ, ప్రొఫెసర్ కేఎస్ రమేష్, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ మీరాస్వామి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.