
వచ్చే ఏడాది 50 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వచ్చే ఏడాది 50 కోట్లకు చేరుతుందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం 40 కోట్ల ఇంటర్నెట్ యూజర్లున్నారని చెప్పారు. ప్రస్తుత జోరు చేస్తే వచ్చే ఏడాదిలోనే ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలియజేశారు. రానున్న సంవత్సరాల్లో ఆప్టికల్ ఫైబర్ ద్వారా రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక గ్రామాన్ని డిజిటల్ విలేజ్‌గా ఎంపిక చేసి, టెక్నాలజీ సాయంతో విద్యా, ఆరోగ్య సరంక్షణ సేవలందిస్తామని, వర్చువల్ క్లాస్‌రూమ్‌గా పనిచేసేలా రిసోర్స్ సెంటర్‌గా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దుతామని, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.