స్మార్ట్‌ఫోన్ల వాడకం అంతకంతకు పెరిగిపోవడం, సరసమైన ధరల్లో డేటా అందుబాటులోకి రావడం వంటి వాటితో యూట్యూబ్ వాడకం రోజురోజుకి పెరుగుతోంది. దేశంలోని అన్ని వయస్సు గ్రూప్‌ల్లో 80 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్‌ను యాక్సస్ చేస్తున్నట్టు గూగుల్ ఇండియా తెలిపింది. ‘బ్రాడ్‌కాస్ట్ 2018’ ఈవెంట్ సందర్భంగా దేశీయ ఇంటర్నెట్ వృద్ధిలో యూట్యూబ్ ఎలా అసోసియేట్ అయి ఉంది అనే అంశాన్ని హైలెట్ చేసింది. బ్రాండుల పరంగా యూట్యూబ్ అనేది ప్రస్తుతం ఎండ్-టూ-ఎండ్ ప్లాట్‌పామ్ అని గూగుల్ ఆగ్నేయ ఆసియా వైస్-ప్రెసిడెంట్ రాజన్ అనందన్ తెలిపారు. కేవలం మొబైల్‌లోనే 225 మిలియన్ మంది నెలవారీ యాక్టివ్ యూజర్లును తాకినట్టు పేర్కొన్నారు.
వీడియో ప్లాట్‌ఫామ్‌లో భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా కంపెనీ పేర్కొంది. లక్షల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో 300 పైగా ఛానల్స్ ఉన్నాయని, 2014లో ఇవి కేవలం 16 ఉన్నట్టు యూట్యూబ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాబర్ట్ చెప్పారు. క్రియేటర్లకు సపోర్టు చేయడానికి, మరింత వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, కంటెంట్ పంపిణీ వంటి ప్రొగ్రామ్స్‌లో తాము ఎల్లప్పుడూ పెట్టుబడులు పెడుతూనే ఉంటామన్నారు. 2020 నాటికి మొత్తం ఆన్‌లైన్ వీడియో కన్జ్యూమర్లు 500 మిలియన్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment