
వెంకటేశ్
త్వరలో వెంకటేశ్ తన కెరీర్‌లో 75వ మైలురాయిని టచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ ఆయన కెరీర్‌లో 73వ చిత్రం. ఈ 73 చిత్రాల్లో 20కి పైగా రీమేక్ చిత్రాలు ఉండటం విశేషం. వాటిలో సుందరాకాండ, రాజా, జెమిని, వసంతం, ఘర్షణ, గోపాల గోపాల, బాడీగార్డ్, దృశ్యం, గురు.. ఇలాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకీ మరో రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘అసురన్’ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించనున్నారు.
ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరులో విడుదలైన ‘అసురన్’ ఘనవిజయం సాధించింది. తెలుగు రీమేక్‌ని సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ పతాకాలపై కలైపులి యస్. థాను, డి. సురేశ్‌బాబు నిర్మించనున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. వెంకటేశ్ కెరీర్‌లో ఇది 74వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment