న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారత నెటిజన్ల సంఖ్య ప్రస్తుతం 7.39 కోట్లకు చేరింది. దీంతో అత్యధిక మంది ఇంటర్‌నెట్ వినియోగదారులు ఉన్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో నిలిచింది. మనదేశంలో నెటిజన్ల సంఖ్య ఏటా 31 శాతం పెరుగుతోందని, ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత అత్యధికమంది నెటిజన్లు ఉన్న దేశంగా భారత్ నిలిచిందని ఈ మేరకు కామ్‌స్కోర్ అనే కంపెనీ వెల్లడించింది. ‘ఇండియా డిజిటల్ ఫ్యూచర్ ఇన్ ఫోకస్ 2013’ పేరుతో ఆ కంపెనీ ఓ నివేదిక విడుదల చేసింది. అదేవిధంగా భారత్‌లో ఆన్‌లైన్ బిజినెస్ కూడా గణనీయంగా పెరుగుతోందని, మొబైల్ ఫోన్‌తో ఇంటర్‌నెట్ వాడేవారి సంఖ్యా అధికమవుతోందని కామ్‌స్కోర్ పేర్కొంది.