మామా అల్లుడి పాటల సందడి | Venky Mama First Song Launch Today | Sakshi
Sakshi News home page

మామా అల్లుడి పాటల సందడి

Published Thu, Nov 7 2019 12:51 AM | Last Updated on Thu, Nov 7 2019 4:23 AM

Venky Mama First Song Launch Today - Sakshi

నాగచైతన్య, వెంకటేశ్

రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో కథానాయికలు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. అందులో భాగంగా ఈ చిత్రంలోని తొలి పాటని నేడు (గురువారం) విడుదల చేస్తున్నారు. ‘‘ఈ పాట మీ హృదయాల్ని హత్తుకుంటుంది. మా మామాఅల్లుళ్ల తరఫున ఈ పాటను ప్రతి మామాఅల్లుడికి అంకితం ఇస్తున్నాం’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement