imai
-
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ ‘నిషేధం’ ఎత్తివేత
న్యూఢిల్లీ: వివాదాస్పద క్రిప్టోకరెన్సీ అంశంపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఈ కరెన్సీలకు సంబంధించిన సేవలను అందించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను పక్కన పెట్టింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ ’నిషేధా’న్ని సవాల్ చేస్తూ .. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఓవైపు వర్చువల్ కరెన్సీలను నిషేధించలేదని ఆర్బీఐ చెబుతోందని, మరోవైపు అనేక కమిటీలు వేసినా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతోందని.. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ సరికాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెడితే.. బిట్కాయిన్ల వంటి వర్చువల్ కరెన్సీలతో ఆర్థిక నష్టాలతో పాటు అనేక రిస్కులు పొంచి ఉన్నాయని 2013లో ఆర్బీఐ హెచ్చరించింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 6న మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం వర్చువల్ కరెన్సీ లావాదేవీలు జరిపే ఎవరికీ సర్వీసులు అందించరాదంటూ తన పరిధిలో పనిచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది. దీంతో క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించినట్లయింది. దీన్ని సవాలు చేస్తూ 2018 జూలై 3న ఐఎంఏఐ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎకానమీపై క్రిప్టోకరెన్సీల ప్రభావాల గురించి గతంలో అధ్యయనాలేమీ జరగలేదని, కేవలం నైతికత ప్రాతిపదికగా ఆర్బీఐ వీటిని నిషేధించిందని వాదించింది. అయితే, ఆర్బీఐ సర్క్యులర్‌పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర సమాచార..సాంకేతిక శాఖను ఆదేశించింది. ఈ కేసులోనే తాజా తీర్పునిచ్చింది. -
ఇంటర్నెట్ యూజర్లు@50 కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2018 జూన్ నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా. ఐఎంఏఐ–కంటర్ ఐఎంఆర్బీ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ∙ 2017 డిసెంబర్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.34 శాతం వృద్ధితో 48.1 కోట్లకు చేరింది. ∙ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2017 డిసెంబర్ నాటికి వార్షిక ప్రాతిపదికన 9.66 శాతం వృద్ధితో 29.5 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 14.11 శాతం వృద్ధితో 18.6 కోట్లకు పెరిగి ఉండొచ్చు. ∙ దేశీ మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో విద్యార్థులు, యువత వాటా దాదాపు 60%. ∙ ఇంటర్నెట్ను ప్రతి రోజూ వినియోగిస్తున్న వారి సంఖ్య 18.29 కోట్లుగా ఉండొచ్చు. -
రౌడీ జీవిత కథతో ఇమై
తమిళసినిమా: ఒక రౌడీ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ఇమై అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ కే.మోహన్ తెలిపారు. కేబీ.ఫ్యామిలీ ప్రొడక్షన్స్ పతాకంపై హార్తీ వీ.డోరి నిర్మిస్తున్న చిత్రం ఇమై. చరీష్, అక్షయప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి కే.ప్రదీప్ ఛాయాగ్రహణను, మిక్కు కావిల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కే.మోహన్ చిత్ర వివరాలను తెలుపుతూ తాను ఒక రోజు రైల్లో పయనిస్తుండగా ఎదురు సీటులో వ్యక్తి మౌనంగా కూర్చున్నాడన్నారు. తాను నెమ్మదిగా ఆ వ్యక్తిని మాటల్లోకి దింపానన్నారు. అతడు కోయంబత్తూర్ వ్యక్తిగా తెలిసిందన్నారు. ఏం చేస్తుంటారన్న ప్రశ్నకు రౌడీనని చెప్పడంతో తనకు నోట మాట రాలేదన్నారు. మనసును కుదుట పరచుకుని అతనితో మాట్లాడగా అతని జీవితంలోఓ ప్రేమకథ ఉందని తెలిసిందన్నారు. ఆ రౌడీ జీవిత కథతో సినిమా రూపొందిం చాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అతని ఫోన్ నెంబరు తీసుకుని తరువాత మరిన్ని వివరాలను సేకరించి చిత్రంగా తెరకెక్కించడానికి అనుమతి కోరగా తను సరేనన్నాడన్నారు. పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసి అతనికి వినిపించగా క్లైమాక్స్ మారిందే అని అన్నాడని, అందుకు తాను సినిమా కోసం అలా మార్చానని వివరించానన్నారు. అలా తెరకెక్కించిన చిత్రం ఇమై అని తెలిపారు. ఈ చిత్ర హీరో చరీష్ 15 ఏళ్లుగా అవకాశాల కోసం పోరాడుతున్నారని, ఆయన ద్వారా ఈ చిత్రానికి నిర్మాత లభించారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.