
విక్టరీ హీరో వెంకటేష్, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 4న రిలీజ్ చేయాలని భావించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో వెంకీమామ టీం ఆలోచనలో పడ్డారు. సైరా లాంటి సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని భావిస్తున్నారట. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కు తమన్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment