‘వెంకీమామ’ ఫస్ట్‌ లుక్‌ | Venkatesh And naga Chaitanya Venky Mama First Look Released | Sakshi
Sakshi News home page

‘వెంకీమామ’ ఫస్ట్‌ లుక్‌

Published Sat, Apr 6 2019 3:40 PM | Last Updated on Sat, Apr 6 2019 3:40 PM

Venkatesh And naga Chaitanya Venky Mama First Look Released - Sakshi

‘ఎఫ్‌2’ తో మంచి హిట్‌ను కొట్టిన విక్టరీ వెంకటేష్‌.. మళ్లీ తనదైన శైలీలో వెంకీమామ చిత్రాన్ని పట్టాలెక్కించారు. నాగచైతన్య, వెంకటేష్‌లు కలిసి నటించడంతో ఈ చిత్రంపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం.

రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేష్‌, నాగ చైతన్యలు రీల్‌ లైఫ్‌లో కూడా అవే పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను చూస్తే.. మామా అల్లుళ్లు ఇద్దరూ మంచి స్నేహితుల్లా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మజిలీ చిత్రానికి మంచి స్పందన రావడంతో నాగ చైతన్య ఫుల్‌ ఖుషీగా ఉన్నాడని సమాచారం. ఇక ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తుండగా..  సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement