
రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రంలో కథానాయికలు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. చైతన్య పుట్టినరోజు సందర్భంగా(నవంబర్ 23) అక్కినేని అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. చైతూకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘అల్లుడు బర్త్‌డే గ్లింప్స్’ విడుదల చేశారు.
‘నా మేనల్లుడి లవ్ స్టోరీ టైటానిక్ రేంజ్‌లో ఉంటుందనుకున్నాను.. కనీసం ఊళ్లో పడవ రేంజ్‌లో కూడా లేదురా’.. అని వెంకటేశ్ అంటే, ‘నేను మత్తులో ఉండి ఏం చెప్పానో, నువ్వు మందులో ఉండి ఏం విన్నావో.. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా విను’ అంటూ చైతు చెప్పడంతో ఈ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ‘నా మేనల్లుడు సార్, వాడిక్కడే మిలటరీలో ఉన్నాడు సార్’ అని వెంకీ, ‘కెప్టెన్ కార్తీక్ శివరామ్.. వీరమాచినేని’ అని ప్రకాష్ రాజ్, ‘వాడు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించొస్తాను సార్’ అంటూ చైతన్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక చైతూ, రాశీఖన్నాలా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సరదా సన్నివేశాలు, సీరియస్ డైలాగ్స్‌తో సాగిన బర్త్‌డే గ్లింప్స్ అక్కినేని, దగ్గుపాటి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment