ఇంటర్నెట్ యూజర్లు
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2018 జూన్ నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా. ఐఎంఏఐ–కంటర్ ఐఎంఆర్‌బీ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
∙ 2017 డిసెంబర్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.34 శాతం వృద్ధితో 48.1 కోట్లకు చేరింది.
∙ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2017 డిసెంబర్ నాటికి వార్షిక ప్రాతిపదికన 9.66 శాతం వృద్ధితో 29.5 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 14.11 శాతం వృద్ధితో 18.6 కోట్లకు పెరిగి ఉండొచ్చు.
∙ దేశీ మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో విద్యార్థులు, యువత వాటా దాదాపు 60%.
∙ ఇంటర్నెట్‌ను ప్రతి రోజూ వినియోగిస్తున్న వారి సంఖ్య 18.29 కోట్లుగా ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment