ఇంటర్నెట్ వినియోగంలో ఎగబాకుతున్న భారత్!
హైదరాబాద్: మనిషి జీవితంలో ప్రస్తుతం ఇంటర్నెట్కు ఎంత ప్రాధాన్యత పెరిగిపోయిందో అందరికీ తెలుసు. మొబైల్కు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో దాని వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇంటర్నెట్ వినియోగంలో 2016 నాటికి భారత్ ప్రపంచంలో రెండవ స్థానానికి ఎగబాకుతుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం భారత్లో నెట్ యూజర్ల సంఖ్య 28.38 కోట్లకు చేరనున్నట్లు ఈమార్కెటర్ నివేదిక ఒకటి తెలుపుతోంది.
ప్రస్తుతం భారత్లో మొబైల్ మార్కెట్ 350 కోట్ల రూపాయలు ఉంది. ఇది 2019 నాటికి 1210 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంచనా. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరిగిపోతుండటం వల్లే మొబైల్ మార్కెట్ విస్తరిస్తోంది. ఆ రకంగా ఇంటర్నెట్ వినియోగదారులు పెరిగిపోయే అవకాశం ఉంది.
**