
రాశీ ఖన్నా ఫుల్Š ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి. డ్యాన్స్ చేస్తే ఆనందపడటం ఏంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులకు ఆరేడు నెలలు బ్రేక్ పడింది కదా. దుకని రాశీ డ్యాన్స్ ని మిస్సయ్యారు. ప్రస్తుతం తమిళ చిత్రం ’అరణ్ మణై’ సీక్వెల్ లో నటిస్తున్నారామె. తమిళనాడులోని పొల్లాచ్చిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ’’డ్యాన్స్ చేసి చాలా రోజులయింది. అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు రాశీ ఖన్నా. సుందర్. సి. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్య, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు.