రౌడీ జీవిత కథతో ఇమై | Imai Movie Audio Launch | Sakshi
Sakshi News home page

రౌడీ జీవిత కథతో ఇమై

Sep 19 2017 4:21 AM | Updated on Sep 19 2017 4:44 PM

రౌడీ జీవిత కథతో ఇమై

రౌడీ జీవిత కథతో ఇమై

ఒక రౌడీ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ఇమై అని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ కే.మోహన్‌ తెలిపారు.

తమిళసినిమా:  ఒక రౌడీ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ఇమై అని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ కే.మోహన్‌ తెలిపారు. కేబీ.ఫ్యామిలీ ప్రొడక్షన్స్‌ పతాకంపై హార్తీ వీ.డోరి నిర్మిస్తున్న చిత్రం ఇమై. చరీష్, అక్షయప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి కే.ప్రదీప్‌ ఛాయాగ్రహణను, మిక్కు కావిల్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ కే.మోహన్‌ చిత్ర వివరాలను తెలుపుతూ తాను ఒక రోజు రైల్లో పయనిస్తుండగా ఎదురు సీటులో వ్యక్తి మౌనంగా కూర్చున్నాడన్నారు. తాను నెమ్మదిగా ఆ వ్యక్తిని మాటల్లోకి దింపానన్నారు. అతడు కోయంబత్తూర్‌ వ్యక్తిగా తెలిసిందన్నారు. ఏం చేస్తుంటారన్న ప్రశ్నకు రౌడీనని చెప్పడంతో తనకు నోట మాట రాలేదన్నారు. మనసును కుదుట పరచుకుని అతనితో మాట్లాడగా అతని జీవితంలోఓ ప్రేమకథ ఉందని తెలిసిందన్నారు. ఆ రౌడీ జీవిత కథతో సినిమా రూపొందిం చాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

అతని ఫోన్‌ నెంబరు తీసుకుని తరువాత మరిన్ని వివరాలను సేకరించి చిత్రంగా తెరకెక్కించడానికి అనుమతి కోరగా తను సరేనన్నాడన్నారు. పూర్తిగా స్క్రిప్ట్‌ రెడీ చేసి అతనికి వినిపించగా క్‌లైమాక్స్‌ మారిందే అని అన్నాడని, అందుకు తాను సినిమా కోసం అలా మార్చానని వివరించానన్నారు. అలా తెరకెక్కించిన చిత్రం ఇమై అని తెలిపారు. ఈ చిత్ర హీరో చరీష్‌ 15 ఏళ్లుగా అవకాశాల కోసం పోరాడుతున్నారని, ఆయన ద్వారా ఈ చిత్రానికి నిర్మాత లభించారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు  చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement